Sakshi News home page

ఆ తొమ్మిది గంటలు...

Published Tue, Feb 16 2016 10:51 PM

ఆ తొమ్మిది గంటలు...

రాజ్ బాలా, ఆనంద్ బట్చూ, లౌక్య ప్రధాన పాత్రల్లో విజయ్ శేఖర్ సంక్రాంతి దర్శకత్వంలో మిల్క్ మూవీస్ సంస్థ నిర్మించిన చిత్రం ‘7 టు 4’. స్నేహలత అందించిన ఈ చిత్రం పాటలను గాయకుడు సింహా విడుదల చేశారు.  దర్శకుడు మాట్లాడుతూ- ‘‘సమకాలీన మహిళా సమస్యల్ని ఇతివృత్తంగా తీసుకుని ప్రేక్షకులకు నచ్చేలా నిర్మించాం. యువతుల జీవితాల్ని కాలరాసేవారి ఆటను నలుగురు పవర్‌ఫుల్ పోలీసు అధికారులు ఎలా అడ్డుకున్నా రన్నదే ఈ చిత్ర కథ. ఉషా ఉతుప్, శ్రావణ భార్గవి, హేమచంద్ర, సింహా పాడిన పాటలు ఈ చిత్రానికి బలాన్నిచ్చాయి. త్వరలోనే రిలీజ్ చేస్తాం’’ అని తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement