Sakshi News home page

పీఎంఓకు ‘క్రీ మీలేయర్ పెంపు’

Published Sun, Sep 11 2016 3:10 AM

OBC reservation creamy layer limit likely to be increased to 8 lakh

న్యూఢిల్లీ:  ఓబీసీలకు రిజర్వేషన్ల వర్తింపులో ప్రస్తుతమున్న క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచే దిశగా కేంద్రం మరో అడుగు ముందుకేసింది. కుటుంబ ఆదాయ పరిమితిని రూ. 8 లక్ష లకు  పెంచుతూ రూపొందించిన ప్రతిపాదనల ఫైలును సామాజిక న్యాయ శాఖ ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిందని, త్వరలో కేంద్ర కేబినెట్‌లో ఈ అంశం చర్చకు వస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల  సీట్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ ఉండగా... కుటుంబ ఆదాయం రూ. 6 లక్షల వరకూ ఉంటేనే రిజర్వేషన్‌ను వర్తింపచేస్తున్నారు.

పరిమితిని పెంచాలంటూ కొన్ని నెలలుగా కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. క్రీమీలేయర్ నిర్వచనాన్ని సమీక్షించి ఇతర వెన కబడ్డ వర్గాలకు వర్తించేలా జూలైలోనే ఎన్డీఏ ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలంటూ కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయమంత్రి రాందాస్ అథవాలే ఆగస్టులో డిమాండ్ చేశారు. ఆ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ప్రస్తావించారు. పెంపు రూ. 8 లక్షలుంటే సరిపోతుందన్న ఆ శాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ వాదనతో చివరకు ఆ మేరకే పెంచేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పెంపును కేబినెట్ ఆమోదించాక... నవంబర్-డిసెంబర్‌లో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ఈ అంశం లాభిస్తుందని బీజేపీ నమ్మకం పెట్టుకుంది.

Advertisement

What’s your opinion

Advertisement