హామీలు నెరవేర్చితీరుతాం | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చితీరుతాం

Published Fri, Dec 5 2014 12:03 AM

హామీలు నెరవేర్చితీరుతాం - Sakshi

ఇబ్రహీంపట్నం: పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని..ఇందులో రాజీపడే ప్రసక్తి లేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వెల్లడించారు. మండల పరిధిలోని శేరిగూడలో రూ.70లక్షల వ్యయంతో నిర్మిం చిన ఉప్పరిగూడ పీఏసీఎస్ భవనాన్ని గురువారం ఆయన స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి ప్రారంభిం చారు. అనంతరం  ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలకు నెరవేర్చి తీరుతామని అన్నారు. జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యికోట్ల రుణమాఫీని ప్రకటించిందని, లక్ష పైచి లుకు రైతులకు రుణమాఫీ పథకం వర్తింపచేస్తున్నామని పేర్కొన్నారు.

మొదటి విడత రుణమాఫీ కింద రూ.253 కోట్లమేర అందజేసినట్లు చెప్పారు. వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసేదిశగా గ్రామానికో చెరువును వినియోగంలోకి తెస్తామన్నారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికి రూ.220 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ పరపతి సంఘాలు వాణిజ్య బ్యాంక్‌లకు దీటుగా ఎదగాలని అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పండ్ల తోటలు, పూల తోటల పెంపకంపై ప్రోత్సాహకాలు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, డీసీఓ రాందాస్, ఎంపీపీ కొత్త అశోక్‌గౌడ్, నగరపంచాయతీ చైర్మన్ కంబాలపల్లి భరత్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యులు పొట్టి ఐలయ్య, కర్నాటి రమేష్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి, వైస్ చైర్మన్ ఈర్ల వెంకట్‌రెడ్డి, ఉప్పరిగూడ సర్పంచ్ పోరెడ్డి సుమతి అర్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం ఫొటో లేదని రగడ...

అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమం లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం ఫొటో లేకపోవడంపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సీఎం ఫొటోను ఫ్లెక్సీలో ఎందుకు ముద్రించలేదంటూ సీఈఓ గణేశ్‌ను నిలదీశారు. అంతటితో ఆగకుండా సీఎం ఫొటో లేని ఫ్లెక్సీని తొల గించాల్సిందేనని పట్టుబట్టారు. పోలీసులు జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

తోబుట్టువు మరణించినా విధుల్లోకి..

ఉప్పరిగూడ పీఏసీఎస్ నూతన భవన ప్రారంభ కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. పీఏసీఎస్ సీఈఓ గణేశ్ తోబుట్టువు మైసమ్మ గురువారం ఉదయం మరణించింది. అంత్యక్రియలు కూడా కాలేదు. ఇదే రోజు సహకార సంఘం భవనం ప్రారంభం ఉండడంతో బాధను దిగమింగుకుని ఆయన విధులకు హాజరయ్యారు. అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు.

Advertisement
Advertisement