Sakshi News home page

స్పేస్‌ టికెట్‌పై బ్రిటన్‌ హైకోర్టుకు ఈడ్చిన మాజీ భార్య

Published Sun, Feb 5 2017 3:00 PM

స్పేస్‌ టికెట్‌పై బ్రిటన్‌ హైకోర్టుకు ఈడ్చిన మాజీ భార్య

లండన్‌: భారత సంతతికి చెందిన ఆశిష్‌ ఠక్కర్‌ను ఆయన మాజీ భార్య మీరా మానెక్‌ బ్రిటన్‌ హైకోర్టుకు ఈడ్చింది. విడాకుల నేపథ్యంలో ఆమె రావాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా ఆస్తులు తక్కువగా చూపిస్తున్నాడంటూ ఆమె కోర్టు మెట్లెక్కింది. ఇంతకీ అతడు లెక్క చూపించని ఆస్తి ఏమిటో తెలుసా.. అంతరిక్ష యాత్రకు సంబంధించిన టికెట్‌. దానికోసం కోర్టుదాకా వెళ్లాల అనుకోకండి. ఎందుకంటే దాని విలువ ఏకంగా లక్షా అరవైవేల పౌండ్లు.

దీనిని కూడా అతడి ఆస్తిగానే పేర్కొంటే అందులో కనీసం 30శాతం ఆమెకు భరణంగా వస్తుంది. దీనిపై ఒక వారం రోజులపాటు సోమవారం నుంచి బ్రిటన్‌ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఆశిష్‌ ఠక్కర్‌ దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త. ఆయన బ్రిటన్‌లోని లైసిస్టర్‌లో మారా గ్రూప్‌ నడిపిస్తున్నాడు. బ్రిటన్‌కు వలస వచ్చిన తూర్పు ఆఫ్రికా భారతీయుల కుటుంబాల్లో ఆశిష్‌ కుటుంబం కూడా ఒకటి. 1970 కాలంలో ఉగాండన్‌ నియంత ఇది అమిన్‌ 1970లో వారిని తూర్పు ఆఫ్రికా భారతీయ కుటుంబాలను వెళ్లగొట్టినప్పుడు వారు బ్రిటన్‌కు వచ్చారు. ఆ తర్వాత మీరా మానెక్‌ను 2008లో వివాహం చేసుకున్నాడు.

అయితే, ఐదేళ్లకే వారి వివాహంలో వేరు కుంపట్లు వచ్చాయి. 2013లో విడిపోయారు. వీరు కలిసి ఉన్న సమయంలోనే వర్జిన్‌ గెలాస్టిక్‌ సంస్థ భవిష్యత్‌లో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకోసం తొలిసారి వీరు టికెట్‌ కొనుగోలు చేశారు. లక్షా 60 వేల పౌండ్లు పెట్టి ఆ టికెట్‌ కొన్న తొలి భారత సంతతి పౌరులు కూడా వీరే. అయితే, అనూహ్యంగా వారిద్దరు విడిపోవడం, తన ఆస్తిలో కొంతమొత్తం భార్యకు భరణంగా చెల్లించాల్సి వచ్చే పరిస్థితులు తలెత్తాయి.

అయితే, తన ఆస్తులు మొత్తం కూడా 4,45,532 పౌండ్లుగా మాత్రమే ఆశిష్‌ పేర్కొన్నాడు. స్పేస్‌ టూర్‌ టికెట్‌ ఖర్చును అందులో పేర్కొనలేదు. దీంతో దానిని కూడా అతడి ఆస్తిగానే పరిగణించి అందులో నుంచి కూడా తనకు భరణంగా ఇవ్వాల్సిందేనని మీరా మానెక్‌ డిమాండ్‌ చేస్తోంది. ప్రయాణం మొదలయ్యేనాటికి టికెట్‌ రద్దు చేసుకున్నా సదరు సంస్థ స్పేస్ టికెట్‌ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది.

Advertisement

What’s your opinion

Advertisement