రబీ వరి నాట్లు 120% | Sakshi
Sakshi News home page

రబీ వరి నాట్లు 120%

Published Thu, Feb 15 2018 4:01 AM

rabi rice seeding 120% - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రబీ వరి నాట్లు రికార్డు స్థాయిలో పడ్డాయి. తెలంగాణలో రబీ సీజన్‌ వరి సాధారణ సాగు విస్తీర్ణం 15.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 18.52 లక్షల ఎకరాల్లో నాట్లు పడినట్లు వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. గతేడాది ఇదే సమయానికి 17.10 లక్షల ఎకరాల్లో నాట్లుపడడం గమనార్హం. వరితో కలిపి రాష్ట్రంలో ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 24.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు లక్ష్యానికి మించి 25.82 లక్షల (107%) ఎకరాల్లో సాగు కావడం విశేషం. అందులో శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.37 లక్షల ఎకరాలుకాగా, ఇప్పటివరకు 2.52 లక్షల (106%) ఎకరాల్లో సాగైంది. ఇక వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.77 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.52 లక్షల (93%) ఎకరాల్లో సాగైంది.

Advertisement
Advertisement