Sakshi News home page

స్వాతి హత్య కేసు అడ్డం తిరుగుతున్నదా?

Published Thu, Jul 21 2016 1:56 AM

స్వాతి హత్య కేసు అడ్డం తిరుగుతున్నదా?

సాక్షి, చెన్నై : ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో రామ్‌కుమార్‌ను రక్షించేందుకు తగ్గ వ్యూహ రచనల్లో నిందితుడి తరఫు న్యాయవాదులు నిమగ్నమైనట్టుంది. మీనాక్షి పురం గ్రామం అంతా రామ్‌కుమార్ వెంట ఉన్నట్టుగా చాటేపనిలో పడ్డట్టుంది. అరెస్టు జరిగిన రోజున రామ్‌కుమార్ గొంతును బలవంతంగానే కోసినట్టు ఆరోపిస్తూ, తెన్‌కాశి ఇన్‌స్పెక్టర్ బాలమురుగన్ బృందాన్ని కోర్టుకు లాగేం దుకు సిద్ధమయ్యారు. ఇందుకు తగ్గట్టుగా పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేరింది. అయితే, రామ్‌కుమార్ దోషి అని నిరూపించేందుకు తగ్గ ఆధారాల అన్వేషణను విచారణ బృందం వేగవంతం చేసింది.
 
 చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో గత నెల ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి దారు ణ హత్యకు గురైన విషయం తెలిసిందే. నిందితుడి గుర్తింపులో తీవ్ర కష్టాలు పడ్డ చెన్నై పోలీసులు చివరకు తిరునల్వేలి జిల్లా సెంగోట్టై సమీపంలోని మీనాక్షిపురానికి చెందిన రామ్‌కుమార్ హంతకుడిగా గుర్తిం చారు. తాము పట్టుకునే క్రమంలో నింది తుడు గొంతు కోసుకున్నట్టుగా పోలీసులు వాదించడమే కాదు, కేసూ పెట్టారు. నింది తుడు రామ్‌కుమార్ అన్నది తేలినా, సాక్ష్యాల సేకరణకు మరింత కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి. ఈ సమయంలో రామ్‌కుమార్ నిందితుడు కాదు అని, అమాయకుడని, ఎవర్నో రక్షించే యత్నంలో రామ్‌కుమార్‌ను బలిపశువు చేశారన్న ఆరోపణలు బయలు దేరాయి.
 
 ప్రధానంగా రామ్‌కుమార్ కుటుంబీకులు, మీనాక్షి పురం వాసు లు అయితే, రామ్‌కుమార్‌ను వెనకేసుకు వచ్చే రీతిలో వ్యవహరిస్తుండడం, అదే సమయంలో పలువురు న్యాయవాదులు రంగంలోకి దిగడం చోటుచేసుకున్నాయి. రామ్‌కుమార్ అమాయకుడిగా చాటేందు కు ఈ న్యాయవాదులు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారని చెప్పవచ్చు. ఈ పరిస్థితు ల్లో రామ్‌కుమార్ తండ్రి పరమశివం ద్వా రా ఆ రోజు రాత్రి ఏమి జరిగిందో...! అని వివరిస్తూ గొంతు కోసుకోలేదు...గొంతు కోశారు...అని చాటే రీతిలో సెంగోట్టై పోలీ సు స్టేషన్‌లో కేసు పెట్టించే పనిలో పడ్డారు.
 
 గొంతు కోశారు: బుధవారం రామ్‌కుమార్ తండ్రి పరమశివం సెంగోట్టై పోలీసు స్టేష న్లో ఓ ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫిర్యాదును తీసుకునేందుకు స్టేషన్ సిబ్బంది నిరాకరించారు. చివరకు రామ్‌కుమార్‌గా అండగా ఉన్న న్యాయవాదులు రామరాజ్, రవికుమార్, మారికుట్టిలతో కలిసి పోలీసుస్టేషన్‌కు పరమశివం చేరుకున్నారు. ఇన్‌స్పెక్టర్ ప్రతాపన్‌లేని దృష్ట్యా, ఆయన వచ్చే వరకు వేచి ఉండక తప్పలేదు.
 
 ఇన్‌స్పెక్టర్ రాగానే, ఫిర్యాదును అందజేశారు. దానిని పరిశీలించిన ఇన్ స్పెక్టర్ ప్రతాపన్ పదిహేను రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి పంపించారు. అయితే, ఆ ఫిర్యాదులో గొంతు కోశారు అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించి ఉండడం గమనార్హం. తాను బీఎస్‌ఎన్‌ఎల్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నానని ఫిర్యాదులో పరమశివం గుర్తు చేశారు. తన కుమారుడు బీఈ చదివినట్టు, కొన్ని సబ్జెక్టులు తప్పినందున చెన్నైలో పనిచేస్తూ, చదువుకుంటూ వచ్చినట్టు వివరించారు.గత నెల 25న చెన్నై నుంచి రామ్‌కుమార్ తన ఇంటికి వచ్చాడని వివరిస్తూ, ఈనెల ఒకటో తేదీన అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు మఫ్టీలో తన ఇంటి తలుపును కొట్టినట్టు పేర్కొన్నారు.
 
  తలుపుతీయగానే, తాము పోలీసుల మని పేర్కొంటూ లోనికి వచ్చే యత్నం చేశారని, అప్పటికే, వెనుక వైపు నుంచి మరో ఇద్దరు పోలీసులు పరుగున వచ్చి రామ్‌కుమార్ గొంతు కోసుకుని ఉన్నట్టుగా చెప్పడంతో ఆందోళనకు గురైనట్టే వివరించారు. వెనుక వైపు వెళ్లి చూడగా రక్తపు మడుగులో తన కుమారుడు ఉండడంతో కేకులు పెట్టానని, ఆ శబ్దానికి ఇరుగు పొరుగు వారు పరుగులు తీయడంతో, తెన్‌కాశి ఇన్‌స్పెక్టర్ బాల మురుగన్ తన సిబ్బందిని అరుస్తూ, రామ్‌కుమార్‌ను బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి తీసుకెళ్లారని వివరించారు.
 
 అయితే, రామ్‌కుమార్ గొంతు కోసుకోలేదని, బలవంతంగా తెన్‌కాశి ఇన్‌స్పెక్టర్ బాల మురుగన్ కోసి నాటకం రచించారని ఆరోపించారు. బాలమురుగ న్‌తో పాటు, తన  ఇంటికి వచ్చిన వారందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని విన్నవించారు.  మీడియాతో న్యాయవాదులు, రామ్‌కుమార్ తండ్రి మాట్లాడుతూ పథకం ప్రకారం పోలీసులు విచారణ సాగించారని ఆరోపించారు. పథకం ప్రకారం రామ్‌కుమార్‌ను ఇరికించడంతో పాటు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి ఉన్నారని వివరించారు.  మరో వైపు దోషిగా నిరూపించేందుకు తగ్గ ఆధారాల అన్వేషణలో విచారణ బృందం  పరుగులు తీస్తున్నది.

Advertisement

What’s your opinion

Advertisement