కాంగ్రెస్‌లో చేరిన షోయబ్ ఇక్బాల్ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరిన షోయబ్ ఇక్బాల్

Published Thu, Nov 20 2014 9:56 PM

JD(U) leader Shoaib Iqbal joins Congess

సాక్షి, న్యూఢిల్లీ: మతియా మహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎన్నికైన షోయబ్‌ఇక్బాల్ గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో షోయబ్ ఇక్బాల్ తన బంధువులు, మున్సిపల్ కౌన్సిలర్లు అల్లె మహ్మద్ ఇక్బాల్, ఖుర్రం ఇక్బాల్‌తో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. షోయబ్ చేరిక వల్ల రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ముస్లింల మద్దతు కాంగ్రెస్‌కు లభిస్తుందని ఆశి స్తున్నారు. ముస్లింలను ఆకట్టుకోవడం కోసమే కాంగ్రె స్ ఆయనను పార్టీలో చేర్చుకుందని రాజకీయ పరిశీ లకులు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ తరఫున గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలలో నలుగురు ముస్లింలేకావడం విశేషం. అయితే లోక్‌సభ ఎన్నికల నాటికి పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచిన ఓటర్లు గత లోక్‌సభ ఎన్నిక లలో  ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేశారు.
 
 ఢిల్లీ ఓటర్లలో ముస్లింలు 15 శాతం ఉన్నారు. ముస్లింల ఓట్లు చీలకుండా ఉండడం కోసం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పోయబ్ ఇక్బాల్ తెలిపారు. లౌకిక పార్టీల మధ్య ఓట్లు చీలడం వల్ల మతతత్వ పార్టీలు విజయం సాధిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. షోయబ్ ఇక్బాల్ 1993 నుంచి మతియా మహల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐదు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన వేర్వేరు పార్టీల తరపున పోటీచేసి గెలవడం విశేషం.మొట్టమొదట జనతాదళ్, ఆ తరువాత కాంగ్రెస్, ఒకసారి లోక్ జన్‌శక్తి పార్టీ తరపున ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆయన జనతాదళ్ (యునెటైడ్) తరఫున పోటీచేసి గెలిచారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement