Sakshi News home page

'ఎందుకు హృతిక్.. అబద్ధం చెప్పావు'

Published Mon, Apr 25 2016 4:47 PM

'ఎందుకు హృతిక్.. అబద్ధం చెప్పావు' - Sakshi

బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌-కంగనా రనౌత్‌ వివాదం రోజురోజుకు ముదురుతున్నది. ఒకప్పుడు లవర్స్‌గా ముద్రపడిన ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందనే దానిపై అనేక రహస్యాలెన్నో వెలుగుచూస్తున్నాయి. తాజాగా కంగన ఈమెయిల్స్‌ వెలుగుచూడటం.. హృతిక్ కు నాన్‌స్టాప్‌గా ఆమె ఈమెయిల్స్‌ పంపిందని, వన్‌సైడ్‌గా అతనితో ప్రేమలో పడిందనే విషయాలు వెల్లడైంది. ఇక, హృతిక్ ఆమెకు మెయిల్స్ పంపలేదని, అతని పేరు మీద ఓ నకిలీ ఖాతా నుంచి మెయిల్స్ వచ్చాయని అతని లాయర్ చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో తన లాయర్‌ ద్వారా హృత్తిక్‌కు కంగన 11 ప్రశ్నలు సంధించింది. కంగన పరువును దెబ్బతీసేవిధంగా హృతిక్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, తాజాగా మీడియాలో ప్రచురించిన కంగన ఈమెయిల్స్‌ కల్పితమేనని ఆమె లాయర్ స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంలో కంగన తన లాయర్ ద్వారా సంధించిన ప్రశ్నలివి..

 

  • హృతిక్ పేరుతో ఓ నకిలీ వ్యక్తి కంగనకు ఈమెయిల్స్ పంపిస్తున్నా విషయం తెలిసినా.. ఆయన ఎందుకు దీనిని పట్టించుకోలేదు?
     
  • నకిలీ అకౌంట్‌ ఏర్పాటుచేసిన వ్యక్తిపై హృతిక్ ఎందుకు కేసు పెట్టలేదు. ఇందుకు కంగన సహకరిస్తానని చెప్పినా ఆయన ఎందుకు అంగీకరించలేదు?
     
  • ఎందుకు కంగన చెప్పిన ఏడు నెలల తర్వాత ఎంతో ఆసల్యంగా హృతిక్ కేసు పెట్టాడు. కల్పితమైన ఖాతాతో ఈమెయిల్స్ పంపడమే కాదు.. కంగనా అకౌంట్‌ను హ్యాకింగ్‌ చేసి ఆ ఈమెయిల్స్‌ను డిలీట్ చేసినా హృతిక్ ఎందుకు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు.
     
  • పోలీసులకు, మీడియాకు హృతిక్ ఎందుకు అబద్ధం చెప్పాడు. తన పేరిట నకిలీ ఖాతా ఉందనే విషయం అభిమానుల ద్వారా, బాలీవుడ్‌లోని వ్యక్తుల ద్వారా తెలిసిందని మాత్రమే అతను చెప్పాడు. నిజానికి కంగన తన సోదరి ద్వారా ఈ విషయాన్ని ఆయనకు చెప్పింది.
     
  • హ్యాకింగ్‌కు గురైన కంగన అకౌంట్‌లోని కల్పితమైన ఈమెయిల్స్‌ నిజమైనవేనిన చెప్పడం ద్వారా ఆయన ప్రపంచానికి ఏం నిరూపించాలనుకుంటున్నారు? అవి నా క్లయింట్‌ పంపిన ఒరిజినల్‌ ఈమెయిల్స్‌ అని ఎలా చెప్పగలరు? నా క్లయింట్‌ అకౌంట్‌ హ్యాక్ అయిన తర్వాతే ఆయన నకిలీ ఖాతాపై ఎందుకు కేసు పెట్టారు? ఈ కేసులో తనకు క్లీన్‌చిట్‌ కోసం ఎందుకు హృతిక్ తపిస్తున్నారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు నివేదిక అవసరం లేదని అతను ఎందుకు వాదిస్తున్నారు?

Advertisement

What’s your opinion

Advertisement