వైఎస్సార్‌సీపీలో చేరిన సన్యాసిపాత్రుడు

4 Nov, 2019 16:33 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు గట్టి షాక్‌ తగిలింది. ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కుటుంబ సభ్యులతో సహా పార్టీలో చేరుతున్న సన్యాసిపాత్రుడుని సీఎం జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సన్యాసిపాత్రుడుతో పాటు భార్య అనిత, నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలో చేరారు. కాగా సన్యాసిపాత్రుడు నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన సతీమణి అనిత మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా విధులు నిర్వర్తించారు. 

కాగా టీడీపీ తీరుతో మనస్తాపం చెందిన సన్యాసిపాత్రుడు దంపతులు ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నర్సీపట్నం పర్యటనలో ఉండగానే సన్యాసిపాత్రుడు రాజీనామా చేసి పార్టీ అధిష్టానంతో పాటు సోదరుడు అయ్యన్నకు షాక్‌ ఇచ్చారు. రాజీనామా సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో రెండేళ్లుగా తనకు ప్రాధాన్యత లేకుండా చేశారన్నారు. గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించారని ఆరోపించారు. ఈ విషయాలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. తన పట్ల వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెంది రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు.   


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చంద్రబాబువి చౌకబారు విమర్శలు

ధనిక రాష్ట్రంలో జీతాలకు కోతలా?

ఉత్తరాలు, ట్వీట్లు మానుకొని ముందుకు రండి

అందుకే ఢిల్లీ వెళ్లా : అంజాద్‌ బాషా

సిగ్గు అనిపించడం లేదా చంద్రబాబు?

సినిమా

ఆ బికినీ ఫొటోకు అంత ఎడిటింగ్ ఎందుకు?

చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నా: హీరోయిన్‌

వైర‌ల్ అవుతున్న క‌రోనా సాంగ్‌

‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. బాహుబలినై

వారి పెళ్లి పెటాకులేనా?!

రానాతో కలిసి బాలకృష్ణ మల్టీస్టారర్‌ మూవీ!