Sakshi News home page

మానవ పరిణామాన్ని ప్రభావితం

Published Wed, Dec 7 2016 4:53 AM

మానవ పరిణామాన్ని ప్రభావితం

చేస్తున్న సిజేరియన్ జననాలు

 లండన్: ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళల్లో సహజ ప్రసవం అయిన వారిసంఖ్య చాలా తక్కువ. మెజారిటీ సందర్భాల్లో వైద్యులు సిజేరియన్‌కే ప్రాధాన్యత ఇస్తుంటారనేది తెలిసిన విషయమే. అరుుతే ఇలా సిజేరియన్ కాన్పులు చేయడం వల్ల మానవ పరిణామ క్రమంపై తీవ్ర ప్రభావం పడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం తల్లులవుతున్న అనేకమంది మహిళల్లో ప్రసవ వాహిక పరిమాణం కుంచించుకు పోవడంతో వారికి సిజేరియన్ ద్వారా ప్రసవం చేయడం తప్పనిసరిగా మారిందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రసవ వాహిక పరిమాణం బిడ్డ బయటికి వచ్చేందుకు సరిపోదని తేల్చిన కేసుల సంఖ్య 1960లో వెయ్యికి 30 ఉండగా ప్రస్తుతం అవి 36కి పెరిగారుు. అయితే పురిటి నొప్పుల్లో తల్లీ బిడ్డ మరణించిన కేసులను పరిశీలిస్తే దీనికి సంబంధించిన జన్యువులు తల్లి నుంచి బిడ్డకు బదిలీ కాలేదని నిర్ధారణ అరుుంది.

ఎటువంటి ఆధునిక వైద్య సదుపాయాలు లేని కాలంలో తక్కువగా ఉన్న ఈ కేసుల సంఖ్య ప్రస్తుతం పెరిగి పోవడానికి కారణం మానవ పరిణామ క్రమంలో వచ్చిన మార్పేనని,  ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ వియన్నాకు చెందిన డాక్టర్ ఫిలిప్ మిట్టరోయికర్ అన్నారు. వందేళ్ల క్రితం పెల్విస్ చాలా ఇరుకుగా ఉండే మహిళలు ప్రసవ సమయంలో బతికే అవకాశం చాలా తక్కువగా ఉండేది, వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో వీరు సురక్షితంగా బయటపడటంతోపాటు తమ జన్యుక్రమాన్ని తమ కుమార్తెలకు అందజేస్తున్నారు. దీంతో  ప్రస్తుతం ఇటువంటి కేసుల సంఖ్య పెరుగుతోందని డాక్టర్ ఫిలిప్ పేర్కొన్నారు. చింపాంజీల వంటి జంతువులతో పోల్చితే మానవుల్లో పెల్విన్ పరిమాణం ఎందుకు సరిపోయేంతగా ఉండదనేది దీర్ఘకాలిక ప్రశ్నగా మిగిలిపోరుుందన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement