Sakshi News home page

ప్రేమికులరోజు అనుష్క ఏం చేసింది?

Published Sun, Feb 14 2016 4:57 PM

guess with whoom anushka sharma spent this valentines day

'ఆల్ ఈజ్ వెల్' అయ్యిండేదుంటే ఈపాటికి ఆ జంట.. ఆర్ కే బీచ్ లోనో, భీమిలి ఎర్రమట్టిదిబ్బల్లోనో సరదాగా గడుపుతూ హడావుడిచేసేవాళ్లు. కానీ తలచిందే జరిగితే విధి పవర్ ఏముందన్నట్లు.. ఏళ్లుగా కొనసాగిన బంధాన్ని బ్రేకప్ చేసుకున్నారు అనుష్కశర్మ, విరాట్ కోహ్లీలు. అయితే విడిపోయిన తర్వాత వచ్చిన మొట్టమొదటి ప్రేమికులరోజును ఆ మాజీ ప్రేమికులు ఎలా గడిపారు? అనేదానిపై అటు సినీ పరిశీలకులు, ఇటు క్రీడాభిమానుల్లోనూ కొంత ఆసక్తి నెలకొంది.

కోహ్లీ.. ఆఖరు వన్ డేలో శ్రీలంకతో తలపడేందుకు విశాఖపట్నంలో ఉన్నాడు. అనుష్క మాత్రం ఈ వాలెంటైన్స్ డేకి కొత్త స్నేహితుణ్ని వెతుక్కుంది. ఈ ప్రత్యేకమైన రోజున.. ఆ నయా దోస్త్ తో కలిసి ముంబైలో వాళ్ల కాలనీలో చక్కర్లు కొట్టింది. ఇంకా పేరు వెల్లడికాని ఆ నేస్తం.. అనుష్క కొత్తగా కొనుక్కున్న కుక్కపిల్ల!

అన్నట్లు ప్రేమవైఫల్యానికి కుక్కపిల్లకు అవినాభావ సంబంధం ఉంది. దాన్ని 'దేవదాసు' సినిమాలో బాగా చిత్రించారు. ఇప్పుడు అనుష్క కూడా బ్రేకప్ తర్వాత పప్పీని వెంటేసుకుని తిరుగుతోంది. అలాగని ఆమెను లేడీ దేవదాసు అనడం పొరపాటే అవుతుందేమో. ఎందుకంటే ఆ కాలం ప్రేమలకు ఈ నాటి డేట్ లకు జమీన్ అస్మాన్ ఫరక్! ఏంటారు?

Advertisement

What’s your opinion

Advertisement