Sakshi News home page

పర్యాటక ప్రాంతాల్లో పోకిమన్ నిషేధం

Published Sat, Jul 23 2016 4:25 PM

పర్యాటక ప్రాంతాల్లో పోకిమన్ నిషేధం - Sakshi

టోక్యో : కాల్పనిక ప్రపంచనానికి వాస్తవికతకు ముడిపెడుతూ ఆవిష్కరించిన పోకిమన్ గో గేమ్పై జపాన్లో ఆంక్షలు విధించారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఈ గేమ్ ఆడటాన్ని నిషేధిస్తూ ఆంక్షలు జారీచేశారు. ఈ గేమ్ ను రూపొందించిన సాప్ట్ వేర్ కంపెనీ నియాంటిక్ ల్యాబ్స్, ఇటీవలే జపాన్ లో ఈ గేమ్ ను లాంచ్ చేసింది. జపాన్ లో ఈ గేమ్ ను లాంచ్ చేయడంతో పోకిమన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వెంటనే వీరి ఆనందానికి కొంత అడ్డుకట్ట వేస్తూ, ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఈ గేమ్ ను ఆడవద్దని శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది.

జపాన్ లో రెండో అతి పవిత్రమైన స్థానంగా నిలుస్తున్న ఇజుమో-తైసా విగ్రహం పరిసర ప్రాంతంలో శుక్రవారం ఈ గేమ్ పై నిషేధం విధించారు. ఈ నిషేధం కేవలం గంభీరమైన అభయారణ్య ప్రాంతంలో సందర్శకులను రక్షించేందుకేనని అధికారులు ప్రకటించినట్టు ఈఎఫ్ఈ న్యూస్ రిపోర్టు చేసింది. ఏడాదికి ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఆరు మిలియన్ల మంది సందర్శకులు వస్తుంటారని, వారి సురక్షితం కోసమే ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.

హిమేజీ కోట, జపాన్ లోని అత్యంత ప్రసిద్ధ ప్రాంతం ఫ్యూడల్ పోర్ట్రెస్ ప్రాంతం. ఈ పరిసర ప్రాంతంలో నడిచేటప్పుడు ప్రజలు ఈ గేమ్ ను ఆడకూడదని నిషేధం విధించారు. జపాన్ లో మరికొన్ని పర్యాటక ప్రాంతాల్లో కూడా ఈ గేమ్ పై హెచ్చరికలు జారీచేశారు. ఈ హెచ్చరికలకు కట్టుబడి ఉండి...ప్రజలు తమ తమ స్మార్ట్ ఫోన్లలో గేమ్ ను సురక్షితంగా ఆడుకోవాలని  అధికారులు చెబుతున్నారు. అటు ఈ గేమ్ ప్రభావంపై స్పందించిన  ఇండోనేషియా ప్రభుత్వం  కొన్ని ఆంక్షలు విధించగా, సౌదీమత పెద్దలు ఆటలు నిషేధిస్తూ ఫత్వాజారీ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

What’s your opinion

Advertisement