నా వెంటే... ఓరుగల్లు నీతి, నిజాయితీ | Sakshi
Sakshi News home page

నా వెంటే... ఓరుగల్లు నీతి, నిజాయితీ

Published Tue, Dec 16 2014 2:47 AM

నా వెంటే... ఓరుగల్లు నీతి, నిజాయితీ

జస్టిస్ నర్సింహారెడ్డి 
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

 
వరంగల్ లీగల్ :  వరంగల్ జిల్లా సాహిత్య, సాంసృ్కతిక, కళలకు నిలయమని.. రామప్ప దేవాలయ నిర్మాణ కళకు ప్రపంచంలోనే సరితూగే మరో నిర్మాణం లేదని జస్టిస్ నర్సింహారెడ్డి అన్నారు. ఇక్కడి సామాజిక సంబంధాలు, ప్రతిస్పందన లు, మానవత్వం పునాదిగా ఉంటాయని, బమ్మెర పోతన రచనల నుంచి నేర్చుకున్న నిబ ద్ధత, నిజాయితీ ఎల్లప్పుడూ తన వెంటే ఉం టాయని ఆయన పేర్కొన్నారు. పాట్నా హైకో ర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్తు న్న నర్సింహారెడ్డిని జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో సోమవా రం సాయంత్రం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వేదమంత్రోచ్ఛరణల నడుమ బార్ అసోసియేషన్ బాధ్యులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు నర్సింహారెడ్డిని సభా ప్రాంగణం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ అధ్యక్షతన సన్మాన సభ జరిగింది.

సేవా కార్యక్రమాలు చేపట్టాలి
 
న్యాయవాదులు, న్యాయమూర్తులు.. సమస్య ల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని నర్సింహారెడ్డి కోరారు. గ్రామీణ జీవన నేపథ్యం ఉన్న వ్యక్తులు సామాజిక సేవ చేయడానికి ఎక్కువగా కృషి చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. సన్మార్గంలో సంపాదించిన సొమ్ముతోనే సంతృప్తి లభిస్తుందని, అక్రమ మార్గంలో ప్రయాణం మొదలుపెడితే పతనం ఖాయమని తెలిపారు. అవసరానికి మించి ఆస్తులు ఉన్న వారు ఆకారపు, కొమురవెళ్లి వంశస్తులను ఆదర్శంగా తీసుకొని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచిం చారు. కాగా, తాను ఎక్కడికి వెళ్లినా వరంగల్ జిల్లా ఔన్నత్యాన్ని, గౌరవాన్ని పెంపొందించే లా పనిచేస్తానని, జిల్లా న్యాయవాదులకు తన సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన గుడిమల్ల రవికుమార్, బార్ కౌన్సిల్ సభ్యుడు సహోదర్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్తున్న నర్సింహారెడ్డి త్వరలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావాల ని ఆకాంక్షించారు. సమావేశంలో జిల్లా ప్రధాన జడ్జి మఠం వెంకటరమణ, అదనపు జిల్లా జడ్జిలు నర్సింహులు, కృష్ణయ్య, సాల్మన్‌రాజ్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సూరం నర్సింహస్వామి, ఓరుగంటి కోటేశ్వర్‌రావు, సందసాని రాజేంద్రప్రసాద్, కొలునూరి సుశీల, సుదర్శన్, ఎం.మంజుల, సురేష్, ఆశీర్వాదం, దామోదర్, వివి.గిరి, వివిధ ప్రాం తాల న్యాయవాదులు పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement