ఢిల్లీ మెట్రో రైల్లో ఉచిత హైస్పీడ్ వై-ఫై! | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మెట్రో రైల్లో ఉచిత హైస్పీడ్ వై-ఫై!

Published Thu, Apr 21 2016 8:28 PM

ఢిల్లీ మెట్రో రైల్లో ఉచిత హైస్పీడ్ వై-ఫై! - Sakshi

న్యూ ఢిల్లీ: ఢిల్లీ మెట్రో ప్రయాణీకులకు శుభవార్త! ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) రోజువారీ ప్రయాణీకుల కోసం మరో ప్రత్యేక సౌకర్యం కల్పించనుంది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో వంద శాతం ఉచిత వైఫై సేవలతో రవాణా వ్యవస్థ ఉండాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది.

అందులో భాగంగా  దేశంలోని అతి పెద్ద వీడియో నెట్ వర్క్  సంస్థలైన టెక్నోశాట్ కాం, పింగ్ నెట్ వర్క్ ల తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతిరోజూ ఢిల్లీ మెట్రోను వినియోగించే సుమారు 35 లక్షలమంది  ప్రయాణీకులకు కావలసిన కంటెంట్ ను  సమర్థవంతంగా  అందించేందుకు ప్రస్తుతం ఆ సంస్థలు ప్రకటన దారులతో కలసి ఆసక్తిగా ముందుకొస్తున్నాయి.

ఇకపై ఢిల్లీ నగరంలో మెట్రోలో ప్రయాణించే వారంతా ఉచిత వైఫై వినియోగించుకునే సౌకర్యాన్ని డీఎంఆర్సీ కల్పించనుంది. ఓ ప్రత్యేక యాప్ ద్వారా ఇంటర్నెట్ లో లాగిన్ అయ్యి,  హైస్పీడ్ బ్రాడ్ బాండ్ సౌకర్యాన్ని పొందే అవకాశం కల్పిస్తోంది. అంతేకాదు ఈ యాప్ ప్రయాణీకులకు అదనపు సౌకర్యాల్లో భాగంగా సమయం ప్రకారం ఆయా ప్రదేశాలను, గమ్యస్థానాలను సూచించడంతోపాటు వివిధ మార్గాల మధ్య నావిగేషన్ గా సహాయపడుతుంది.

ఇప్పటికే ఢిల్లీ-హౌరా రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులో వైఫై సేవలను టెక్నో శాట్ కామ్ అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన  యూరప్ లోని థాలిస్, ఎస్ఎన్సీఎఫ్, ఎన్ టీవీ వంటి సూపర్ ఫాస్ట్ రైళ్ళలో ఉపయోగించే హై స్పీడ్ బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ సేవలను అందించే  'టి ట్రాక్ 2.0 వేవ్ టు సొల్యూషన్' నెట్ వర్క్  ను ఇక్కడ  వినియోగించనున్నారు. 4 జీ కన్నా మూడు రెట్టు అధికమైన 50 ఎంబిపీఎస్ వైఫై సర్వీస్ ను ప్రస్తుతం ఢిల్లీ మెట్రో ప్రయాణీకులకు అందించనున్నట్లు కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. 

ప్రతిరోజూ సుమారు 35 లక్షల మంది ప్రాయాణీకులతో నడుస్తున్న ఢిల్లీ మెట్రో నెట్ వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద నెట్ వర్క్ గా  గుర్తింపు పొందింది. ఈ ఏడాది ప్రారంభించే కొత్త మార్గాలతోపాటు, ఇంటర్ కనెక్ట్ మార్గాల ఆరంభంతో ప్రయాణీకుల సంఖ్య మరింత గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement