నిద్రపోనిస్తే ఒట్టు...! | Sakshi
Sakshi News home page

నిద్రపోనిస్తే ఒట్టు...!

Published Sun, Nov 22 2015 2:20 AM

నిద్రపోనిస్తే ఒట్టు...!

 బ్రిటన్‌లోని డోర్‌సెట్ కౌంటీలో ఉన్న బౌర్న్‌మౌత్ అనే పట్టణంలో కౌన్సిల్, పోలీసులకు వచ్చిన ఐడియా ఇది. ఈ పట్టణంలోని బస్‌స్టేషన్‌లో రాత్రిపూట పడుకునే వారి సంఖ్య బాగా పెరిగిపోయిందట. ఇళ్లు లేని వారందరూ రాత్రయితే ఇక్కడికి చేరిపోతున్నారట. కొందరు తాగుబోతులు, అసాంఘిక శక్తులు ప్రయాణికులకు న్యూసెన్స్‌గా తయారయ్యారట. దాంతో వీరినెలా అడ్డుకోవాలని ఆలోచిస్తున్న కౌన్సిల్ అధికారులకు ఓ ఐడియా వచ్చింది. అర్ధరాత్రి నుంచి ఉదయం ఆరున్నర దాకా బిగ్గరగా బ్యాగ్‌పైపర్ మ్యూజిక్‌ను ప్లే చేస్తున్నారట.

చెవుల్లో ఈ మ్యూజిక్ గింగిర్లు తిరుగుతుంటే... ఇక నిద్ర ఎలా పడుతుంది చెప్పండి. వీరి ఐడియా పనిచేసి రాత్రిళ్లు పడుకోవడానికి బస్‌స్టేషన్‌కు వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయిందట. అయితే కొందరు స్థానికులు మాత్రం ఇదెక్కడి పిచ్చిపని అని మండిపడుతున్నారు. ఇళ్లు లేని వారిపట్ల మానవత్వాన్ని చూపి సహాయపడాల్సింది పోయి... తరిమేస్తారా? అంటూ విమర్శిస్తున్నారు. 

Advertisement
Advertisement