Sakshi News home page

పాపను ఫ్రిజ్‌లో పెట్టిన తండ్రి

Published Fri, Jun 24 2016 1:02 AM

పాపను ఫ్రిజ్‌లో పెట్టిన తండ్రి

వాషింగ్టన్: ఒక తండ్రికి నిద్రపై ఉన్న వ్యామోహం అతని కూతురు ప్రాణాల మీదకు తెచ్చింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన విషాద ఘటన ఇది. మెలిస్సాలో నివాసముండే మైకేల్ తెడ్‌ఫోర్డ్ తన ఇద్దరు పిల్లల్ని డేకేర్ సెంటర్‌లో దింపేసి.. 6 నెలల పాపకు జ్వరం ఉన్నట్లు అనిపించడంతోఇంటికి తెచ్చాడు. ఇంటి దగ్గర కారు దిగగానే నిద్రపోవాలనే తొందరలో పాపను కారులోనే మరిచిపోయి ఇంట్లోకెళ్లి హాయిగా 4 గంటలు కునుకు తీశాడు. నిద్ర లేచిన తర్వాత పాప కారులోనే ఉందన్న విషయం గుర్తొచ్చి కారు వద్దకు వెళ్లాడు.

ఆ రోజు మెలిస్సాలో ఉష్ణోగ్రత అప్పటికే 35 డిగ్రీ సెల్సియస్ ఉంది. కారులో వేడి మరింత ఎక్కువ ఉండటంతో పాప ఒళ్లు జ్వరంతో కాలిపోతోంది. పాపను చేతుల్లోకి తీసుకున్న తెడ్‌ఫోర్డ్, తన తెలివితక్కువ తనంతో పాపను చల్లబరచడానికని రిఫ్రిజిరేటర్‌లో ఉంచాడు. అలాఎంతసేపు ఉంచాడో గానీ ఫ్రిజ్ నుంచి బయటకు తీసిన తర్వాత తన భార్యకు, వైద్యులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. అప్పటికే పాప చనిపోయి ఉంది. తెడ్‌ఫోర్డ్‌కు పిల్లలంటే ఇష్టమనీ, ఇటీవలే ఫాదర్స్‌డే వేడుకలను కూడా కుటుంబమంతా ఎంతో ఆనందంగా జరుపుకుందనీ, ఇంతలోనే ఇలా జరగడం దురదృష్టకరమని పొరుగువారు అంటున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement