Sakshi News home page

‘మమ్మీ’ పచ్చబొట్టూ.. చెరిగీపోలే..!

Published Tue, Mar 25 2014 3:38 AM

‘మమ్మీ’ పచ్చబొట్టూ.. చెరిగీపోలే..!

 సూడాన్‌లో 1,300 ఏళ్ల క్రితం నివసించిన ఓ మహిళకు చెందిన మమ్మీ(మృతదేహం) 3డీ విజువల్ చిత్రాలివి. సుమారు 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఈ మహిళ కుడి తొడపై పొడిపించుకున్న ఓ పచ్చబొట్టును తాజాగా బ్రిటిష్ మ్యూజియం పరిశోధకులు సీటీ స్కాన్‌లో గుర్తించారు. మైఖేల్ అనే అర్థం వచ్చేలా గ్రీకులో ‘ఎం-ఐ-ఎక్స్-ఏ-హెచ్-ఏ’ అనే అక్షరాలను (ఇన్‌సెట్‌లో) ఈ మహిళ టాటూ పొడిపించుకుందని, అది రక్షణ కోసం పొడిపించుకునే సంకేతమని చెబుతున్నారు.

ఇంత పాతకాలం నాటి మమ్మీపై పచ్చబొట్టు వెలుగుచూడటం ఇదే తొలిసారట. మొత్తం 8 మమ్మీలను స్కాన్ చేసిన పరిశోధకులు.. 3డీ విజువలైజేషన్ ద్వారా పరిశీలించగా.. అప్పట్లో వీరు హై కొలెస్ట్రాల్, గుండెజబ్బు, దంతాల వద్ద కణితులతో బాధపడేవారని, బహుశా గుండెపోటు, పక్షవాతం, కణితుల వల్ల మరణించి ఉండొచ్చని అంచనా వేశారు

Advertisement

What’s your opinion

Advertisement