Sakshi News home page

గ్రహం అనుగ్రహం

Published Fri, Nov 6 2015 12:55 AM

గ్రహం అనుగ్రహం - Sakshi

శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి బ.దశమి ప.12.09 వరకు, తదుపరి ఏకాదశి
నక్షత్రం పుబ్బ రా.3.15 వరకు
వర్జ్యం ఉ.9.46 నుంచి 11.31 వరకు
దుర్ముహూర్తం ఉ.8.20 నుంచి 9.10 వరకు
తదుపరి ప.12.08 నుంచి 12.58 వరకు

సూర్యోదయం:    6.03 సూర్యాస్తమయం:     5.24
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి  4.30 వరకు

భవిష్యం
 
మేషం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణ యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఇంటా బయటా చికాకులు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.
 
వృషభం: కొన్ని పనులు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. దైవ దర్శనాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
 
మిథునం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆస్తి లాభం. ఉద్యోగు లకు ఇంక్రిమెంట్లు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
 
కర్కాటకం: శ్రమాధిక్యం. పనులలో తొందర పాటు ప్రదర్శించవచ్చు. ఆరోగ్య భంగం. దూర ప్రయాణాలు చేస్తారు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
 
సింహం: దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విందువినోదాలు. పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి నెలకొంటుంది.
 
కన్య: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో వైరం. ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.
 
తుల: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా మెలగు తారు. నిరుద్యోగులకు అనుకూల సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
 
వృశ్చికం: బంధువుల నుంచి ధన లాభం. పనులు చకచకా సాగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకం గా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
 
ధనుస్సు: దూరప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు రావచ్చు. ధన వ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు నెలకొంటాయి.
 
మకరం: బంధువులతో లేనిపోని వివాదాలు. ధన వ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరో గ్యం మందగిస్తుంది. అనుకోని ప్రయాణాలు చే స్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కుంభం: కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. వాహన యోగం. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
మీనం: నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
- సింహంభట్ల సుబ్బారావు
 
 
 
 
 

Advertisement

What’s your opinion

Advertisement