Sakshi News home page

నేలమ్మకు దగ్గరగా...

Published Tue, Nov 3 2015 1:04 AM

UNO declares to protection of International lands 2015

2015ను అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరంగా యూఎన్‌ఓ ప్రకటించింది. జీవనానికి మూలాధార మైన నేల తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నారు. సకల జీవరాశులకు నేల తల్లి పునాది. మానవులతోపాటు భూమిపైన, భూమి లోపల సకల జీవులున్నాయి. మనం తింటున్న ఆహారం నేల తల్లి ఇచ్చినదే! ఆహారం, నీరు, వాతావరణం, జీవవై విధ్యం, జీవితం.. వీటన్నిటికీ కారణమైన నేల తల్లితో సంబంధాన్ని కొనసాగించ డంలో మనం విఫలమయ్యాం. అందువల్ల భూమి నేడు కష్టాలను ఎదుర్కొంటుంది.
 
భూమిని పరిరక్షించడంలో మనుషులు విఫలమైతే భూమికి ఉన్న నీటిని గ్రహించే మహత్తర శక్తి నశిస్తుంది. పంట సాగుకు పనికిరాకుండాపోతుంది. భూమి తన సారాన్ని కోల్పోతున్న క్రమం నిరంతరంగా కొనసాగుతోంది. తల్లి ఆరోగ్యం పాడైతే బిడ్డ బాగుంటుం దా? అతిగా రసాయనిక అవశేషాలున్న ఆహారం తిన్న నేల తల్లి, దానిబిడ్డల ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. మాన వాళి మనుగడ సాఫీగా సాగాలంటే.. ప్రయోగాల పేరుతో రసాయనిక పోకడలు వదిలి, ప్రకృతికి దగ్గరవ్వాలి.
 - తలారి సుధాకర్  కోహెడ, కరీంనగర్

Advertisement

What’s your opinion

Advertisement