Sakshi News home page

పారిశుధ్య కార్మికులపై వివక్ష తగదు

Published Sat, Jul 25 2015 3:35 AM

Is not discrimination on the sanitation workers

వారి కనీస కోరికలు తీర్చాలి వైఎస్‌ఆర్ సీపీ అండగా ఉంటుంది
{పభుత్వం మొండి వైఖరి విడనాడాలి
 
 ఖమ్మంసిటీ : ‘అసలు ప్రభుత్వానికి మానవత్వం ఉందా..? ఉన్నట్లయితే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను పరిశుభ్రం చేసే కార్మికుల పట్ల వివక్ష చూపదు’ అంటూ  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. తమ కనీస కోరికలు తీర్చాలని 19 రోజులుగా కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల మద్ధతుతో  జరుగుతున్న పారిశుధ్య కార్మికుల సమ్మెకు వైఎస్సార్ సీపీ శ్రేణులు శుక్రవారం సంఘీభావం తెలిపారు. పార్టీ ఖమ్మం, పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జులు కూరాకుల నాగభూషణం, సాధు రమేష్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మినేని వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధులు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మందడపు వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షుడు తోట రామారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షర్మిలా సంపత్ ఈ సందర్భంగా మాట్లాడారు.

కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విభజించి పాలిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగర పాలక సంస్థలో ఉద్యోగులకు జీతాలు పెంచి, మిగతా ప్రాంతాల్లోని కార్మికులకు మొండిచేయి చూపించడం తగదన్నారు. కార్మికులకు మద్దతుగా గత వారం జరిగిన రాష్ట్ర బంద్‌లో పార్టీ  శ్రేణులు అధికసంఖ్యలో పాల్గొన్నారని అన్నారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం హైదరాబాద్‌తో పాటు జిల్లాలోని పాల్వంచ పట్టణాల్లో కార్మికులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్మికుల పక్షాన చేస్తున్న పోరాటాలను తెలంగాణ రాష్ట్రంలోనూ కొనసాగిస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ మెడలు వంచుతామన్నారు.   పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు భీమనాధుల అశోక్‌రెడ్డి, లాయర్స్ విభాగం అధ్యక్షుడు శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement