Sakshi News home page

రోడ్డు ప్రమాదాలపై సుప్రీం ఆగ్రహం

Published Fri, Jul 20 2018 3:52 PM

Top Court  Concern Over Deaths In Accidents Due To Potholes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని రహదారుల ప్రమాదాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాన రహదారులపై పడిన గుంతుల కారణంగా అనేక మంది వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికంటే రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, దీపక్‌ గుప్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం శుక్రవారం అభిప్రాయపడింది.

ఈ అంశంపై రహదారుల భద్రతా సంస్థ దృష్టిసారించాలని కోర్టు ఆదేశించింది. పౌరుల జీవిత, మరణాలకు సంబంధించిన విషయం కాబట్టి ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించాలని కోర్టు వ్యాఖ్యానించింది. రహదారులపై జరిగే ప్రమాదాలు ఎక్కువ శాతం గుంటల కారణంగానే సంభవిస్తున్నాయని, ప్రభుత్వాలు వారికి నష్టపరిహారం కూడా చెల్లించవలసి వస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై రెండు వారాల్లో తమకు నివేదికను అందజేయల్సిందిగా రహదారుల భద్రతా సంస్థను న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement

What’s your opinion

Advertisement