Sakshi News home page

'ఇండియాను తయారీ కేంద్రంగా మార్చుతాం'

Published Sat, Feb 28 2015 11:28 AM

'ఇండియాను తయారీ కేంద్రంగా మార్చుతాం' - Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. భారత్ను తయారీ కేంద్రంగా మార్చుతామని ఆయన తెలిపారు. తొమ్మిది నెలలుగా వృద్ధి రేటును పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేగవంతమైన అభివృద్ధితో పాటు పారదర్శక పాలను ప్రజలు కోరుకుంటున్నారని జైట్లీ తెలిపారు. భారత్లో పెట్టుబడులకు  దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. 80వేల స్కూళ్లను అప్గ్రేడ్ చేస్తామన్నారు. ప్రతి అయిదు కిలోమీటర్లకు ఓ స్కూల్తో పాటు  10 కిలోమీటర్ల కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు.

 

Advertisement

What’s your opinion

Advertisement