Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

Not Joining Any Political Party Says Arvinder Singh Lovely
రూ. 600 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత.. 14 మంది అరెస్ట్

గుజరాత్‌లోని అరేబియా సముద్ర తీరంలో భారీస్థాయి మాదకద్రవ్యాల రాకెట్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఛేదించింది. భారత్‌లోకి అక్రమంగా మాదకద్రవ్యాలు చేరవేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రను భగ్నం చేసింది. ఎన్‌సీబీ, గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌), ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ శనివారం రాత్రి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.600 కోట్ల విలువైన 86 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోరుబందర్‌ సమీప తీరంలోని నౌక నుంచి వాటిని సీజ్‌ చేసి, పాకిస్థాన్‌కు చెందిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్‌లో భాగంగా పాక్‌ నౌకని నిలువరించేందుకు కోస్ట్‌గార్డ్‌ నౌకలు,  విమానాలను మోహరించింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న కీలక నౌకల్లో కోస్ట్ గార్డ్ షిప్ రాజ్‌రతన్‌లో ఎన్సీబీ,ఏటీఎస్‌ అధికారులు దాడులు చేశారు. Anti #Narco #Operations @IndiaCoastGuard Ship Rajratan with #ATS #Gujarat & #NCB @narcoticsbureau in an overnight sea - air coordinated joint ops apprehends #Pakistani boat in Arabian Sea, West of #Porbandar with 14 Pak crew & @86 Kg contraband worth approx ₹ 600Cr in… pic.twitter.com/N49LfrYLzz— Indian Coast Guard (@IndiaCoastGuard) April 28, 2024

Cm Jagan Speech In Kandukur Public Meeting
చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ: సీఎం జగన్‌

సాక్షి, నెల్లూరు జిల్లా: మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ముందుకొస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కందుకూరు కేఎంసీ సర్కిల్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘ఈ ఎన్నికల్లో చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ. మనది ఇంటింటికీ మంచి చేసి అభివృద్ధి చేసిన పార్టీ. చంద్రబాబు పార్టీలతో జతకడితే మీ బిడ్డ అందరికీ మంచిచేసి ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నాడు’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.‘‘తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి అన్నట్టుగా.. ఎన్నికలు వస్తుంటే మన రాష్ట్రానికి పొత్తుల నాయకులు వస్తున్నారు. చంద్రబాబు కానీ, దత్తపుత్రుడు కానీ, వదినమ్మ కానీ, ఈనాడు రామోజీరావు కానీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ, టీవీ5 నాయుడు కానీ ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నారా?. ఎన్నికలు వచ్చాయి కాబట్టే చంద్రబాబు కూటమి ఆంధ్రరాష్ట్రానికి వచ్చారు. ఓడిన వెంటనే మళ్లీ హైదరాబాద్‌కి వెళ్లిపోతారు. చంద్రబాబు కూటమి అంటే నాన్ లోకల్ కిట్టీపార్టీ. నయా ఈస్టిండియా కంపెనీ చంద్రబాబు కూటమిలో ఏ ఒక్కరికీ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేసిన చరిత్రే లేదు’’ అని సీఎం జగన్‌ ధ్వజమెత్తారు.‘‘ప్రతి పేద ఇంటికి మనం చేసిన మంచి ఇది అని గర్వంగా చెప్పుకుంటున్నాం. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా, సైనికులుగా నిలవండి అని కోరుతున్నాను. సెల్ఫోన్ నేనే కనిపెట్టా అంటూ బాబులా నేను బడాయిలు చెప్పడం లేదు. ఈ 58 నెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు ప్రజల ముందు పెట్టి మార్కులు వేయమని అడుగుతున్నా. మీరు అధికారం ఇవ్వడం వల్లే ప్రతి పల్లె, పట్టణంలో కనీసం 6 వ్యవస్థలు ఏర్పాటు చేసాం. సచివాలయాలు, వాలంటీర్లు, నాడునేడుతో మారిన బడి, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్, మహిళా పోలీస్, డిజిటల్ లైబ్రరీ, ఫైబర్ గ్రిడ్ ప్రతి ఊరిలో కనిపిస్తాయి. ఇక మీదట కూడా ఈ పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కి మీ బిడ్డకు తోడుగా ఉండండి.’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు.‘‘ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్, ఇంటి ముంగిటికే వచ్చే రేషన్... మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఈ సంప్రదాయం. పేదలకు మనం ఇస్తున్న ఈ మర్యాద కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డకు తోడుగా ఉండండి. చంద్రబాబు మార్కు రాజ్యం.. దోపిడీ సామ్రాజ్యం, గ్రామగ్రామాన లంచాలు, వివక్షలతో జన్మభూమి కమిటీలు. లంచాలు, వివక్ష లేకుండా, కులం, మతం, ప్రాంతం, వర్గం, ఎవరికి ఓటేసారు అనేది కూడా చూడకుండా అర్హులందరికీ ఇచ్చిన ఈ పథకాలన్నీ వచ్చే ఐదేళ్లు కూడా కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డకు తోడుగా ఉండండి. 130 బటన్లు నొక్కి రూ.2,70,000 కోట్లు డీబీటీగా అక్కచెల్లెమ్మల ఖాతాలకు నేరుగా అందించాం’’ అని సీఎం జగన్‌ చెప్పారు ‘‘మళ్లీ వచ్చే ఐదేళ్లూ ఇది కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కండి అని కోరుతున్నాను. ప్రతి పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదన్నా.. మీ గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్,  ఇంటికే అందిస్తున్న ఆరోగ్య సురక్ష సేవలు... విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా అందాలంటే మీ బిడ్డను ఆశీర్వదించండి’’ అని సీఎం జగన్‌ కోరారు.     

​​​ IPL 2024: Gujarat Titans Set 201 Runs Target For RCB
IPL 2024 GT VS RCB: విజృంభించిన సాయి సుదర్శన్‌, షారుక్‌ ఖాన్‌

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్‌ 28) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌.. సాయి సుదర్శన్‌ (49 బంతుల్లో 84 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్‌ ఖాన్‌ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో వృద్దిమాన్‌ సాహా (5), శుభ్‌మన్‌ గిల్‌ (16) నిరాశపర్చగా.. డేవిడ్‌ మిల్లర్‌ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్‌) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌, స్వప్నిల్‌ సింగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.గుజరాత్‌ ఇన్నింగ్స్‌ విశేషాలు..7.4 ఓవర్లలో 49 పరుగులు మాత్రమే చేసిన గుజరాత్‌ చివరి 12.2 ఓవర్లలో ఏకంగా 151 పరుగులు చేసింది.ఈ సీజన్‌లో సాయి సుదర్శన్‌ 400 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.షారుక్‌ ఖాన్‌ తన తొలి ఐపీఎల్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఈ మైలురాయిని షారుక్‌ కేవలం 24 బంతుల్లోనే సాధించాడు. 

Virender Sehwag Slams R Ashwin, Predicts He Might Go Unsold In IPL 2025 Auction
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్‌: సెహ్వాగ్

ఐపీఎల్‌-2024లో టీమిండియా  వెటర‌న్, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ త‌న స్ధాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోతున్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే సాధించాడు. వికెట్లు విష‌యం ప‌క్కన పెడితే త‌న బౌలింగ్‌లో భారీగా ప‌రుగులు కూడా స‌మ‌ర్పించుకుంటున్నాడు.8 మ్యాచ్‌ల్లో 9.00 ఏకాన‌మీతో 278 ప‌రుగులిచ్చాడు. ఈ క్ర‌మంలో అశ్విన్‌పై భార‌త మాజీ ఓపెన‌ర్‌ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శ‌ల వ‌ర్షం కురిపించాడు. త‌నే రాజ‌స్తాన్ కోచ్‌గా గానీ మెంటార్ ఉండి ఉంటే అశ్విన్‌కు ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో చోటు ఇచ్చేవాడిని కాద‌ని సెహ్వాగ్ మండిప‌డ్డాడు."అశ్విన్‌ వైట్‌బాల్‌ క్రికెట్‌కు సెట్‌ కాడు. అశ్విన్‌కు మిడిల్‌ ఓవర్లలలో వికెట్లు తీసే సత్తా లేదు. గతంలో ఓసారి కేఎల్‌ రాహుల్‌ తన స్ట్రైక్‌ రేట్‌ గురించి ఎవరు ఏమనుకున్న పట్టించుకోని వ్యాఖ్యనించాడు. ఇప్పుడు అదే తరహాలో అశ్విన్‌ కూడా వికెట్లు తీయకపోతేనేం బాగానే బౌలింగ్‌ చేస్తున్నా కాదా అన్నట్లు మాట్లాడుతున్నాడు. అశ్విన్‌ ఈ ఏడాది సీజన్‌లో ఇదే ప్రదర్శన కొనసాగిస్తే.. వచ్చే ఏడాది మెగా వేలంలో కచ్చితంగా అమ్ముడుపోడు. ఏ జట్టు అయినా బౌలర్‌ను సొంతం చేసుకున్నప్పుడు అతడి నుంచి వికెట్లు ఆశిస్తోంది. అంతేతప్ప 4 ఓవర్లలో 25 నుంచి 30 పరుగులు ఇస్తే చాలు అని ఏ జట్టు అనుకోదు . రెండు లేదా మూడుసార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవాలని ఏ ప్రాంఛైజీనా భావిస్తోంది. అతడి సహచరలు చాహల్, కుల్దీప్ యాదవ్ ఈ ఏడాది సీజన్‌లో అద్బుతంగా రాణిస్తున్నాడు. అశ్విన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తే బ్యాటర్లు టార్గెట్ చేస్తారని,  క్యారమ్ బాల్స్ వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే అతడికి వికెట్లు పడడం లేదు. అతడు తన ఆఫ్ స్పిన్‌ను నమ్ముకుంటే వికెట్లు పడే ఛాన్స్ ఉంది. కానీ నేను రాజస్తాన్‌ ఫ్రాంచైజీకి మెంటార్ లేదా కోచ్‌గా ఉండి ఉంటే అతడి తుది జట్టులో చోటు దక్కేది కాదని క్రిక్ బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. 

Congress Cpi M Helping Bjp In Bengal Says Mamata Banerjee
దొందూ.. దొందే, సీపీఐ.. కాంగ్రెస్‌పై దీదీ విమర్శలు

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో బీజేపీకి.. కాంగ్రెస్‌, సీపీఐలు రెండు కళ్లులాంటివని సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు.మాల్దా జిల్లా ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తోందని సీఎం మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఎంసీ పోరాటం చేస్తుందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత భారత కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.‘బెంగాల్‌లో కాంగ్రెస్‌తో మాకు పొత్తు లేదు. ఇక్కడ సీపీఎం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. రెండూ బీజేపీతో చేతులు కలిపినట్లు, మీరు (ఓటర్లు) కాంగ్రెస్ లేదా సీపీఐ(ఎం)కి ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లేనన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను తగ్గించుకోవడం, మోదీకి సహాయం చేయడం ఆ రెండు పార్టీల లక్ష్యమన్నారు. రాష్ట్రంలో బీజేపీకి.. కాంగ్రెస్‌, సీపీఐలు రెండు కళ్లులాంటివని’ దీదీ ఆరోపించారు.పశ్చిమ బెంగాల్‌లోని కాంగ్రెస్, సీపీఐ నాయకులు బీజేపీ స్వరంతో మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ప్రజాపాలనను నడుపుతున్న టీఎంసీ విధానాలకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆమె అన్నారు.దేశంలో ప్రతిపక్షాల కూటమి బలంగా ఉంది. దానికి ఇండియా కూటమి అని పేరు పెట్టింది నేనే. కానీ బెంగాల్‌లో కూటమి ఉనికిలో లేదు. దాని రాష్ట్ర నాయకులు  బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దీదీ మండిపడ్డారు. 

IPL 2024 GT VS RCB: Green Takes Incredible Catch Of Shubman Gill In Maxwell Bowling
గ్రీన్‌ సూపర్‌ క్యాచ్‌.. గిల్‌ను బుట్టలో వేసుకున్న మ్యాక్సీ

ఆర్సీబీ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో తాను వేసిన తొలి ఓవర్‌లోనే ఆ జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ను (19 బంతుల్లో 16; ఫోర్‌) బుట్టలో వేసుకున్నాడు. ఏడో ఓవర్‌ నాలుగో బంతికి కెమరూన్‌ గ్రీన్‌ అద్భుతమైన రన్నింగ్‌ క్యాచ్‌ అందుకోవడంతో గిల్‌ పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా గుజరాత్‌ 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. WHAT A CATCH BY CAMERON GREEN. 🤯- He's just Incredible on the field. 🔥 pic.twitter.com/xPQgYsyBUI— Tanuj Singh (@ImTanujSingh) April 28, 2024 ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టాస్‌ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌​కు దిగింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే స్వప్నిల్‌ సింగ్‌ గుజరాత్‌ను దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్‌ ఆఖరి బంతికి స్వప్నిల్‌ సాహాను (5) బోల్తా కొట్టించాడు. కర్ణ్‌ శర్మ క్యాచ్‌ పట్టడంతో సాహా పెవిలియన్‌ బాట పట్టాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ బ్యాటింగ్‌ నత్త నడకను తలపిస్తుంది. 9 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 72 పరగులు చేసింది. సాయి సుదర్శన్‌ (31), షారుఖ్‌ ఖాన్‌ (15) క్రీజ్‌లో ఉన్నారు. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్‌), శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్‌), విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్‌కీపర్‌), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ 

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu
ఎగ్గొట్టేందుకే చంద్రబాబు అడ్డగోలు హామీలు: సజ్జల

సాక్షి, తాడేపల్లి: తమ మేనిఫెస్టో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించేదిలా ఉండదని.. ప్రజలకు ఏం చేస్తామో అదే చెప్పామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాయిళాలు ప్రకటించి ఓట్లు వేయించుకునే ఆలోచనలు తమకు ఉండవని.. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని నాశనం చేశారని సజ్జల మండిపడ్డారు‘‘2014-19 మధ్య చంద్రబాబు తన విశ్వరూపం చూపించారు. చంద్రబాబువి సభ్యసమాజంలో ఉండగలిగే వ్యక్తి మాటలులాగా లేవు. రాళ్ల దాడి చేయమని గతంలో చంద్రబాబు అన్నాడు.. అన్నట్టుగానే రాళ్లతో దాడి చేయించాడు. మేనిఫెస్టో అంటే విశ్వసనీయత ఉండాలి. మీ కుటుంబంలో మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ అంటున్నారు. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేనే అలా అడగగలరు. అలా చంద్రబాబు ఎందుకు ఓటు అడగలేకపోతున్నారు. సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాల్లో మేలు జరిగింది. ఈ పథకాలతో రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా? అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు అంతకంటే ఎక్కువ పథకాలు తెస్తానని ఎలా చెప్తున్నారు’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.‘‘అమలు చేసే వారెవరూ అడ్డగోలు హామీలు ఇవ్వరు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్న వారే చేయగలిగిన హామీలు ఇస్తారు. చంద్రబాబు వలన వాలంటీర్ల వ్యవస్థ ఆగిపోయింది. పెన్షన్ల పంపిణీకి ఆటంకం కలిగించారు. ఇప్పుడు మళ్లీ ఇంటింటికీ ఉద్యోగులను పంపించి పెన్షన్లు ఇవ్వమంటున్నారు. పేదలంతా తమ కాళ్ల మీద తాము నిలపడేలా చూడాలన్నది జగన్ ఇద్దేశం. 70 వేల కోట్లతో జగన్ తన సంక్షేమాన్ని అమలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఏకంగా లక్షన్నర కోట్లు చేస్తానంటూ మాట్లాడుతున్నారు. రాష్ట్ర బడ్జెట్‌తో సంబంధం లేకుండా చంద్రబాబు అబద్ధాల హామీలు ఇస్తున్నారు’’ అని  సజ్జల మండిపడ్డారు.‘‘ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా జగన్ మేనిఫెస్టో ప్రకటించారు. చంద్రబాబు లాగా ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వమని కొంతమంది మాతో కూడా అన్నారు.కానీ జగన్ ఎప్పుడూ చేయలేని పని చెప్పరు. ఇచ్చిన హామీ నుంచి వెనక్కి పోరు. ఎగ్గొట్టాలనుకునే చంద్రబాబు అడ్డమైన హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఉన్న వ్యవస్థలన్నీ నాశనం అవుతాయి. జన్మభూమి కమిటీలు మళ్లీ వస్తాయి. చంద్రబాబుకు ఎవరైనా ఓటేస్తే తమ ఓటును తాము వృథా చేసుకున్నట్టే. చంద్రబాబు తన పాలనలో ఏం చేశారో ఇప్పటికీ ఎందుకు చెప్పలేకపోతున్నారు?’’ అంటూ సజ్జల నిలదీశారు.‘‘జగన్ పాలనలో ఏం జరిగిందో ఎవరైనా చెప్పగలరు. కుప్పంతో సహా ఎక్కడైనా చెక్ చేసేందుకు సిద్దమే. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఇరవై ఇళ్లకు వెళ్లి అడిగే ధైర్యం ఉందా?. పోలవరం పాపం చంద్రబాబుదే. లోకేష్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఎందుకు ప్రజలకు కనపడటం లేదు?. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు. చంద్రబాబు మాటలే పవన్ కూడా మాట్లాడతారు. సెక్రటేరియట్ ని కూడా తాకట్టు పెట్టామని కూడా పవన్ అన్నారు. రాజధానిలోని పొలాలను తాకట్టు పెట్టిందే చంద్రబాబు’’ అంటూ సజ్జల దుయ్యబట్టారు. 

Cm Jagan Speech On Venkatagiri Public Meeting
చంద్రబాబుకు ఓటేస్తే.. మళ్లీ మోసపోవడమే: సీఎం జగన్‌

సాక్షి, నెల్లూరు జిల్లా: బాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జగన్‌కు ఓటు వేస్తే.. పథకాలన్నీ కొనసాగింపు.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలకు ముగింపేనన్నారు. ఆదివారం మధ్యాహ్నం వెంకటగిరి త్రిభువని సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్లలో భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అన్నారు.‘‘ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధమా?. చంద్రబాబుకు ఓటేస్తే.. మళ్లీ మోసపోవడమే. రూ.3 వేల పెన్షన్‌ అంటే గుర్తుకొచ్చేది జగన్‌. అమ్మఒడి అంటే గుర్తుకొచ్చేది జగన్‌. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అంటూ గుర్తుకొచ్చేది జగన్‌. 31 లక్షల ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేది జగన్‌. మహిళా సాధికారిత అంటే గుర్తుకొచ్చేది జగన్‌. సంక్షేమ పథకాలంటే పేదవాడికి గుర్తుకొచ్చేది జగన్‌. రైతన్నల చేయిపట్టుకుని నడిపించేది ఎవరంటే గుర్తుకొచ్చేది జగన్‌. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చాం. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీమ్‌ ఉందా?’’ అంటూ సీఎం జగన్‌ దుయ్యబట్టారు.’’బాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమే. చంద్రబాబును నమ్మడమంటే పసుపుపతిని ఇంటికి తీసుకురావడమే. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి.. ఇదే కూటమి గతంలో ప్రజలను మోసం చేసింది. చంద్రబాబు హామీలను ఎల్లో మీడియా ఊదరగొట్టింది. రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారు. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు. ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. అర్హులైన వారికి మూడు సెంట్ల స్థలం ఇస్తామని మోసం చేశారు’’ అంటూ చంద్రబాబుపై సీఎం జగన్‌ నిప్పులు చెరిగారు

IPL 2024: Gautam Gambhir On RCB Virat kohli Strike Rate
కోహ్లి స్ట్రైక్‌రేటుపై గంభీర్‌ వ్యాఖ్యలు.. వైరల్‌

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లితో తనకు ఎలాంటి విభేదాలు లేవని భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ స్పష్టం చేశాడు. మీడియా అత్యుత్సాహం వల్లే తమ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందిందని పేర్కొన్నాడు.అదే విధంగా ఐపీఎల్‌-2024లో ఆర్సీబీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి కూడా గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా గతేడాది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి- అప్పటి లక్నో మెంటార్‌ గంభీర్‌ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వీరిద్దరి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, తాజా సీజన్‌లో కేకేఆర్‌ మెంటార్‌గా అవతారమెత్తిన గంభీర్‌.. ఇటీవలి మ్యాచ్‌ సందర్భంగా కోహ్లిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు.గొడవ పడితే చూడాలనిఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలో ఓ షోలో విరాట్‌ కోహ్లి మాట్లాడుతూ.. ‘‘మేము ఇద్దరం గొడవ పడితే చూడాలని అనుకునే వాళ్లే ఎక్కువగా ఉంటారు. వాళ్లను ఈ వీడియోలు నిరాశపరిచి ఉంటాయి’’ అని చమత్కరించాడు.ఈ విషయంపై తాజాగా స్పందించిన గౌతం గంభీర్‌ కోహ్లి వ్యాఖ్యలతో ఏకీభవించాడు. టీఆర్‌పీ రేటింగ్‌ల కోసమే మీడియా ఇలాంటివి ఎక్కువగా ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను, విరాట్‌ కోహ్లి ఎలాంటి వాళ్లమో, తమ మధ్య అనుబంధం ఎలా ఉంటుందో వారికి తెలియదన్న గౌతీ.. వీలైతే పాజిటివిటీని పెంచే అంశాలను చూపించాలన్నాడు.ఎవరికి వారే ప్రత్యేకంతాను, కోహ్లి పరిణతి చెందిన వ్యక్తులం కాబట్టి ఇలాంటి వాటి గురించి ఎక్కువగా పట్టించుకోమని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. ఇక కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి జరుగుతున్న చర్చలపై స్పందిస్తూ.. ‘‘ప్రతి ఒక్క ఆటగాడు భిన్నంగా ఉంటాడు.మాక్స్‌వెల్‌ ఆడినట్లు కోహ్లి ఆడకపోవచ్చు. కోహ్లి తీరుగా మాక్స్‌వెల్‌ షాట్లు బాదలేకపోవచ్చు. పదకొండు మంది సభ్యులున్న జట్టులో ఎవరికి వారే ప్రత్యేకం. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో 1- 8 వరకు విధ్వంసకర బ్యాటర్లు అందుబాటులో ఉంటే స్కోరు 300 కావొచ్చు లేదంటే 30 పరుగులకే ఆలౌట్‌ కావచ్చు.జట్టును గెలిపించినపుడు స్ట్రైక్‌రేటు 100 ఉన్నా బాగానే అనిపిస్తుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం 180 స్ట్రైక్‌రేటు కూడా మన కంటికి కనిపించదు. మ్యాచ్‌ జరిగే వేదిక, పిచ్‌ పరిస్థితి, ప్రత్యర్థి జట్టు.. ఇలా భిన్న అంశాలపై స్ట్రైక్‌రేటు ఆధారపడి ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు’’ అంటూ విరాట్‌ కోహ్లికి గంభీర్‌ మద్దుతుగా నిలిచాడు. కాగా ఈ సీజన్‌లో కోహ్లి ఆడిన 9 మ్యాచ్‌లలో కలిపి 145.76 స్ట్రైక్‌రేటుతో 430 పరుగులు సాధించి టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 

YS Jagan Manifesto
ప్రత్యర్థులను గుక్క తిప్పుకోనివ్వని సీఎం జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ కాంగ్రెస్  అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తక్కువోడు కాదు.. ప్రత్యర్దులను గుక్క తిప్పుకోకుండా చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల కోసం  ప్రకటించిన  తీరును గమనిస్తే ఆయనలో సాహసి కనిపిస్తారు. దాదాపు కొత్త స్కీములు లేకుండా, ఉన్నవాటిని యధాతధంగా కొనసాగిస్తూ తన నిజాయితిని రుజువు చేసుకున్నారు. ఒక టీచర్ మాదిరి తన గత  మేనిఫెస్టోని,కొత్త మేనిఫెస్టోని చూపుతూ చేసిన స్పీచ్ ఆసక్తికరంగా ఉంది.జగన్ మేనిఫెస్టో తర్వాత చంద్రబాబు మరింత ఆత్మరక్షణలో పడతారు. తాను ఇచ్చిన సూపర్ సిక్స్‌ను ప్రజలు నమ్మరన్న సంగతి ఆయనకు అర్ధం అవుతుంది. అందుకోసం చంద్రబాబు కొత్త అబద్దాలను చెబుతారేమో చూడాలి. జగన్  మేనిఫెస్టో  తీరు చూస్తే, 2009లో ఈయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మేనిఫెస్టోని ప్రకటించిన సందర్భం గుర్తుకు వస్తుంది.అప్పటికి ఐదేళ్లు పాలన పూర్తి చేసుకున్న వైఎస్ ఆర్ తాను కొత్త హామీలను ఏమీ ఇవ్వబోనని ప్రకటించారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్  మరో రెండు గంటలు అదనంగా ఇవ్వడం వంటి ఒకటి రెండు హామీలు మినహాయించి కొత్తవి లేకుండా  వైఎస్ మేనిఫెస్టోని ప్రకటించడం సాహసంగా అప్పట్లో అనుకున్నారు. అప్పుడు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీఆర్‌ఎస్‌, సీపీఐ, సీపీఎంలతో  పొత్తు పెట్టుకోవడమే కాకుండా, టీడీపీ మేనిఫెస్టో నిండా వాగ్దానాల వరద పారించారు.ప్రతి ఇంటికి నేరుగా నగదు బదిలీ చేస్తామని అది ఒక్కొక్కరికి పదిహేనువందల నుంచి ఉంటుందని చెప్పారు. అదొక్కటే కాదు.. అనేక ప్రజాకర్షక హామీలను గుప్పించారు. అయినా వైఎస్ తొణకలేదు.తాను చేయగలిగినవే చేస్తానని చెప్పారు. దానినే ప్రజలు  నమ్మారు.ఆయనను గెలిపించారు. మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కాని దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించారు.ఆ తర్వాత 2014లో వైఎస్ కుమారుడు జగన్ సొంత పార్టీ పెట్టుకుని ఎన్నికలలోకి వచ్చారు. ఆ సమయంలో  చాలామంది రైతుల రుణమాఫీ హామీ ఇవ్వాలని ఆయనకు సూచించారు. కాని ఆయన అందుకు ఒప్పుకోలేదు.ఒకసారి ప్రకటించాక, ప్రభుత్వం వచ్చినా చేయలేకపోతే దెబ్బతింటామని అన్నారు. కాని అదే చంద్రబాబు నాయుడు మాత్రం ఆచరణసాధ్యం కాదని తెలిసినా  లక్ష కోట్ల రూపాయల రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తామని,బ్యాంకులలో తాకట్టులో ఉన్న బంగారు నగలను విడిపిస్తామని హామీ ఇచ్చారు. అదే కాకుండా కొన్ని వందల హామీలను మేనిఫెస్టోలో పెట్టారు.  అప్పటి పరిస్థితులలో  టీడీపీ  కూటమిని గెలిపించారు. ఆ తర్వాత చంద్రబాబు సినిమా చూపించడం ఆరంభించారు.రుణమాఫీ అని ఆశపడ్డవారికి చుక్కలు చూపించారు. రకరకాల విన్యాసాలు చేశారు. పైగా రైతులను ఆశపోతులని తూలనాడారు. కాపు రిజర్వేషన్ తదితర అనేక అంశాలలో అదే పరిస్థితి. సుమారు 400 వాగ్దానాలు చేసి చేతులెత్తేశారు. ఆ విషయం ప్రజలకు బాగా అర్దం అయింది. 2019 లో మళ్లీ జగన్ ,చంద్రబాబుల మధ్యే పోటీ సాగింది.ప్రజలంతా చంద్రబాబు తమను మోసం చేశారని భావించి జగన్ వైపు వచ్చి భారీ మెజార్టీతో గెలిపించారు. ఆ తర్వాత ఆయన తన మేనిఫెస్టోని ఎప్పుడూ లేని విధంగా సచివాలయంలో పెట్టి హామీల అమలుకు శ్రీకారం చుట్టారు.అలాగే  ప్రతి ఏటా తన హామీల పరిస్థితిని ప్రజలకు వివరించారు.దాంతో ప్రజలకు ఆయనపై ఒక నమ్మకం ఏర్పడింది. 99 శాతం పైగా హామీలు నెరవేర్చి మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నట్లు ఆయన  చెబుతున్నారు.దీనిని ఎవరూ కాదనలేని పరిస్థితి. పైగా జగన్ అమలు చేసిన స్కీములను తాము చేస్తామని అంత పెద్ద సీనియర్ చంద్రబాబు నాయుడు చెప్పే పరిస్థితిని జగన్ కల్పించారు.అదే  జగన్ కు  పెద్ద విజయం గా భావించాలి. ప్రత్యర్ధి తనను అనుసరిస్తున్నాడంటే ఆ కిక్కే వేరబ్బా అన్నట్లుగా చంద్రబాబు తీసుకునే యుటర్న్ లు జగన్ కు పెద్ద ప్లస్ పాయింట్లు అయ్యాయి. జగన్ వలంటీర్ల వ్యవస్తను పెట్టినప్పుడు ,ఆయా స్కీములు అమలు చేస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటివారు చెప్పిన పిచ్చి సలహాలు నమ్మి ఏపీ  శ్రీలంక అయిపోతుందని, నాశనం అవుతోందని చంద్రబాబు ప్రచారం చేశారు.తీరా ఎన్నికల సమయానికి జగన్ స్కీములను, తెలంగాణలో,కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కలిపి సూపర్ సిక్స్ అంటూ ఒక పత్రం తయారు చేసుకుని ప్రజల ముందుకు వచ్చారు.   అది చూసి జనం అంతా ఆశ్చర్యపోయారు. జగన్ అమలు చేస్తే  నాశనం అన్నారు. అంతకు మించిన వాగ్దానాలు  చంద్రబాబు ఎలా ఇస్తారని విస్తుపోయారు.దాంతో చంద్రబాబు క్రెడిబిలిటి పోయింది. ఆయనను సమర్ధించుదామని అనుకున్నవారికి వాదన లేకుండా చేశారు.ఆ విషయాన్ని జగన్ ఇప్పుడు చాలా బాగా వాడుకుని తాను చేయలేనివి చెప్పనని, చంద్రబాబులా మోసం చేయబోనని ప్రజలకు పరిస్థితి విడమరిచి చెప్పారు. కేవలం వృద్దాప్య పెన్షన్  ను మరో ఐదు వందల రూపాయలు అది కూడా వచ్చే టరమ్ చివరి రెండేళ్లు పెంచుతానని,ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ ల ఏర్పాటు చేస్తానని, అమ్మ ఒడి కింద ఇచ్చే మొత్తాన్ని  పదిహేనువేల నుంచి పదిహేడువేలు చేస్తామని జగన్ తాజా మేనిఫెస్టోలో తెలిపారు.అలాగే రైతు భరోసాను పదహారువేలు చేస్తామని తెలిపారు.ఆయా స్కీములను కొనసాగిస్తూ కొద్దిపాటి మార్పులు మాత్రం జగన్ ప్రతిపాదించారు. తాను అమలు చేస్తున్న స్కీములు, ఇవి కాకుండా తప్పనిసరిగా అమలు చేయవలసిన కార్యక్రమాలకు కలిపి డెబ్బైవే కోట్ల వ్యయం అవుతుందని, కాని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన స్కీములకు, ఎవరు ఉన్నా అమలు చేయవలసిన కార్యక్రమాలకు కలిపి లక్షన్నర కోట్ల వ్యయం అవుతుందని లెక్కలుగట్టి చెప్పారు. చంద్రబాబు మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తున్నారన్న విషయం అర్ధం అయ్యేలా జగన్ విడమరిచి చెప్పారు. చంద్రబాబు తాను సంపద సృష్టిస్తానని బొంకుతారని అంటూ ఆయన అధికారంలో ఉన్న పద్నాలుగేళ్లలో రాష్ట్రం ఎప్పుడూ రెవెన్యూ లోటులోనే ఉన్న విషయాన్ని బడ్జెట్ పుస్తకాల ఆధారంగా చెప్పారు.చంద్రబాబు దృష్టిలో సంపద అంటే రాజధాని గ్రామాలలో తనవారికి రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే బ్లాక్ మనీనే అనుకోవాలి. అందులో కూడా వారికి పన్ను  రాయితీలు ఇప్పించారు.  అంతే తప్ప మిగిలిన రాష్ట్రం అంతటిని గాలికి వదలివేశారు. పైగా రాష్ట్ర  ప్రజలందరు పన్నులు రూపంలో కట్టిన డబ్బును  రాజధాని గ్రామాలలో మాత్రమే వ్యయపరచడానికి సిద్దం అయ్యారు.దాంతో ప్రజలకు  మండి ఆయనను ఘోరంగా ఓడించారు. అయినా ఇప్పుడు మళ్లీ అమరావతి అని చంద్రబాబు అంటున్నారు.కాని జగన్ మాత్రం చాలా ధైర్యంగా విశాఖ నుంచి పాలన చేస్తామని, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని, కర్నూలు న్యాయ రాజధాని అని మరోసారి స్పష్టం చేశారు. విశాఖను రాష్ట్రానికి ఉపయోగపడే గ్రోత్ ఇంజన్ గా మార్చాలన్నది జగన్ సంకల్పం అయితే,  ఏపీ ప్రజలందరి సొమ్ము అమరావతి గ్రామాలలో ఖర్చు చేయాలన్నది చంద్రబాబు  ఆలోచన.గతసారి ప్రజలు చంద్రబాబు ప్రతిపాదనను తిరస్కరించారు. ఇక అప్పుల విషయంలో కూడా తన ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న తేడాను గణాంకాలతో సహా జగన్ వివరించారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్,మోడీలు కలిసి 2014లో  ఇచ్చిన  హామీల పత్రం జగన్ కు ఆయుధంగా మారింది. అందులో పేర్కొన్న ఏ ఒక్కటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా  చేయయలేకపోయారు. తాను అలా చేయబోనని, చేయగలిగే  వాటినే హామీలు గా ఇస్తానని జగన్  అంటూ చంద్రబాబు సూపర్ సిక్స్ వంటి అసాధ్యమైన హామీలతో  పోటీ పడలేదు. చంద్రబాబు చెప్పే అబద్దాలతో తాను పోటీ పడబోనని కూడా జగన్ ప్రకటించారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ ఒక ఉపాద్యాయుడు మాదిరి పలు అంశాలను వివరించిన తీరు ఆసక్తికరంగా ఉందని చెప్పాలి.ఆయా వర్గాలకు చేయదలచిన కార్యక్రమాలను వివరించడం, పరిశ్రమల పరంగా ,ప్రాజెక్టుల పరంగా ఏమి చేయదలించింది చెప్పే యత్నం చేశారు. సిద్దం సభల మాదిరే మేనిఫెస్టో విడుదల కు కూడా ఆయన పూర్తిగా సిద్దం అయి ప్రజలను కూడా మానసికంగా సిద్దం చేయడానికి వీలుగా ప్రసంగించారు. చంద్రబాబు కూటమి ఇచ్చే హామీలను నమ్మవద్దని, గతంలో మాదిరే  మళ్లీ చంద్రబాబు మోసం చేయడం కోసమే అలాంటి హామీలను ఇస్తున్నారని సోదాహరణంగా జగన్ వివరించారు. జగన్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో పడే  పరిస్థితి ఏర్పడింది.తాను చెబుతున్న వాగ్దానాలకు అయ్యే ఖర్చు చెప్పలేరు. చెబితే ఆయనను నమ్మే పరిస్థితి ఉండదు. ఆ రకంగా చంద్రబాబు సూపర్ సిక్స్ కు జగన్ బ్రేక్ వేసినట్లయిందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కు పెద్దగా పోయేది లేదు..వచ్చేది లేదు ..ఆయన  పోటీచేసే స్థానాలు కూడా పట్టుమని పది లేవు.అందువల్ల ఆయన చంద్రబాబు చెప్పేవాటికి భజన చేయడం తప్ప సొంతంగా ఆలోచించవలసిన అవసరం లేదు. బిజెపి వారు ఇప్పటికే తాము ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని చెబుతున్నారు.దానిపై చంద్రబాబు ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయారు. బిజెపితో ఎందుకు కలిసింది?దానివల్ల ప్రత్యేక హోదా తెస్తారా?లేక విభజన హామీలన్నిటిని తీర్చగలుగుతారా?  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ  ఆపుతారా? మొదలైనవి ఏమీ లేకుండా చంద్రబాబు  మేనిఫెస్టో ఇచ్చినా జనం నమ్మరు.జగన్ చెప్పినట్లు రాష్ట్ర ఆర్దిక వనరులను లెక్కలోకి తీసుకోకుండా ఏ హామీ పడితే అది ఇచ్చి ప్రజలను మోసం చేయడమే  లక్ష్యంగా చంద్రబాబు కూటమి ముందుకు వస్తోంది.ఉదాహరణకు వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని,ఆ వ్యవస్థపై పలుమార్లు  విషం కక్కిన చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లు  ఇప్పుడు దానిని కొనసాగిస్తామని, పైగా వారికి ఐదువేల రూపాయల బదులు పదివేల రూపాయలు ఇస్తామని చెబుతున్నారు.అందుకు ఎంత వ్యయం అవుతుందో వారు లెక్కగట్టకుండా గండం నుంచి బయటపడడానికి హామీ ఇచ్చారు. అందువల్లే దానిని ఆయన మాటలను ఎవరూ విశ్వసించడం  లేదు. చంద్రబాబును నమ్మితే జగన్ పద్దతిగా ఇస్తున్న  సంక్షేమ పధకాలను కూడా నష్టపోతామన్న  భయం ప్రజలలో ఉంది. అందువల్లే జగన్ ధైర్యంగా కొత్త హామీలు ఏవీ ఇవ్వకుండా ప్రజల ముందుకు వచ్చారు. జగన్ చేసిన వాదనకు ఎలా సమాధానం ఇవ్వలో తెలియక  చంద్రబాబు జుట్టు పీక్కునే పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

తప్పక చదవండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement