చైనా యాప్స్ డిలీట్‌ చేయండి..మాస్క్ పొందండి

2 Jul, 2020 18:22 IST|Sakshi

ల‌క్నో :  త‌మ మొబైల్ ఫోన్ల‌లో చైనా అప్లికేష‌న్ల‌ను తొలిగించే  వారికి ఉచితం మాస్కులు అందిస్తామ‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ మంత్రి, బ‌హ్రాయిచ్  బీజేపీ ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్ ప్రకటించారు. దీనికి అణుగుణంగా ఇప్ప‌టికే ప‌లువ‌రికి ఫేస్ మాస్కుల పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. భార‌త దేశ స‌మ‌గ్ర‌త‌కు, భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లుతుంద‌నే కార‌ణంతో 59 చైనా యాప్‌ల‌ను భార‌త ప్ర‌భుత్వం నిషేదించిన సంగ‌తి తెలిసిందే. భార‌త్ వెలుప‌ల ఉన్న స‌ర్వ‌ర్ల‌కు వినియోగ‌దారుల డేటాను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌ల‌లో అందుబాటులో ఉన్న కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా అందిస్తున్న‌ట్లు ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని ప్ర‌భుత్వం తెల‌పింది. ఈ నేప‌థ్యంలో చైనా అప్లికేష‌న్ల‌ను ప్ర‌జ‌లు స్వ‌త‌హాగా తొలిగించేట్లు అనుప‌మ వినూత్నంగా ప్ర‌య‌త్నించారు. పార్టీ స్థానిక మెర్చా యూనిట్ స‌హ‌కారంతో ఆమె నియోజ‌క‌వ‌ర్గంలో విసృతంగా ఈ ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తున్నారు. గ‌తంలో యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వంలో ప్రాథ‌మిక  విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేశారు. పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా గ‌తేడాది ఆమెను మంత్రి ప‌ద‌వి నుంచి తొలిగించారు. (టిక్‌టాక్‌ నిషేధంతో భారీగా నష్టపోయిన చైనా )


 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు