Sakshi News home page

రూ. 6వేల కోట్ల ఇరిగేషన్ టెండర్లు రద్దు!

Published Wed, Aug 31 2016 10:05 AM

రూ. 6వేల కోట్ల ఇరిగేషన్ టెండర్లు రద్దు! - Sakshi

మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల టెండర్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ.. రూ. 6వేల కోట్ల విలువైన 94 టెండర్లను దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో కోట్లాది రూపాయల ఇరిగేషన్ స్కాంలో ఏసీబీ పరిశీలనలో ఉన్న దాదాపు అన్ని టెండర్లు రద్దయినట్లే.

ఎన్‌సీపీ మాజీనేత, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఇది తీవ్ర శరాఘాతంలా పరిణమించింది. 2009 సంవత్సరంలో నిబంధనలను అతిక్రమించి ఆయన దాదాపు రూ. 20 వేల కోట్ల విలువైన ఇరిగేషన్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారని ఆరోపణలున్నాయి. 1999 నుంచి 2009 వరకు మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా అజిత్ పవార్ వ్యవహరించారు. నిబంధనలను తోసిరాజని, విదర్భ నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ పాలకమండలి అనుమతి లేకుండానే ఈ టెండర్లను ఆయన ఆమోదించినట్లు చెబుతున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement