Sakshi News home page

‘జన్‌ధన్’ ఖాతాదారులకు రుణాలిస్తారా?

Published Sat, Nov 29 2014 5:07 AM

‘జన్‌ధన్’ ఖాతాదారులకు రుణాలిస్తారా?

  • లోక్‌సభలో ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి
  • సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని ప్రారంభించిన జన్‌ధన్ యోజన కింద బ్యాంకుల్లో ఖాతాలు తెరిచిన వారిలో చాలా వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిరు వర్తకులు ఉన్నారని, వారు రుణాలు పొందేందుకు అవకాశం ఉందా? అని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం లోక్‌సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ పథకంపై ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఒక ప్రశ్న వేశారు.

    చిరు వర్తకులకు రుణాలు ఇచ్చేందుకు కేంద్రం ఏవైనా చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించగా.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించి ‘బీమా, ప్రమాద బీమా అందుబాటులో ఉంటుంది. అన్ని బ్యాంకింగ్ హక్కులు సదరు ఖాతాదారు కలిగి ఉంటాడు.ఈ ఖాతాదారులకు రుణాలు ఇచ్చే విషయంలో కాస్త ఉదారత, సరళత ప్రదర్శించాలని మేం బ్యాంకర్లను కోరాం. వారు అర్హతలను పరిశీలించి రుణాలు మంజూరు చేస్తారు..’ అని వివరించారు.

Advertisement

What’s your opinion

Advertisement