నాగ్‌ సినిమాపై వర్మ క్లారిటీ | Sakshi
Sakshi News home page

నాగ్‌ సినిమాపై వర్మ క్లారిటీ

Published Wed, Nov 15 2017 10:32 AM

Ram Gopal Varma clarity on Nagarjuna film casting - Sakshi

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ఓ సినిమా చేస్తున్న  సంగతి తెలిసిందే. వరుస ఫ్లాప్‌లతో ఉన్న వర్మతో సినిమాతో నాగార్జున లాంటి సీనియర్‌ స్టార్‌ హీరో సినిమా చేస్తుండటంతో ఆ సినిమా టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నెల 20 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబందించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్రలో నటిస్తున్నారని, నాగ్‌ సరసన హీరోయిన్‌ గా బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌, నాగ్‌ ఫ్రెండ్‌ అయిన టబు నటించనుందన్న టాక్‌ గట్టిగా వినిపించింది. ఈ వార్తలపై దర్శకుడు వర్మ క్లారిటీ ఇచ్చాడు. తను నాగ్‌ తో చేయబోయే సినిమాలో టబు, అమితాబ్‌లు నటించటం లేదని తెలిపాడు. ఈ నెల 20 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుందన్న వర్మ ఇతర కాస్టింగ్‌ వివరాలు మాత్రం వెల్లడించలేదు.

Advertisement
Advertisement