Sakshi News home page

5 ఏళ్ల కనిష్టానికి ఉల్లి ధర

Published Mon, Feb 27 2017 3:28 PM

5 ఏళ్ల కనిష్టానికి ఉల్లి ధర - Sakshi

ముంబై:  నిన్నటి మొన్నటి వరకు వినియోగదారులు కన్నీళ్లు  తెప్పించిన ఉల్లి ఇపుడు రైతులను నష్టాల్లోకి నెట్టే‍స్తోంది.  డిమానిటైజేషన్‌  ప్రభావంతో తగ్గుముఖం పట్టిన ఉల్లిధరలు,  దిగుబడి  పుంజుకోవడంతో మరింత పతనమయ్యాయి.   అయితే మౌలిక  సదుపాయాల లేమికారణంగా ఉల్లి రైతులు కనీస ఉత్పత్తిధర కూడా లభించక దిగాలుపడుతున్నారు. దేశంలో అతిపెద్ద ఉల్లి హోల్ సేల్ మార్కెట్‌ లో  సగటు ధర క్వింటాల్  రూ 450గా నమోదైంది.   మహారాష్త్ర నాసిక్ లోని లాసర్ గావ్ మార్కెట్లో ఉల్లి ధర ఐదు సంవత్సరాల కనిష్ఠానికి చేరింది. ఉత్పత్తి భారీగా ఉండడంతో ధరలు పడిపోయాయని మార్కెట్‌వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో ఉత్పత్తి బంపర్‌ గా ఉందని, అయితే, స్టోరేజ్‌  కెపాసీటీ , ప్రాసెసింగ్ లాంటి మౌలికవసతుల లేమితో తక్కువ ధరలు నమోద వుతున్నట్టు  మార్కెట్‌ అధికారులు తెలిపారు.  సగటున 12వేల క్వింటాళ్లతో పోలిస్తే గా  ఫిబ్రవరి నెలలో ప్రతి రోజు  30-35వేల  క్వింటాళ్ల  ఎరుపు ఉల్లి మార్కెట్‌కు చేరుతోంది.  ఉల్లిపాయలు జీవితకాలము ఒక నెలగా ఉంటుందనీ,నిల్వ చేయడం కష్టం మారిందన్నారు. దీంతో  గిట్టుబాటు ధర లభించక వద్ద రైతులు ఆందోళనలో పడ్డారన్నారు.  కనీస ఉత్పత్తి ధరలు లభించకపోవడంతో కొంతమంది రైతులు  తమ ఉల్లికి నిప్పు పెడుతున్నట్టు చెప్పారు.

ప్రస్తుతం దిగుబడి పీక్‌ స్టేజ్‌ లోఉందని, మార్చి నెలలో ఇదికొంత నెమ్మదించే  అవకాశం ఉందని తెలిపారు. తద్వారా ఉల్లి ధరలు  నిలదొక్కుకోనున్నాయని అంచనా వేశారు.  రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి సప్లయ్‌ పెరుగుతోందని మార్కెట్‌ కమిటీ అధికారులుతెలిపారు. మార్కెట్ యార్డ్ వద్ద చాలా స్టాక్ ఉందనీ, ఇది క్లియర్‌ చేయాలంటే తమకుకనీసం 20రోజులుపడుతుందన్నారు. అలాగే  దీని రవాణా కోసం తమకు 40వ్యాగన్లు అవసరం పడతాయని..కానీ ప్రస్తుతం 15-18 మాత్రమేఅందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఉల్లి రవాణాకు మరిన్ని కొత్త బోగీలను కేటాయించేందకు రైల్వేశాఖ సంసిద్ధతను వ్యక్తం చేసింది.

 అతిపెద్ద మార్కెట్ యార్డ్ లాసర్ గావ్  వద్ద ఫిబ్రవరి 2016లో  క్వింటాలు సగటు ధర రూ.740గా ఉండగా,   రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన కరువు పరిస్థితులతో క్వింటాలు ఉత్పత్తి వ్యయం రూ 950గా నమోదైంది.  కాగా 2013 లో  క్వింటా ఉల్లి ధర  రూ 1,424 వద్ద అత్యధికంగా పలికిన సంగతి తెలిసిందే.


 

Advertisement

What’s your opinion

Advertisement