Sakshi News home page

‘ట్రాన్స్‌ఫర్‌’ చేయరూ

Published Wed, Jun 7 2017 2:24 AM

‘ట్రాన్స్‌ఫర్‌’ చేయరూ

టీడీ బకాయిలపై తకరారు
నిధులు రాకపోవడంతో అభివృద్ధి పనులు ఆగాయంటున్న సర్పంచులు


సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో గ్రామ పంచాయతీలకు అందాల్సిన ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ(టీడీ) బకాయిలు అందకుండా పోయాయి. ఫలితంగా గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతినెలా భూముల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ల ద్వారా అందాల్సిన ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ బకాయిలను రిజిస్ట్రేషన్ల శాఖ గ్రామ పంచాయతీలకు విడుదల చేయడం లేదు.

ఎవరి వాదన వారిది..
పంచాయతీరాజ్‌ శాఖ నుంచి తమకు ఆయా గ్రామ పంచాయతీల డీడీవో కోడ్‌లు, పీడీ అకౌంట్ల వివరాలు అందకపోవడమే ప్రధాన కారణమని రిజిస్ట్రేషన్ల శాఖ అంటుండగా, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీని ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీల ఖాతాలకు జమ చేయాలని తాము కోరినా రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి స్పందన కరువైందని పంచాయతీరాజ్‌ అధికారులు ఆరోపిస్తున్నారు.

వడ్డీలు కట్టలేక సతమతం
రెండేళ్లుగా పంచాయతీలకు అందాల్సిన టీడీ బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వమే వాడుకుంటోంది. ఉపాధిహామీ పథకం కింద మూడు నెలల కిందట దాదాపు రూ.350కోట్లతో గ్రామాల్లో సిమెంట్‌ రహదారులను నిర్మిస్తే, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. రోడ్లు నిర్మించిన కాంట్రాక్టర్లు, కొందరు ప్రజాప్రతినిధులు తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేని దుస్థితి.     – అందోల్‌ కృష్ణ, సర్పంచుల ఐక్యవేదిక అధ్యక్షుడు

ఇప్పటి వరకు టీడీ బకాయిల మొత్తం సుమారు రూ.కోట్లు   600
16  నెలలుగా విడుదల చేయడం లేదు
ఆస్తి విలువలో టీడీగా వసూలు చేసేది 1.5%
30  రోజులు  ఈ మొత్తాన్ని పంచాయతీల ఖాతాల్లో జమచేయాల్సిన సమయం: 30 రోజులు(నెల)

Advertisement

What’s your opinion

Advertisement