Sakshi News home page

ట్రంప్‌కు ఒబామా హెచ్చరిక

Published Wed, Dec 14 2016 10:44 AM

ట్రంప్‌కు ఒబామా హెచ్చరిక - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా నిఘా సంస‍్థ సీఐఏ, ఇతర ఏజెన్సీల విషయంలో ట్రంప్‌ అనుసరిస్తున్న తీరు సరిగా లేదని.. అది ప్రమాదకరమైన ధోరణి అని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హెచ్చరించారు. డెమోక్రటిక్‌ పార్టీని, ముఖ్యంగా హిల్లరీని లక్ష్యంగా చేసుకొని జరిగిన సైబర్‌ దాడులలో రష్యా పాత్ర ఉందంటూ ఇటీవల సీఐఏ అందించిన రిపోర్ట్‌ను ట్రంప్‌ తోసిపుచ్చారు. ఇరాక్‌ విషయంలోనూ ఏజెన్సీల పనితీరు సరిగా లేదని ట్రంప్‌ మండిపడ్డారు.

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్‌.. నిఘా సంస్థలతో మంచి సంబంధాలను ప్రారంభించాల్సిన ప్రస్తుత తరుణంలో ఆయన తీరు మాత్రం భిన్నంగా ఉంది. దీంతో ట్రంప్‌ అనుసరిస్తున్న 'ఫ్లయింగ్‌ బ్లైండ్‌' విధానం ప్రమాదకరమైనదని ఓ మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ ఒబామా హెచ్చరించారు. 'నువ్వు ఎంత స్మార్ట్‌ అనేది ముఖ్యం కాదు. ఒక మంచి నిర‍్ణయం తీసుకోవాలంటే.. దానికి సంబంధించిన బెస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ను మనం పరిశీలించాలి' అని ఒబామా అన్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement