Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

కత్తి దాడిలో కుడికన్నును కోల్పోయిన సల్మాన్‌ రష్దీ
హింసకు కళాత్మక ప్రతీకారం!

న్యూయార్క్‌లోని చౌటక్వా ఇన్‌స్టిట్యూషన్‌లో రెండేళ్ల క్రితం ఆగస్టు 12న ఉపన్యాసం ఇచ్చేందుకు సిద్ధమౌతున్న భారత సంతతి రచయిత సల్మాన్‌ రష్దీ అతి పాశవికంగా పదిహేను కత్తిపోట్లకు గురయ్యారు. చావు తప్పి కన్ను పోగొట్టుకున్న ఆ ప్రాణాపాయం నుండి మెల్లగా కోలుకుంటున్న స్థితిలో ఉన్న రష్దీ... నాటి ఘటనపై తాజాగా ‘నైఫ్‌: మెడిటేషన్స్‌ ఆఫ్టర్‌ యాన్‌ అటెంప్టెడ్‌ మర్డర్‌’ పుస్తకం రాశారు. భయంకరమైన ఆ దాడి గురించి ఈ పుస్తకంలో సల్మాన్‌ రష్దీ నేరుగా పాఠకులతో సంభాషించారు. నేటికీ వెంటాడుతున్న తన బాధను, అంతఃసంఘర్షణలను బహిర్గతం చేస్తూ... నెమ్మదిగానే అయినా ఆత్మవిశ్వాసంతో తనెలా కోలుకున్నదీ హృద్యంగా వివరించారు. అదొక గొప్ప మానవీయ పద స్వరీకరణ.మునుపటి తన కళాఖండాల మాదిరిగా కాకుండా, తన తాజా పుస్తకం ‘నైఫ్‌: మెడిటే షన్స్‌ ఆఫ్టర్‌ యాన్‌ అటెంప్టెడ్‌ మర్డర్‌’లో... దాదాపుగా తనను చంపి నంత పని చేసిన ఆనాటి భయంకరమైన దాడి గురించి సల్మాన్‌ రష్దీ నేరుగా పాఠకులతో సంభాషించారు. సన్నిహితంగా, నిజాయితీగా, ఒప్పించే ప్రయత్నంలో విశ్వాసాన్ని చొరగొనే విధంగా, తన అనిశ్చిత స్థితిని పంచుకుంటూ, తన బాధను, అంతఃసంఘర్షణలను బహిర్గతం చేస్తూ, నెమ్మదిగానే అయినా ఆత్మవిశ్వాసంతో నిలకడైన ప్రయాణంగా తనెలా కోలుకున్నదీ చక్కగా వివరించారు. అదొక గొప్ప మానవీయ పద స్వరీకరణ. పూర్తిగా వ్యక్తిగతమైనది. రష్దీ కంటే సల్మాన్‌గానే ఆయన ఎక్కువగా మాట్లాడారని చెప్పొచ్చు.   ఆయన తన పైన జరిగిన దాడి(2022) గురించి రాస్తారని నాకు కచ్చితంగా తెలుసు. అయినా ఒక నవలా రచయిత రాయకుండా ఎలా ఉండగలరు? నాకెప్పుడో తెలుసు అని నేను అనడం ఒక పాఠకుడి అంచనాగా మాత్రమే. దాడి ప్రభావాన్ని తనెలా మానసికంగా తట్టుకుని నిలబడ్డారన్న దానిపై పుస్తకంలో రష్దీ చేసిన విశదీకరణ ఆయన ప్రయత్నబలం ఎంత పటిష్టమైనదో చెబుతోంది. ‘‘జరిగిన దానిని అర్థం చేసుకునేందుకు, దానిని అధిగమించేందుకు, నాదిగా అలవాటు చెందేందుకు, ఒక బాధితుడిగా మాత్రమే ఉండటాన్ని నిరాకరించేందుకు నేను ఎంచుకున్న మార్గం ఈ రాయటం అన్నది కావచ్చు. హింసకు నేను చెప్పే సమాధానం కళ ’’ అంటారు రష్దీ.ఈ పుస్తకం రష్దీ ప్రతిస్పందన అయితే, పుస్తకపు శీర్షిక రష్దీ ఉద్దేశపూర్వకమైన ఎంపిక. అతి దారుణంగా ఆయనపై కత్తిపోట్ల దాడి జరిగింది. కత్తి అన్నది తుపాకీకి చాలా భిన్నమైనది. ‘‘కత్తిపోటు ఒక విధమైన హత్తుకోలు. మనిషికి దగ్గరగా వచ్చి పొడిచే ఆయుధం. కత్తిపోట్లు అతి సమీప నేరాలు’’ అంటారు రష్దీ. అయితే కత్తి ఒక ఉపకరణం కూడా. ఉపయోగించే దాన్ని బట్టి ఆయుధమో, సాధనమో అవుతుంది. ఆ కోణంలో చూస్తే భాష కూడా పదునైన కత్తి వంటిదే. ‘‘భాషే నా కత్తి’’ అని చెబుతారాయన. ‘‘నేనొకవేళ అనుకోకుండా ఒక అవాంఛనీయమైన కత్తి పోరాటంలో చిక్కుకున్నట్లయితే, ఎదురుదాడికి నేను తిప్పే కత్తి బహుశా నా భాషే కావచ్చు. నా ప్రపంచాన్ని నేను పునర్నిర్మించుకోటానికి, తిరిగి నా అధీనంలోకి తెచ్చు కోటానికి నేను వాడే పరికరం అదే కావచ్చు’’ అంటారు.దాడి గురించి రష్దీ వర్ణన సూక్ష్మ సునిశితంగా, వెన్నులో వణుకు పుట్టించేలా, ఆ ఘటనను అదే రీతిలో తిరిగి చూపించినట్లుగా ఉంది. ‘‘నేను ఇప్పటికీ ఆ క్షణాన్ని నెమ్మదిగా కదిలే దృశ్యంలా చూడగలను. అతడు ప్రేక్షకుల నుంచి ఒక్క ఉదుటున దుమికి పరుగున నన్ను సమీపిస్తున్న ప్పుడు నా కళ్లు అతడిని అనుసరించాయి. దూకు డుగా పడుతున్న అతడి ప్రతి అడుగును నేను గమనిస్తున్నాను. చప్పున నేను నా కాళ్లపై లేవటం నాకు తెలుస్తూ ఉండగా అతడి వైపు తిరిగాను. ఆత్మరక్షణగా నా ఎడమ చేతిని పైకి లేపాను. ఆ చేతిపై అతడు తన కత్తిని దిగపొడిచాడు.’’  బాధితుడిలా కాకుండా, జరుగుతున్న దానిని బయటి నుంచి చూస్తున్న వ్యక్తిగా... ‘‘అతడు చాలా పాశవికంగా పోట్లు పొడు స్తున్నాడు. పొడు స్తున్నాడు, కత్తిని నాపై తిప్పుతున్నాడు. కత్తి దాని కదే ప్రాణం కలిగి ఉన్నట్లుగా నాపై విరుచుకుపడింది’’ అని రష్దీ రాశారు. రష్దీ స్పృహ కోల్పోయినట్లు లేదు. జరుగుతున్న దాడి ఎలాంటిదో తెలుస్తూనే ఉన్న దిగ్భ్రాంత స్థితిలో ఆయన ఉన్నారు. ‘‘నేలపై పడి ఉన్న నేను నా శరీరం నుంచి కారుతున్న రక్తపు మడుగును చూస్తూ ఉండటం నాకు గుర్తుంది. చాలా రక్తం. అప్పుడు నాకు అనిపించింది: ‘నేను చనిపోతున్నాను’ అని. కానీ అదేమీ నాకు భయం కలిగించ లేదు. ఊహించనిది జరుగబోతున్నట్లుగానూ లేదు. బహుశా అలా జరిగే అవకాశం ఉంది అనుకున్నాను. జరగవలసిందే జరిగిపోతున్న దనే ఆలోచన.’’ ఆ సమయంలో రష్దీ గ్రహించని విషయం ఏంటంటే, బతికి బట్టకట్టాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ‘‘నా క్రెడిట్‌ కార్డులు ఈ జేబులో ఉన్నాయి. ఇంటి తాళాలు మరో జేబులో ఉన్నాయి’’ అని, ఆ స్థితితో ఎవరైతే తన పట్ల శ్రద్ధ వహిస్తున్నారో వారితో అస్పష్టంగా చెబుతున్నారు. ‘‘ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే, నా బొంగురు గొంతు దైనందిన వస్తువుల గురించి పట్టింపుతో ఉందంటే, నేననుకోవటం నా దేహంలోని ఒక భాగం – లోలోపలి పోరాడే భాగం – చనిపోయేందుకు సిద్ధంగా ఏమీ లేదని; ఆ క్రెడిట్‌ కార్డులు, ఇంటి తాళాలు మళ్లీ ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఉందని, ‘బతుకు, బతుకు’ అని నాతో గుసగుసలాడుతోందని’’అంటారు రష్దీ.  ఆయన శరీరంపై పదిహేను కత్తిపోట్లు పడ్డాయి. మెడ, కుడి కన్ను, ఎడమ చెయ్యి, కాలేయం, పొత్తి కడుపు, నుదురు, చెంపలు, నోరు, ఇంకా... తల నుంచి కింది భాగమంతటా. ‘బీబీసీ’ ప్రతినిధి ఎలాన్‌ యెన్తోబ్‌తో మాట్లాడుతూ, మెత్తగా ఉడికించిన గుడ్డును తన పైచెంప మీద ఉంచినట్లుగా తన కుడికన్నుకు అనిపించిందని రష్దీ అన్నారు. ఆ కన్ను పోవటం అనే తీవ్రమైన కలత గురించి పుస్తకంలో ఆయన మనోభావనతో కాక ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడారు. ‘‘ఇప్పుడు కూడా, ఇది రాస్తున్నప్పుడు ఈ నష్టంతో సర్దుకుని పోవడం నా వల్ల కావటం లేదు. అది శారీరకంగా కష్టమైనది. మానసికంగా మరింత కష్టమైనది. ఇది నా జీవితాంతం ఇలాగే ఉండిపోతుందని అంగీకరించడం నిస్పృహను కలిగిస్తోంది’’ అని రాశారు రష్దీ. మెక్రాన్‌ (ఫ్రాన్స్‌ అధ్యక్షుడు), బైడెన్‌ (అమెరికా అధ్యక్షుడు), ఆఖరికి రష్దీ అంటే ఎప్పుడూ ఇష్టపడని బోరిస్‌ జాన్సన్‌ (ఆ సమయంలో బ్రిటన్‌ ప్రధాని) కూడా రష్దీపై దాడి జరగటం పట్ల భయాన్ని,ఆందోళనను వ్యక్తం చేశారు. ‘‘అతని పోరాటం మా పోరాటం’’ అని మెక్రాన్‌ ప్రముఖంగా ప్రకటించారు. కానీ రష్దీ జన్మించిన దేశంలో, తన జన్మభూమి అని రష్దీ చెప్పుకునే దేశంలో మౌనమే అధికారిక ప్రకటన అయింది. ‘‘నను గన్న నా భారతదేశానికి, నాకు లోతైన ప్రేరణ అయిన భారతదేశానికి ఆ రోజున మాటలే దొరకలేదు’’ అన్నారు రష్దీ.  ఎంత సిగ్గుచేటు!కరణ్‌ థాపర్‌ వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Narendra Modi comments on Rahul Gandhi
బాద్‌షాల అరాచకాలు కన్పించ లేదా?

బెళగావి/సిర్సీ/దావణగెరె:  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ప్రధాని నరేంద్ర∙మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మన దేశానికి చెందిన రాజులు, మహారాజులను కించపర్చిన రాహుల్‌ నవాబులు, నిజామ్‌లు, సుల్తాన్లు, బాద్‌షాలు సాగించిన అరాచకాలపై మాత్రం నోరుమెదపడం లేదని మండిపడ్డారు. కేవలం బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలతో లబ్ధి పొందడానికి రాహుల్‌ ఆరాటపడుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం కర్ణాటకలోని బెళగావి, దావణగెరె, ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సీ, హోస్పేట్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. మన దేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాట గాథలను కాంగ్రెస్‌ పార్టీ పాలనలో బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని రాశారని, ఆ పాపాన్ని రాహుల్‌ గాంధీ ఇప్పటికీ కొనసాగిస్తున్నారని విమర్శించారు. భారతదేశ రాజులు, మహారాజులు పేద ప్రజలపై క్రూరమైన అణచివేత, దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ఆస్తులు, భూములు బలవంతంగా లాక్కున్నారంటూ రాహుల్‌ ఇటీవల ఆరోపించారని గుర్తుచేశారు. ఛత్రపతి శివాజీ, కిత్తూరు రాణి చెన్నమ్మ వంటి గొప్ప పాలకులను రాహుల్‌ అవమానించారని చెప్పారు. దేశ చరిత్రలో నవాబులు, నిజామ్‌లు, సుల్తాన్లు, బాద్‌షాలు సాగించిన అఘాయిత్యాలు, దారుణాల గురించి మాట్లాడాలంటే కాంగ్రెస్‌ రాజకుమారుడి నోటికి తాళం పడుతోందని ఎద్దేవా చేశారు. మొఘల్‌ రాజు ఔరంగజేబు మన ఆలయాలను అపవిత్రం చేశాడని, కూలి్చవేశాడని అన్నారు. అలాంటి ఔరంగజేబును ఆరాధించే పారీ్టలతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుందని ఆక్షేపించారు. ఔరంగజేబు దుశ్చర్యలపై రాహుల్‌ ఏనాడూ మాట్లాడలేదన్నారు. రాజులు, మహారాజులు మన దేశానికి ఎన్నో సేవలు చేశారని, వారి త్యాగాలు మరువలేమని పేర్కొన్నారు. రాజులకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఉన్న ధైర్యం సుల్తాన్లకు వ్యతిరేకంగా మాట్లాడడానికి రాహుల్‌కు లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు మైండ్‌సెట్‌ ఆ పార్టీ మేనిఫెస్టోలో కనిపిస్తోందని వెల్లడించారు. ఓట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) మద్దతు  తీసుకుంటోందని ఆరోపించారు. వయనాడ్‌లో నెగ్గడానికి పీఎఫ్‌ఐకి లొంగిపోతారా? అని రాహుల్‌ని ప్రశ్నించారు.  ప్రజల ఓట్లతోనే నాకు ధైర్యంఓటు బ్యాంకు రాజకీయాలు మరింత నీచంగా, విధ్వంసకరంగా తయారవుతున్నాయని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ చివరి క్షణం వరకూ ఎన్నో అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. ఆలయ నిర్మాణం జరగకుండా కాంగ్రెస్, దాని కోటరీ 70 ఏళ్లపాటు కుట్రలు సాగించాయని దుయ్యబట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటి రోజే అయోధ్యలో ఆలయ నిర్మాణంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, అప్పటి పాలకులు ఆ పని చేయలేదన్నారు. నిర్ణయం తీసుకొని, అమలు చేయడానికి 56 అంగుళాల ఛాతీ(మోదీ) కావాల్సి వచి్చందన్నారు. ప్రభుత్వ సొమ్ముతో గానీ, పన్ను చెల్లింపుదార్ల డబ్బుతో గానీ ఆ ఆలయం నిర్మించలేదని, శ్రీరాముడి భక్తుల విరాళాలతోనే ఆలయ నిర్మాణం జరిగిందని వివరించారు. రామమందిర ప్రాణప్రతిష్టకు హాజరు కావాలంటూ ఆహా్వనం అందజేస్తే కాంగ్రెస్‌తోపాటు కొన్ని పారీ్టలు తిరస్కరించాయని గుర్తుచేశారు. ఆ పార్టీలను ఎన్నికల్లో తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలకాలని, మరింత బలం చేకూర్చాలని కోరారు.వారసత్వ పన్నును ఆమోదించను  కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే వారసత్వ పన్నుతో ఆస్తులు పోగొట్టుకోవాల్సి వస్తుందంటూ ప్రజలను ప్రధానమంత్రి అప్రమత్తం చేశారు. పిల్లల కోసం ఆదా చేసుకున్న డబ్బులను సైతం లాక్కుంటారని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు 45 శాతం ఆస్తులను మాత్రమే బదిలీ చేసే అవకాశం ఉంటుందని, మిగతా 55 శాతం ఆస్తులను కాంగ్రెస్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, ఓటు బ్యాంక్‌కు కట్టబెడుతుందని పేర్కొన్నారు. అయితే, తాను జీవించి ఉన్నంతకాలం ఇలాంటి వారసత్వ పన్ను ఆమోదించే ప్రసక్తే లేదని మోదీ తేలి్చచెప్పారు. మీ ఉద్దేశాలు వదిలేసుకోండి అంటూ కాంగ్రెస్‌         పారీ్టకి హితవు పలికారు. కర్ణాటకలో ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందువులపై దాడులు పెరిగిపోయాయని ప్రధానమంత్రి అన్నారు.  2014 కంటే ముందు బ్రోకర్ల రాజ్యం  కొన్ని దేశాలు, సంస్థలు మన దేశం, మన ప్రభుత్వం బలహీనపడాలని కోరుకుంటున్నాయని, అలాగైతే లాభపడొచ్చని, ఆటలు సాగించుకోవచ్చని భావిస్తున్నాయని మోదీ చెప్పారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతుండడం ఆయా దేశాలకు, సంస్థలకు ఇష్టం లేదన్నారు. భారత్‌ బలమైన దేశంగా ఎదగడం కొందరికి కంటగింపుగా మారిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉంటే అవినీతికి పాల్పడడం, దోచుకోవడం సాధ్యం కాదని కొన్ని దుష్టశక్తులు భావిస్తున్నాయని పేర్కొన్నారు.2014 కంటే ముందు బ్రోకర్ల రాజ్యం నడిచిందని, ఢిల్లీ పవర్‌ కారిడార్లలో వారే అధికారం చెలాయించారని గుర్తుచేశారు. ఢిల్లీలోని హోటళ్లలో సంవత్సరాల తరబడి తిష్ట వేసి లాబీయింగ్‌ చేస్తూ ఉండేవారని తెలిపారు. 2014లో తాము అధికారంలోకి వచి్చన తర్వాత పవర్‌ కారిడార్లను శుద్ధి చేసే ప్రక్రియ చేపట్టామని వివరించారు. బ్రోకర్లకు, లాబీయిస్టులకు అక్కడ స్థానం లేకుండా చేశామని చెప్పారు. బీజేపీని అణగదొక్కడం సాధ్యం కాదన్న సంగతిని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తెలుసుకోవాలన్నారు. 

ఆదివారం రాత్రి హనుమకొండ చౌరస్తాలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. హాజరైన జనం
బీఆర్‌ఎస్‌తోనే రక్ష! : మాజీ సీఎం కేసీఆర్‌

సాక్షి, వరంగల్‌: ‘‘ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా బీజేపీకి 400 సీట్లు కాదు.. కనీసం 200 సీట్లు దాటేలా లేవు. మనకు ఇదే మంచి సమయం. తెలంగాణలో లోక్‌సభ సీట్లన్నీ గెలిస్తే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పేగులు తెగేదాకా కొట్లాడుతాం. కేంద్రంలో హంగ్‌ వస్తే కీలకపాత్ర పోషించే అవకాశం ఈ రోజు తెలంగాణకు ఉంది..’’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మన గోదావరి నీళ్లను ఎత్తుకుపోతామన్న బీజేపీకి.. హామీలిచ్చి అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రయోజనం ఉండదన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ చేపట్టిన బస్సుయాత్ర ఆదివారం హనుమకొండకు చేరుకుంది. పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి హనుమకొండ చౌరస్తా వరకు కేసీఆర్‌ రోడ్డు షో నిర్వహించారు. కూడలి వద్ద ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘గోదావరి నదిని తీసుకొని పోతా అంటూ ఓట్లు పడే టైంలో నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్‌ పంపించాడు. ప్రాణం పోయినా ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ పెట్టాలి. నేనున్నప్పుడు అదే పంచాయతీ పెట్టిన. ఆయనేమో ఎత్తుకుపోతా అంటరు. ఈ చేతకాని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నోరు మూసుకొని పడి ఉంది. అందులో ఏం మతలబు దాగి ఉంది. ఎవరూ కాపాడాలి? దయచేసి మన గోదావరిని, కృష్ణాను కాపాడుకోవాలన్నా.. తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా.. మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా.. నిరుద్యోగ సమస్య తీరాలన్నా.. మన బతుకులు బాగు పడాలన్నా.. కచ్చితంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలవాలి. అదే తెలంగాణకు క్షేమం. దయచేసి ఆలోచన చేయాలి. లంచాల కోసమే కాంగ్రెస్‌ పర్మిషన్లు ఆపింది తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రమంతా భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పెరిగింది. కానీ ఇప్పుడు డౌన్‌ అయింది. దాని మీద బతికే వేల మంది రోడ్ల మీద పడ్డారు. రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు పెద్ద పట్టణాల్లో ఐదు నెలలుగా బిల్డింగ్‌ పర్మిషన్లు ఇస్తలేరు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో టీఎస్‌ బీపాస్‌ తెచ్చి.. అప్లికేషన్‌ పెడితే 21 రోజుల్లో ఆటోమేటిగ్గా పర్మిషన్లు ఇచ్చేయాలని చట్టం చేసినం. ఇప్పుడున్న సీఎం, వారి మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా. ఎవరైనా బిల్డింగ్‌లు కడితే చదరపు మీటర్‌కు ఇంత అని కాంగ్రెస్‌కు లంచం ఇవ్వాలట. దానికోసం మొత్తం రాష్ట్ర ప్రగతిని, అభివృద్ధిని ఆపేశారు. అంతేకాదు పూర్తయిన భవనాలకు కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదు. ఈ బండారమంతా బయటపెడతాం. త్వరలోనే దీనిపై పార్టీ కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు. భూగోళం తెలియదు. మొన్న ఎక్కడనో మాట్లాడుతూ కృష్ణానది కూడా నేనే కట్టిన అంటడు. ప్రపంచంలో ఎవరైనా నది కడతారా? ‘ఏరి కోరి మొగుడిని తెచ్చుకుంటే ఎగిరి ఎగిరి తన్నిండంట’ అన్నట్టు ఉన్నది. అడ్డగోలు హామీలు చూసి ఓట్లేస్తే.. నాలుగైదు నెలల్లోనే ఆగమాగం చేసేశారు. తెలంగాణకు ఏమైందో అర్థం కావడం లేదు. కరెంట్‌ ఎక్కడికి పోయింది? సాగునీళ్లు ఏవి? పంటలు ఎందుకు ఎండుతున్నాయి? మంచి నీళ్ల కరువు ఎందుకు వస్తోంది? కాంగ్రెస్‌ సర్కారు ఒక్క హామీ కూడా సరిగా అమలు చేయలేదు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నారు. ఏమైంది? రైతుబంధు అందరికీ రాలేదు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. డిసెంబర్‌ 9 నాడే రూ.2 లక్షల రుణమాఫీ అన్నారు. ఏదీ కాలేదు.అచ్ఛేదిన్‌ కాదు.. సచ్చేదిన్‌..బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ. దానికి ఎంతసేపూ పంచాయతీలు పెట్టించడం, విద్వేషం నింపడమే. ఆ పార్టీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవు. దయచేసి యువతను కోరుతున్నా.. ఆవేశం కాదు.. ఆలోచన చేయాలి. ఈ దేశం మీది. ఈ రాష్ట్రం మీది. రేపటి భవిష్యత్‌ మీది. ప్రధాని మోదీ భేటీ బచావో, భేటీ పడావో, జన్‌ ధన్‌ యోజన వంద నినాదాలు చెప్పారు. విదేశాల నుంచి నల్లధనమంతా తెచ్చి ఇంటికి రూ.15 లక్షల చొప్పున ఇస్తానన్నారు. ఎవరికైనా కనీసం ఐదు రూపాయలన్నా వచ్చాయా? అచ్ఛే దిన్‌ అచ్ఛే దిన్‌ అన్నారు.. అది రాలేదు కానీ సచ్చేదిన్‌ వచ్చింది. ధరలు విపరీతంగా పెరిగాయి. రూపాయి విలువ పడిపోయింది. కేంద్రంలో 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క ఖాళీ కూడా నింపలేదు. విభజన చట్టంలో కాజీపేటకు కోచ్‌ ఫ్యాక్టరీ ఇస్తామని ఉంటే.. మోదీ దానిని గుజరాత్‌కు ఎత్తుకెళ్లారు. అలాంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలి?’’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు. 

CM Revanth Reddy Comments On BJP PM Narendra Modi
రిజర్వేషన్లపై జవాబివ్వాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ఎల్‌బీనగర్‌/అల్వాల్‌ (హైదరాబాద్‌):  ‘కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలి. ఈ నెల 30న రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ.. ముందుగా రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో సమాధానం చెప్పాలి. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో, బయ్యారం ఉక్కు పరిశ్రను, ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేయలేదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆ తర్వాతే రాష్ట్ర పర్యటనకు రావాలి. పది సంవత్సరాలు ప్రధాన మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి..’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గం తనకు రాజకీయంగా తోడ్పాటును అందించిందని, ఈ నియోజకవర్గ అభివృద్ధికి తాను బాధ్యత వహిస్తానని ఆయన హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌కు 30 వేల మెజార్టీ ఇచ్చి పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని వనస్థలిపురం సుష్మా చౌరస్తా నుంచి రైతు బజారు చౌరస్తా వరకు సీఎం రోడ్డు షో నిర్వహించారు. రాత్రి అల్వాల్‌ సమీపంలోని కౌకూర్‌లో జరిగిన రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ రెండుచోట్లా జరిగిన కార్నర్‌ మీటింగుల్లో ఆయన మాట్లాడారు. బీజేపీని బహిష్కరించాలి ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించిన బీజేపీని బహిష్కరించాలి. రోడ్లపై దేవుళ్ల బొమ్మలు పెట్టుకుని కొందరు పొట్టకూటి కోసం అడుక్కుంటుంటున్నారు. బీజేపీ నేతలు మాత్రం దేవుళ్ల పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటున్నారు. బీజేపీ పుట్టక ముందునుంచే, తాతముత్తాల కాలం నాటి నుంచే శ్రీరామ నవమిలు, హనుమాన్‌ జయంతిలు జరుపుకున్నాం. బతుకమ్మలు ఆడాం. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మలకు కల్లు సాక పోశాం. కోళ్లను కోసి భక్తిని చాటుకున్నం..’అని రేవంత్‌ చెప్పారు. బీజేపీ నేతలు ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నారా? ‘ఎల్‌బీనగర్‌లో ఎప్పుడు వర్షం వచ్చినా మనుషులు కొట్టుకుపోవడం, వాహనాలు మూసీలో కొట్టుకుపోవడం చూస్తుంటాం. ఈ సమస్యలు పరిష్కరించాలంటే సునీతా మహేందర్‌రెడ్డిని గెలిపించాలి. నాగోల్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు, ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రో ఏర్పాటు చేస్తాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 11 డివిజన్లలో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు ఎప్పుడైనా సమస్యల పరిష్కారానికి వచ్చారా? ఇప్పుడు పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేశాడా? గతంలో వర్షాలు వచ్చినప్పుడు మూíసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. బండి పోతే బండి, లారీ పోతే లారీ ఇప్పిస్తానని చెప్పారు. అయన నుంచి బండి రాలే గుండు రాలేదు. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్ర అబివృద్ధికి నయా పైసా తేలేదు..’అని సీఎం విమర్శించారు.  కారు పార్టులు జుమ్మెరాత్‌ బజార్‌లో అమ్మేశారు ‘కేసీఆర్‌ పదేళ్లు సీఎంగా ఉండి సచివాలయానికి రాకుండా, ఫాం హౌస్‌లో ఉంటూ ప్రజలను కలవనందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు. ఇప్పుడు బస్సు యాత్ర పేరుతో తిరుగుతున్నారు. ఓట్ల కోసం కొంగ జపం చేస్తున్నారు. కారు పని అయిపోవడంతో కారు దిగి, బసు ఎక్కి మరోసారి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. కారు పని అయి పోయి షెడ్డుకు పోయింది. అక్కడ పార్టులు పార్టులుగా విడదీసి జుమ్మెరాత్‌ బజారులో అమ్మేశారు. పదేళ్లు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేని పరిస్థితిలో కేసీఆర్‌ ఉన్నారు. కారుకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే. బీఆర్‌ఎస్, బీజేపీ రెండూ కలిసి కాంగ్రెస్‌ను ఓడించాలని చూస్తున్నాయి. ఇందుకు నిదర్శనం బీజేపీ అభ్యర్థి ఈటల గెలుస్తాడని మాజీ మంత్రి మల్లారెడ్డి బహిరంగంగా అనడమే..’అని రేవంత్‌ అన్నారు. మల్కాజిగిరిలో మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్యేగా గెలుపొందితే మంత్రి అయ్యేవారని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని, బీసీ జనాభాను లెక్కిస్తున్నామని, ఎల్‌బీనగలో మూసి ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. 118 జీఓ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రోడ్ల అబివృద్ధి సంస్థ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Pension money Deposit into bank account for May 2024
మే నెల పింఛన్‌ బ్యాంకు ఖాతాలో జమ

సాక్షి, అమరావతి: మే, జూన్‌ నెలల పింఛన్‌ డబ్బును ఈసారి లబ్ధిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (ఏఈపీఎస్‌) విధానంలో లబ్ధిదారుల ఆధార్‌ నంబరు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛను డబ్బు జమ చేస్తుంది. అయితే, విభిన్న దివ్యాంగ లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్‌చైర్‌కు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రం గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛను డబ్బు ఇస్తారు. ఈ రెండు నెలల్లోనూ ఒకటో తేదీ నుంచే పింఛను డబ్బు పంపిణీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఆదివారం ఆదేశాలు చేశారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మే ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి నిధులు విడుదల చేస్తుంది. అందులో 48,92,503 మంది (74.70 శాతం) లబ్ధిదారుల పింఛన్‌ డబ్బులు ఆధార్‌ నంబర్‌తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. లబ్ధిదారులకు ఒకటో తేదీనే డీబీటీ విధానంలో డబ్బులు జమ చేయగానే, ఆ సమాచారం బ్యాంకు నుంచి ఎస్‌ఎంఎస్‌ రూపంలో అందుతుంది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్‌చైర్‌కు పరిమితమైన వారు దాదాపు 16,57,361 మంది (25.30 శాతం)కి మే ఒకటి నుంచి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ జరుగుతుంది. పింఛన్‌ లబ్ధిదారులలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వారికి డబ్బు అందేలా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఎవరికి పింఛను డబ్బులు బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు, ఎవరికి ఇంటి వద్దే పంపిణీ చేస్తారన్న వివరాలతో కూడిన జాబితాలను  సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం గ్రామ, వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డులో కూడా ఉంచనున్నట్టు అధికారులు చెబుతున్నారు.  

Chandrababu Controversial comments On CM YS Jagan
జగన్‌.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది?: చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను ఎదుర్కొనే సామర్థ్యం, ధైర్యంలేక కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబుకు కళ్ల ముందే ఓటమి స్పష్టంగా కనిపించడంతో చేసేదిలేక తీవ్ర నిరాశ, నిస్పృహలతో బహిరంగ సభల్లో ఇష్టమొచ్చి­నట్లు నోరు పారేసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్త­మవుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజక­వర్గం బుచ్చిరెడ్డిపాళెం సభలో.. ‘జగన్‌మోహన్‌రెడ్డి.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది’.. అంటూ ఆయన బరితెగించి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలను ఆయన ఎటువైపు తీసుకెళ్తు­న్నారనే ఆందోళన సాధారణ ప్రజలు, మేథావులు, తటస్థులు వ్యక్తంచేస్తున్నారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయన్ను భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు ఏదైనా కుతంత్రం పన్నుతున్నారే­మోనని అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవలే తాడికొండలో జరిగిన సభలో ‘ఆ దున్నపోతును మనిషికి ఒక రాయి తీసుకుని, ఏది దొరికితే అది తీసుకుని కొట్టండి’.. అంటూ సీఎంపై దాడికి పురి­కొల్పేలా మాట్లాడారు. ఆ తర్వాతే విజయవాడ సింగ్‌నగర్‌లో బస్సుయాత్ర చేస్తున్న జగన్‌పై హత్యా­యత్నం జరిగింది. ముఖ్యమంత్రిని దున్నపోతు అంటూ సంభోదించడం, రాయిపెట్టి కొట్టాలనడం ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని మేధావులు సైతం ప్రశ్నిస్తున్నారు. మరో సభలో.. గాజు గ్లాసు తీసుకుని పొడవమంటూ ఆయన సైగల ద్వారా చెప్పడం చూసి రాష్ట్ర ప్రజలు నివ్వె­ర­పోయారు. ఇప్పుడు ఏకంగా జగన్‌ను నేరుగా ఉద్దే­శిస్తూ నిన్ను చంపితే ఏమవుతుంది అని మాట్లాడ­డంతో చంద్రబాబు మనసులో దురుద్దేశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయన ఆ మాట అన్నా­రంటే జగన్‌పై ఎంత కసి, కక్ష ఉన్నాయో తెలుస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ముఖ్య­మంత్రిని చంపేయాలని ప్రతిపక్ష నేత మాట్లాడడం తగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విషయంలోనూ వైఎస్‌ జగన్‌ను దీటుగా ఎదుర్కో­లేని పరిస్థితుల్లో ఇలాంటి మాటలు మాట్లాడుతు­న్నట్లు స్పష్టమవుతోంది. సీఎంని పదేపదే వ్యక్తిగతంగా దూషించడం, దాడులకు ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేస్తుండడం, చివరికి ఇంకా దిగ­జారి చంపమని చెప్పడం బాబు మానసిక దౌర్భ­ల్యాన్ని సూచిస్తోందంటున్నారు. ఆయన ప్రతి సభ­లోనూ, ప్రతి సమావేశంలోనూ జగన్‌పై విద్వేషం వెళ్లగక్కు­తూనే ఉన్నారు. సీఎంను సైకో అంటూ దిగజా­రుడుగా సంభోదిస్తూ తన అక్కసు, కడుపుమంట చల్లార్చుకుంటున్నారు.బాబు తీరుతో టీడీపీ కేడర్‌లో ఆందోళన..అలాగే.. జగన్‌ తన పాలనలో మంచి జరిగిందను­కుంటేనే తనకు ఓటేయాలని కోరుతుంటే బాబు మాత్రం ‘చంపండి.. పొడవండి.. రాళ్లు విస­రండి.. గాలిలో వస్తాడు, గాలిలో పోతాడు’.. అంటూ మాట్లా­డడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక­పోతు­న్నారు. వైఎస్‌ జగన్‌ తన పాలనలో తాను చేసిన పనులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి చక్కగా చెబుతున్నారని, చంద్రబాబు వైఫల్యాలు ఆయన గతంలో విడుదల చేసిన మేనిఫెస్టోను చూపించి దాన్ని అమలుచేయలేదని చెబుతున్నారని వీటిపై మాట్లాడకుండా అదే పనిగా తిట్టడంవల్ల ఉపయోగం ఉండదని భావిస్తున్నారు. జగన్‌ తన మేనిఫెస్టోను, టీడీపీ మేనిఫెస్టోను పోల్చిచూపడం, అందులోని అంశాలను వివరించి చెప్పే విధానం ప్రజల్లోకి బాగా వెళ్తోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. తమ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను అమలుచేయలేదనే విష­యాన్ని చాలా సూటిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, దీనికి కౌంటర్‌ ఇచ్చే పరిస్థితి తమ పార్టీకి లేకుండాపోయిందనే వాపోతున్నారు.టీడీపీని రద్దు చేయాలి: ఎమ్మెల్యే ప్రసన్నబుచ్చిరెడ్డిపాళెంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కోవూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. చంద్రబాబు తన పాలనా దక్షత కన్నా.. కుట్రలు, కుతంత్రాలు, హత్యలను నమ్ము­కుని రాజకీయం చేస్తున్నారంటూ మండిప­డ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ సుమో­టోగా తీసుకుని చంద్రబాబుపై కేసు నమోదు చేసి, టీడీపీని రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు సుమోటోగా కేసు ఫైల్‌ చేయాలని కోరారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రాణాలకు హాని ఉందని చంద్రబాబు వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు.వేమిరెడ్డీ.. బాబు వ్యాఖ్యలను సమర్థిస్తున్నావా?బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమ­యంలో ఎంపీ, ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీచేస్తున్న వేమి­రెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి దంపతులు పక్కనే ఉన్నప్పటికీ వారు వారించకుండా మౌనంగా ఉండిపోవడంపై నెల్లూరు జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నైతిక విలువ­లుంటే ఇలా­ంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహి­స్తున్న బాబు పార్టీ నుంచి తప్పుకోవాలని, లేదంటే బహి­రంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తు­న్నా­రు.దారుణంగా పడిపోయిన చంద్రబాబు ఇమేజ్‌సీఎం జగన్‌ హుందాగా మాట్లాడుతుంటే.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇంత నీచస్థాయికి దిగజారి మాట్లాడుతుండడం సాధారణ ప్రజా­నీకంలోనూ చర్చనీయాంశమైంది. ఇప్ప­టికే ప్రజల్లో, జాతీయ స్థాయి రాజకీయ పక్షాల దృష్టిలో నమ్మదగని నేతగా ముద్ర­పడిన చంద్రబాబు ఇమేజ్‌ దారుణంగా పడి­పోయింది. ప్రజలే కాదు.. ఏ రాజకీయ పక్షం ఆయన్ను నమ్మే పరిస్థితిలేదు. ప్రస్తుతం ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నా ఆయన్ను బీజేపీ పెద్దలు నమ్మ­డంలేదని టీడీపీ నేతలు వాపో­తున్నారు. చంద్రబాబు నిలకడలేని స్వభా­వం, అవకాశ­వాద వైఖరి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం ద్వారా తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఈ వైఖరే ఆయన్ను ప్రజల్లో మోసగాడిగా నిలబెట్టింది.ఓటమి భయంతోనే ఇలా..బాబు తన పాలన, తన విధానాల గురించి కాకుండా కేవలం ఎదురుదాడి చేయడం, దూషించడంవల్ల ఉపయోగం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఆయన ప్రసంగాలు ప్రజలకు నమ్మకాన్ని కలిగించేలా ఉండడంలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హద్దులు దాటిపోయి చేస్తున్న ఆరోపణలు, దూషణలు చంద్రబాబులో ఉన్న అసహనం, భయాన్ని చూపుతున్నాయని, ఓటమి భయంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని తట­స్థులు సైతం చెబుతున్నారు. తాను చేసిందేమీ­లేక చెప్పుకోలేకపోవడం, ఏం చేస్తానో చెప్పలేక­పోవడం, ఆయన చెప్పే ఇతర విషయాలను జనం పట్టించుకోకపోవడంతో జీవిత చరమాంకంలో ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నట్లు చెబు­­తున్నారు. అదే సమయంలో ఆయన విద్వే­ష­పూరిత ప్రసంగాలవల్ల రాష్ట్రంలో శాంతిభద్ర­తల సమస్య నెలకొనే పరిస్థితి ఏర్పడుతోంది. 

CM YS Jagan Comments On Chandrababu In Election Campaign
ఓటుతో మోసగాళ్లకు వేటు: సీఎం వైఎస్‌ జగన్‌

డబ్బులు మీ అకౌంట్లోకి, మీ చేతికే పంపితే అది జగన్‌ పాలన! అదే డబ్బులు తన అకౌంట్లోకి, తన జేబులోకి, తన పెత్తందారీ స్నేహితుల జేబుల్లోకి వేసుకుంటే అది బాబు పాలన! చంద్రబాబుకు ఓటు వేస్తే ప్యాకేజీ స్టార్‌కు, రామోజీరావుకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, టీవీ 5 నాయుడికి, వదినమ్మకి మనీ ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. బాబుది ఈనాడు, ఈటీవీ,  ఆంధ్రజ్యోతి, టీవీ 5లో మాత్రమే కనిపించే గ్రాఫిక్స్, మోసాల పాలన.     రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్లు.. ఇంటింటి అభివృద్ధిని చెడగొట్టిన వాళ్లు.. అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా, కుట్రలు, వెన్నుపోట్లు నైజంగా, గుంపులు గుంపులుగా జెండాలు జత కట్టి వస్తున్నారు. ఈ పేదల వ్యతిరేకులు, మోసగాళ్లకు ఓటుతో పోలింగ్‌ బూత్‌లో బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా?– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  సాక్షి ప్రతినిధి, అనంతపురం/సాక్షి, తిరుపతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరుకుట్రలు, వెన్నుపోట్లతో కూటమి కట్టి, జెండాలు జతకట్టి వస్తున్న మోసగాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘58 నెలల కాలంలో నేను ఏం చేశానో చెబుతా. నీ 14 ఏళ్ల పాలనలో ఏం మంచి చేశావో చెప్పగలవా చంద్రబాబూ? నీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథకమైనా ఉందా? జగన్‌ తెచ్చిన స్కీమ్‌లను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తానని చెప్పగలవా? నేను తెచ్చిన పథకాల గురించి మాట్లాడతావ్‌ ఏమిటయ్యా బాబూ? నేను రూపాయి ఇస్తే.. నువ్వు రెండు రూపాయలు ఇస్తానంటావ్‌ ఏంటయ్యా చంద్రబాబూ?’ అంటూ ధ్వజమెత్తారు. ఒక్కటంటే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకురాని ఆ మనిషిని నమ్మగలమా? అని సూటిగా ప్రశ్నించారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆదివారం ఉదయం అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన తొలి ఎన్నికల సభతో మలి విడత ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. మిట్ట మధ్యాహ్నం వేళ తిరుపతి జిల్లా వెంకటగిరిలో, సాయంత్రం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో పోటెత్తిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్‌ ప్రసంగించారు. ఆయా సభల్లో ఆయన ఏమన్నారంటే...బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపినట్లే!మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. ఇవి వచ్చే ఐదేళ్ల పాటు మన ఇంటింటి అభివృద్ధి, పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ యథాతథంగా కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికి ముగింపు, మళ్లీ మోసపోవటమే. ఇది చంద్ర బాబు గురించి చరిత్ర చెప్పిన సత్యం. చంద్రబాబు సాధ్యం కాని హామీలతో మీ ముందుకు వస్తున్నాడు.  బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. వదల బొమ్మాళీ.. వదలా.. అంటూ ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఆహ్వానించడమే.మీ బిడ్డ 130 సార్లు బటన్‌ నొక్కాడునాకు వీరిలా జెండాల పొత్తులు లేవు. నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతోనే. నా నమ్మకం ఆ దేవుడి దయపైనే. మేనిఫెస్టో హామీలను నూటికి 99 శాతం అమలు చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి మీ దీవెనలు, ఆశీస్సులు కోరుతున్నాడు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఏకంగా 130సార్లు మీ బిడ్డ బటన్‌ నొక్కాడు. రూ.2.70 లక్షల కోట్లు డీబీటీతో అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పారదర్శకంగా జమ చేశాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ఇంటింటికీ అందాయి. సచివాలయాల్లో నా తమ్ముళ్లు, చెల్లెళ్లుదశాబ్దాలుగా మన దగ్గర గవర్నమెంట్‌ ఉద్యోగాలు 4 లక్షలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో ఇచ్చింది ఏకంగా 2.31 లక్షల ఉద్యోగాలు. నా తమ్ముళ్లు, చెల్లెళ్లంతా ఈరోజు గ్రామ సచివాలయాల్లో కనిపిస్తున్నారు. మెరుగు­పడిన ఆస్పత్రులు,  బడుల్లో సేవలందిస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ నేను ‘‘నా..’’ అని ఆప్యాయంగా పిలిచే సామాజికవర్గాలకు ఇందులో ఏకంగా 80 శాతం ఉద్యోగాలు దక్కాయి.పౌర సేవలు.. విప్లవాత్మక వ్యవస్థలు ప్రజలకు అందించే సేవల డెలివరీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ఎప్పుడూ జరగని విధంగా పౌర సేవలు, పథకాలను నేరుగా ఇంటికే డోర్‌ డెలివరీ చేశాం. నాడు – నేడుతో బాగుపడ్డ బడులు, ఇంగ్లీషు మీడియం చదువులు కనిపిస్తున్నాయి. మన గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌లు కనిపిస్తున్నాయి. ఇంటింటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఇంటికీ వస్తోంది. గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్‌ కనిపిస్తున్నాడు. మన గ్రామంలోనే మహిళా పోలీసు కనిపిస్తోంది. రైతన్నచేయి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రం కనిపిస్తోంది. నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీలు కనిపిస్తున్నాయి. గ్రామానికే వచ్చిన ఫైబర్‌ గ్రిడ్‌ కనిపిస్తోంది. ఇలాంటి వ్యవస్థలన్నీ మీ బిడ్డ  58 నెలల కాలంలోనే తెచ్చి మరోసారి మీ ఆశీస్సులు కోరుతున్నాడు.పేదల ఆత్మగౌరవం కాపాడుతూ..పేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటికే రూ.3 వేలు పింఛన్, రేషన్‌ అందజేస్తున్నాం. ఈరోజు ఇంటి వద్దకే క్యాస్ట్‌ సర్టిఫికెట్, బర్త్‌ సర్టిఫికెట్‌ వస్తోంది. ఏది కావాలన్నా గడప వద్దకే వస్తున్న పరిస్థితులు మీరే చూస్తున్నారు. ఈ విప్లవాత్మక మార్పులను ఎవరైనా ఊహించారా? గవర్నమెంట్‌ డబ్బులు లంచాలు, వివక్ష లేకుండా అందుతాయని గతంలో ఎవరైనా చెబితే నమ్మేవారా? మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని చేసి చూపించాం.విద్యా విప్లవం..పేదింటి పిల్లల చదువుకునే ప్రభుత్వ బడుల్లో చదువులు, ఆహారం అత్యుత్తమంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. పిల్లలు ధరించే యూనిఫాం మొదలు పుస్తకాల దాకా అన్నీ సమకూరుస్తున్నాం. క్లాస్‌ రూముల్లో డిజిటల్‌ బోధన, ఐఎఫ్‌పీ ప్యానెల్స్, ట్యాబ్‌లు, మారిన కరిక్యులమ్‌తో విద్యా విప్లవాన్ని తెచ్చాం. ఇదే పాలన మరో పదేళ్లు కొనసాగితే ఇప్పుడు ఒకటో తరగతిలో ఉన్న మీ పిల్లలు 2035 నాటికి టెన్త్‌ పరీక్ష ఐబీలో పూర్తి చేసి ఐబీ సర్టిఫికెట్‌తో అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఎప్పుడూ చూడని విధంగా హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, ఎంఐటీ లాంటి ప్రఖ్యాత వర్సిటీలు అందించే ఆన్‌లైన్‌ కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానమవుతున్నాయి. మహిళా సాధికారతకు దన్నుగా‘అమ్మ ఒడి’ అనే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా విన్నారా? ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పూర్తి ఫీజులు చెల్లిస్తూ విద్యాదీవెన, ఖర్చుల కోసం వసతి దీవెన, పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు లాంటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా? దిశ యాప్, అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేయడం లాంటివి గతంలో విన్నారా?రైతన్నకు అండగా..రైతన్నకు పెట్టుబడి సాయంగా పంట వేసే సమయంలో రైతు భరోసా అందించడం గతంలో ఎప్పుడైనా చూశారా?. గ్రామాల్లోనే ఆర్బీకేలు, సున్నా వడ్డీకే పంట రుణాలు, 9 గంటలు పగటిపూటే ఉచిత విద్యుత్, ఇన్‌ పుట్‌ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, దళారీలు లేకుండా పంటల కొనుగోలు, ఎంఎస్పీ లేని పంటలు సైతం కొనుగోలు లాంటివన్నీ చేసి ఈరోజు మీ బిడ్డ ప్రతి రైతన్ననూ మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నాడు.100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకేమొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి మీ బిడ్డ అర్థం చెప్పాడు. చేతల్లో  చూపించాడు. నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు డీబీటీ, నాన్‌ డీబీటీలో ఏకంగా 75 శాతం పైచిలుకు లబ్ధి చేకూరింది. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేశాం. 68 శాతం మంత్రి పదవులు ఆ వర్గాలకే ఇవ్వడం ఓ చరిత్ర.  175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు కలిపి మొత్తం 200 స్థానాలకు గానూ ఏకంగా 50 శాతం అంటే 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే   కేటాయించిన చరిత్ర గతంలో ఏ రాజకీయ పార్టీకైనా ఉందా? వలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుండాలన్నా, వ్యవసాయం, ఆస్పత్రులు మెరుగ్గా ఉండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుపై రెండు బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గకుండా గెలిపించాలి. మంచి చేసిన ఫ్యాను మీ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లో ఉండాలి.జన్మభూమి కమిటీలు మళ్లీ తెస్తానని చెప్పగలవా?చంద్రబాబు జన్మభూమి కమిటీలను తీసుకొస్తే మీ జగన్‌ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను తెచ్చాడు. నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ వాటిని తీసుకొస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు? ఆ విషయం చెప్పే ధైర్యం లేక నేను తెచ్చిన వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థలను కొనసాగిస్తానంటావేమిటి? నువ్వు వస్తే వలంటీర్లకు జీతం పెంచుతానంటావేమిటి? జగన్‌ స్కీమ్‌లను రద్దు చేస్తాననే ధైర్యముందా?అయ్యా చంద్రబాబూ.. నువ్వు 14 ఏళ్లు పరిపాలించావ్‌! నేను 58 నెలలే పరిపాలన చేశా. జగన్‌ అమ్మఒడి తీసుకొస్తే నువ్వు అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నావు. జగన్‌ చేయూత ప్రవేశపెడితే నువ్వు ఇంకా ఎక్కువమందికి ఇస్తానంటున్నావు. జగన్‌ రూపాయి ఇస్తే నువ్వు రెండు రూపాయలు  ఇస్తానంటావ్‌! జగన్‌ తెచ్చిన స్కీమ్‌లను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబూ? జగన్‌ తెచ్చిన వలంటీర్, సచివాలయాల వ్యవస్థలను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? జగన్‌ తెచ్చిన రైతుభరోసా కేంద్రాలను తీసేస్తానని చెప్పే ధైర్యం ఉందా? రైతు భరోసా సొమ్ము రద్దు చేసే ధైర్యం బాబుకు ఉందా?మోసాల బాబు విఫల హామీలు⇒ 2014లో ఇదే చంద్రబాబు తాను సంతకం చేసి ప్రధాని మోదీ, దత్తపుత్రుడి ఫొటోలతో ముఖ్యమైన హామీలంటూ ప్రతి ఇంటికీ పంపిన పాంప్లెట్‌ గుర్తుందా? ఎల్లో మీడియాలో ప్రకటనలతో ఊదరగొట్టారు. మంగళ సూత్రం తెంపుతున్న చేతిని అడ్డుకుంటూ మరో చెయ్యి వస్తుంది. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం మీ ఇంటికి రావాలంటే బాబు రావాలన్న అడ్వర్‌టైజ్‌మెంట్లు గుర్తున్నాయా? ⇒ రైతులకు రూ.87,612 కోట్ల రుణాలను మాఫీ చేశాడా? ⇒ రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? ⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్‌ చేశాడా? ⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో రూ.1.20 లక్షల నిరుద్యోగ భృతి ఎవరికైనా ఇచ్చాడా?⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. కనీసం ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా? ⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత, పవర్‌ లూమ్స్‌ రుణాలన్నీ మాఫీ అన్నాడు. మరి అయ్యాయా? ⇒ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాడా? ⇒ సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు. తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో ఎక్కడైనా కనిపిస్తోందా? ⇒ పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా? ⇒ అవే మూడు పార్టీలు మరోసారి కూటమిగా ఏర్పడి సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్‌ కార్లు అంటూ మరోసారి మోసాలకు తయారయ్యాయి.మన అభ్యర్థులను దీవించండిఅనంతపురం ఎంపీ అభ్యర్థి శంకరణారాయణ, తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి ఎం. గురుమూర్తి, వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వై.విజయసాయిరెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్‌ను మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా.మనం చేసిన మంచిలో మచ్చుకు కొన్ని..⇒ ఇంటి వద్దకే రూ.3 వేల పెన్షన్‌ అనగానే గుర్తుకొచ్చేది మీ జగన్‌. పూర్తి ఫీజులు చెల్లిస్తూ విద్యాదీవెన, ఖర్చులకు ఇబ్బంది పడకుండా వసతి దీవెన అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. అమ్మఒడి అంటే మీ జగన్‌. అక్క చెల్లెమ్మలకు తోడుగా చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, సున్నా వడ్డీ, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు, మహిళా సాధికారత, రైతు భరోసా, ఆర్బీకేలు, విస్తరించిన ఆరోగ్యశ్రీ, జీవనభృతికి ఇబ్బంది లేకుండా విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా, పేదవాడికి మందులు, టెస్టులు అందిస్తూ ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్‌ క్లినిక్స్‌ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌.⇒ స్వయం ఉపాధికి ఊతమిస్తూ మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, వాహనమిత్ర, చేదోడు, తోడు, లా నేస్తం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. ప్రతి గ్రామంలో సచివాలయం, ప్రతి 60–70 ఇళ్లకు ఒక వలంటీర్, ఇంటికే పౌరసేవలు, పథకాలు చూస్తే గుర్తుకొచ్చేది మీ జగన్‌. నాడు–నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్‌ మీడియం బడులు, గవర్నమెంట్‌ హాస్పిటళ్లు చూస్తే గుర్తుకువచ్చేది మీ జగన్‌. గ్రామంలోనే మహిళా పోలీస్, ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్‌లో దిశ యాప్‌ చూస్తే గుర్తుకొచ్చేది మీ జగన్‌.తాడిపత్రిలో అగ్రికల్చర్‌ కాలేజీఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి అన్న, ఎంపీ అభ్యర్థి శంకరన్నపై మీ చల్లని దీవెనలు ఉంచాలని సవినయంగా కోరుతున్నా. కాసేపటి క్రితం పెద్దారెడ్డి అన్న తాడిపత్రి నియోజకవర్గంలో అగ్రికల్చర్‌ కాలేజీ గురించి  ప్రస్తావించాడు. తాడిపత్రిలో అగ్రికల్చర్‌ కాలేజీని మళ్లీ మన ప్రభుత్వం రాగానే కచ్చితంగా ఏర్పాటు చేస్తామని మాట ఇస్తున్నా. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మరికొన్ని కూడా ప్రస్తావించారు. అవన్నీ పెద్దారెడ్డి అన్నతో దగ్గరుండి మీకు మంచి చేస్తామని హామీ ఇస్తున్నా.ఇవన్నీ కొనసాగాలంటే మన పార్టీకి ఓటేయండి...నేను చంద్రబాబు మాదిరిగా సెల్‌ఫోన్‌ కనిపెట్టానంటూ బడాయిలు చెప్పడం లేదు. ఈ 58 నెలల పాలన ప్రోగ్రెస్‌ రిపోర్టు మీ ముందు ఉంచి మీరే మార్కులు వేయాలని మీ బిడ్డ అడుగుతున్నాడు. మీ జగన్‌కు మీరు అధికారం ఇవ్వడం వల్లే ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో కనీసం ఆరేడు విప్లవాత్మక కొత్త వ్యవస్థలు ఏర్పాటు చేయగలిగాడు. ఈ వ్యవస్థలన్నీ మీవద్ద ఉన్నాయో లేదో మీరే ఆలోచన చేయండి. అవన్నీ ఇలాగే  కొనసాగాలంటే, మన పాలన బాగుందనుకుంటే మన పార్టీకి ఓటు వేయండని మీ బిడ్డ అడుగుతున్నాడు. అమ్మఒడి లాంటి పథకాల ద్వారా పిల్లల్ని ఇలాగే చక్కగా చదివించాలనుకుంటే మళ్లీ మీ అన్నకు అధికారం ఇవ్వండి. పిల్లలు ఇలాగే ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటూ ఈ మార్పులు కొనసాగాలంటే మీ బిడ్డకే, ఫ్యాన్‌కు ఓటు వేయాలి. నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు పథకాలు సజావుగా కొనసాగాలంటే ఫ్యాన్‌ గుర్తుపై రెండు బటన్లు నొక్కి మీ బిడ్డకు తోడుగా ఉండాలి. చంద్రబాబు మార్కు దోపిడీ, జన్మభూమి కమిటీల రాజ్యం మళ్లీ రాకూడదంటే ఫ్యాన్‌ గుర్తుపై రెండు ఓట్లు వేసి మరోసారి ఆశీర్వదించాలి.మీ బిడ్డ ఎలా చేయగలిగాడు? నాడూ నేడూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌. అప్పులు కూడా అప్పటి కంటే ఇప్పుడే గ్రోత్‌ రేటు తక్కువ. మరి మీ బిడ్డ ఎలా బటన్లు నొక్కగలిగాడు? కనీ వినీ ఎరుగని స్కీములు ఎలా ఇవ్వగలిగాడు? అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఎలా పంపించగలిగాడు? అనేది ఆలోచన చేయమని కోరుతున్నా. ఈ డబ్బంతా చంద్రబాబు పాలనలో ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ఆలోచన చేయండి. మన రాష్టానికి వచ్చిన పొత్తుల నాయకులను చూస్తుంటే సుమతీ శతకం ‘‘తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతీ’’ గుర్తుకొస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో తిరుగుతున్న చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ, ఈనాడు రామోజీ, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ 5 నాయుడు వీళ్లలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా నివాసం ఉంటున్నారా? ఎన్నికలు వచ్చాయి కాబట్టే వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఓడిన వెంటనే వీళ్లంతా మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లిపోతారు. ఇదీ వాళ్లకు మన రాష్ట్రంతో ఉన్న అనుబంధం. ఈ నాన్‌ లోకల్‌ కిట్టీ  పార్టీలకు, వాటి సభ్యులకు, నయా ఈస్ట్‌ ఇండియా కంపెనీ సభ్యులకు మన రాష్ట్రం, మన ప్రజలంటే కేవలం దోచుకునేందుకు.. దోచుకునేది పంచుకునే వనరుల లాంటివి. వీరిలో ఏ ఒక్కరికీ మన రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు. మేం చేసిన మంచి చూసి మాకు ఓట్లేయాలని అడిగే ధైర్యం లేదు. చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ అయితే, ఇంటింటికి చేసిన మంచిని సగర్వంగా చెబుతున్న పార్టీ మనది. ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటికీ చేసిన మంచి ఇదీ అని మీ బిడ్డ సగర్వంగా చెబుతున్నాడు. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే తోడుగా, సైనికులుగా నిలవాలని కోరుతున్నా. 

Bhuma Akhilapriya List of Irregularities: Andhra Pradesh
అక్రమాల ప్రియ

పేరేమో అందరికీ ‘ప్రియం’గా అనిపిస్తుంది.. వ్యవహార శైలి చూసినా, విన్నా అన్నీ అప్రియాలే...  టీడీపీ హయాంలో మంత్రిగా అవకాశం లభించేసరికి దోపిడీకి లైసెన్సు పొందినట్లయింది.ఈమె గారి పతి పేరులోనే దేవుడు...∗ లీలల్లో రావణుడే... ఈ సతీపతుల విచ్చలవిడి దోపిడీకినంద్యాల సమీపంలోని ఓ నియోజకవర్గం అడ్డాగా మారింది. నీరు–చెట్టు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు, తాగునీటి పేరిట వీరి అక్రమాలు లెక్కలేనన్ని ఉన్నాయి.  వీరి దోపిడీని లెక్కగడితే రూ.వంద కోట్లు దాటి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ దంపతుల కంటికి నదురుగా ఎవరి స్థలమైనా కనిపించినా.. లేదా.. స్థల వివాదాల్లో న్యాయం చేయాలని ఎవరైనా వీరి వద్దకు వచ్చినా.. పిట్టపోరు.. పిట్టపోరు.. పిల్లి తీర్చిందన్న చందంగా ఆ స్థలాలను కాజేసే దాకా వీరు నిద్రపోరు. ∗మాయ మాటలతో రైతులను వంచించడంలో ఈ దంపతులను మించిన వారు లేరని వీరిఅఘాయిత్యాలే చెబుతాయి..∗ఎవరైనా వీరి అన్యాయాలనుప్రశ్నించారో వారిపై విరుచుకుపడతారు. డబ్బుల కోసం ఏమైనా చేయడానికి వెనుకాడరనివీరి చరిత్ర చెబుతోంది. జైలుకెళ్లి వచ్చినా పద్ధతి మార్చుకోకపోవడం వీరికే చెల్లింది. సతి ఆదేశం.. పతి దౌర్జన్యం.. చింతకుంట గ్రామానికి చెందిన గూడా నరసింహుడు భార్య వెంకట లక్షమ్మకు ఆళ్లగడ్డ పట్టణ శివారులో 25 సెంట్ల స్థలముంది.  ఆ స్థలాన్ని మహమ్మద్‌హుసేన్, నూర్‌ అహమ్మద్‌ల నుంచి 1995 మార్చి 27న కొనుగోలు చేసి రిజి్రస్టేషన్‌ చేయించుకున్నారు. రూ.2 కోట్ల విలువ చేసే ఈ స్థలం ఖాళీగా ఉండటాన్ని గమనించిన ఈ దంపతులు ఓ సర్వేయర్, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది ద్వారా 1952లో అల్లిసా పేరిట రిజి్రస్టేషన్‌ డాక్యుమెంట్‌ను బయటకు తీశారు. అవుకు మండలం సంగపట్నంలో నివసించే వారి మనవడు నూర్‌బాషాకు నచ్చజెప్పి మూడు భాగాలుగా చేసి 2022 డిసెంబర్‌1న అనుచరుల పేరున రిజిస్ట్రేషన్‌ చేయించేశారు. ఇప్పుడు ‘గూడా’ దంపతులు లబోదిబోమంటున్నారు.  ఈ అరాచక దంపతుల దౌర్జన్యంలో ఇది  మరో కోణం. సాక్షి, టాస్‌్కఫోర్స్‌: గత ప్రభుత్వంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన యువ మహిళా మంత్రి అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. అక్రమాలను అవలీలగా చేసేశారు. ఇప్పుడామె అధికారంలో లేకున్నా... కబ్జాలకు కొదవలేదు. ఎదిరించేవారిపై దౌర్జన్యాలకూ వెనుకాడటం లేదు. ఆమెతోపాటు ఆమె రెండో భర్త చేసిన అరాచకాలు అన్నీఇన్నీకావు.  టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ పనిచేసినా వారికి వాటాలు ముట్టజెప్పాల్సి వచ్చేది.కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ నియామకాల్లోనూ ఈ సతీపతుల వసూళ్ల దందా సాగింది. అభివృద్ధి పనుల్లోనూ ఆ దంపతులు రూ.కోట్లలో పర్సంటేజీలు మూటగట్టుకున్నారు. చివరకు పారిశుద్ధ్య కార్మికుల నియామకంలోనూ వసూళ్లు కొనసాగించారు. వివిధ పనుల్లో టెండర్లతో పని లేకుండా రూ.200 కోట్ల వరకూ స్వాహా చేశారు. అధికారం కోల్పోయినా తమ దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.  అభివృద్ధి పేరుతో అక్రమాలు... ఆమె టీడీపీ హయాంలో నియోజకవర్గంలో వివిధ పనుల కోసం కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకుని వాటిని పక్కదారి పట్టించారు. అధికారులను బెదిరించి పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారు. నియోజకవర్గ పరిధిలో జరిగిన ప్రతి పనినీ తన అనుయాయులకే టెండర్‌తో ప్రమేయం లేకుండా కట్టబెట్టించి వారి వద్ద పర్సంటేజీలు నొక్కేశారు.  దౌర్జన్యాలకు నిదర్శనాలివిగో..  ∗ తాజాగా ఓ పంచాయితీ కోసం ఇంటికొచ్చిన ఓ ముస్లిం మైనార్టీ నాయకుడిని అందరూ చూస్తుండగానే మాజీ మంత్రి దంపతుల ఆదేశాల మేరకు అనుచరులు చితకబాది వారి వద్దనున్న రూ.1.30 కోట్లు దోచే యడం ఇప్పుడు సంచలనమైంది. ∗ జగత్‌ డెయిరీకి చెందిన అమాయక రైతుల పేర్లపై బ్యాంకు రుణాలు తీసుకుని మంత్రి తిరిగి చెల్లించకపోవడంతో ఆ రైతులు డిఫాల్టర్లుగా మారి పంట రుణాలూ పొందలేక అల్లాడిపోయారు.  ∗ మంత్రిగా ఉన్నప్పుడు కమీషన్లకు ఆశపడి మున్సిపల్‌ శానిటరీ, స్వీపర్‌ పోస్టులతోపాటు టూరిజం శాఖలో విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో ఉద్యోగాలను అమ్ముకున్నారు.  ∗ నీరు చెట్టు పనుల్లో అడిగినంత కమీషన్‌ ఇవ్వలేదని భాచాపురం గ్రామ నాయకుడి చెక్‌బుక్‌ దొంగిలించి అతనిపై చెక్‌బౌన్స్‌ కేసు పెట్టి వేధించారు.  ∗ మాజీ మంత్రి ప్రస్తుత భర్త ద్వారా ఖాళీ స్థలాలపై కన్నేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. భూ కబ్జాలకు పాల్పడి బాధితులను చంపుతామని బెదిరించారు. వ్యాపారవర్గాలను భయభ్రాంతులకు గురి చేశారు.  ∗ అవసరమైనప్పుడు అప్పులిచ్చి ఆదుకున్న స్నేహితులు, శ్రేయోభిలాషులను మోసం చేశారు. రుణాలు ఎగ్గొట్టారు. వారిని ఇంట్లోకీ రానివ్వకుండా అవమానించారు.∗ తండ్రి ఇంటిపేరును దుర్వినియోగం చేయడంతో విసిగిపోయిన బంధువులు ఆమెకు దూరమయ్యారు. ఆమెను, ఆమె భర్తను బహిష్కరించారు. ఎన్నికల్లో పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ∗ నాలుగేళ్లుగా హైదరాబాద్‌కే పరిమితమైన మాజీ మంత్రి దంపతులు ఇప్పుడు ఎన్నికలు రావడంతో పదవి కోసం మళ్లీ నియోజకవర్గంలో తిష్టవేశారు. ∗ నంద్యాలకు ఆనుకుని ఉన్న నియోజకవర్గంలోని మూడు మండలాల గుండా ప్రవహించే వక్కిలేరులో అప్పటి టీడీపీ మంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాదాపు మూడేళ్ల పాటు ఏటా నీరు–చెట్టు పేరిట పనులు చేస్తున్నట్లు హడావుడి చేశారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 350 పనులుగా దీన్ని విభజించి తన బంధువులైన  రామతీర్థ పుట్టాలమ్మ ఆలయ అప్పటి చైర్మన్‌ (ప్రస్తుత బీజేపీ నాయకుడు), అప్పటి సహకార సంఘం చైర్మన్, కోటకందుకూరు మాజీ సర్పంచికి అప్పగించారు.వారు వాగులో అరకొర పనులు చేసి ఏకంగా రూ.3 కోట్లకు పైగా నిధులు కొల్లగొట్టారు. ఇందులో నాటి మంత్రికి సగం ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వర్క్‌ ఆర్డర్‌ లేకపోయినా అధికారులను బెదిరించి బిల్లులు చేయించుకున్నట్లు సమాచారం.  ∗ రుద్రవరం మండలం నాగులవరం సమీపంలోని టీజీపీ పంట కాలువలో పూడిక తీసినట్టు అధికారులు బిల్లులూ మంజూరు చేశారు. ఇదే గ్రామానికి చెందిన  నాటి మంత్రి అనుచరుడు ఇలాంటి పది పనులు సుమారు రూ.కోటితో చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నాలుగు పనులు నాసిరకంగా చేపట్టగా, ఆరు పనులను అసలు చేయకుండానే బిల్లులు ఆమోదింపజేసుకుని రూ.60 లక్షలు మింగేశారని సమాచారం. ఇలా పైపై పనులు చేపట్టి దాదాపు రూ.130 కోట్ల మేర నాటి మంత్రి, జన్మభూమి కమిటీలు, వారి అనుచరులు బొక్కేశారు. రైతులకు ఉచితంగా ఇచ్చే శనగ విత్తనాల నుంచి మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని ఇతర రాష్ట్రాల నుంచి మినుములను రప్పించి ఇక్కడి రైతులవే అని చెప్పి కొల్లగొట్టేశారు. తాగునీటి సరఫరా పేరుతో దోపిడీ... చంద్రబాబు ఐదేళ్ల పాలనలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమస్యను తమకు అనుకూలంగా మార్చుకుని అప్పటి మంత్రిగా అడ్డంగా దోచేశారు. పట్టణంలో ట్యాంకరుకు రూ.500 నుంచి రూ.750 వరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. మంత్రి అనుచరులు ట్యాంకర్లను కొని మున్సిపాలిటీకి అద్దెకిచ్చారు. నీటిని వారు తరలించకుండానే కోట్లాది రూపాయలు దోపిడీ చేశారు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ వేషంలో వెళ్లి కిడ్నాప్‌.. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో 40 ఎకరాల భూమి ఆక్రమించుకునేందుకు మాజీ మంత్రి, ఆమె వర్గీయులు చేసిన కిడ్నాప్‌ సినిమాను తలపించింది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్ల వేషంలో వెళ్లి కిడ్నాప్‌ చేయడంతో అప్పట్లో సంచలనమైంది. అయితే తీరా కిడ్నాప్‌ చేసిన మనుషులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంధువులు కావడంతో కథ అడ్డం తిరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి కిడ్నాప్‌ చేసిన వ్యవహారంలో మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆమె ఏ1 నిందితురాలు. నెలల తరబడి జైలు జీవితం గడిపారు. కిడ్నాప్‌ కేసులో ఓ మహిళా మాజీ మంత్రి జైలుకు వెళ్లడం అదే తొలిసారి.

TDP Leaders Voice Calls to Ap people with the name of CM Jagan
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్‌

ఈ ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్‌సీపీ విజయం  ఖాయమని స్పష్టం కావడంతో చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌ బెంబేలెత్తుతోంది. ఎలాగైనా సరే ప్రజలను తప్పుదారి పట్టించాలని తప్పుడు మార్గాలు ఎంచుకుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులను టార్గెట్‌ చేస్తూ పచ్చ సోషల్‌ మీడియా రెచ్చిపోతోంది. స్పామ్‌ కాల్స్‌ పేరుతో జనాలకు ఫోన్‌లు చేసి విసిగిస్తోంది. ఫోన్‌ ఎత్తితే చాలు.. సీఎం జగన్‌పై అసభ్య పదజాలంతో దూషణలు వినిపిస్తోంది. నోటికి వచ్చిన మాటలతో తిట్ల దండకం అందుకుంటోంది. అబద్ధాలను ప్రచారం చేస్తూ బురద జల్లుతోంది. ఎవరో ఫోన్‌ చేస్తున్నారనుకుని ఆ ఫోన్‌ ఎత్తితే చాలు.. ఆ వాయిస్‌ కాల్‌లో సీఎం జగన్‌ను బండ బూతులు తిడుతున్నారు. పదే పదే కాల్స్‌ చేసి జనాలను సతాయిస్తున్నారు. ఈ క్రమంలో జనాలు అలాంటి స్పామ్‌ కాల్స్‌ను ఎత్తకపోవడంతో చివరికి ఎంతకు తెగించారంటే.. ఆ కాల్స్‌పై ట్రూకాలర్‌లో యువర్‌ జగన్, జగన్‌ లీడర్, మాస్‌ లీడర్‌ జగన్‌.. అంటూ పేర్లు వచ్చేలా చేసి.. జగన్‌ను అభిమానించే వారు ఫోన్‌లు తీసేలా చేస్తున్నారు. మరోవైపు షార్ట్‌ఫిలిమ్స్‌తో సీఎం జగన్, వైఎస్సార్‌సీపీ నేతలను దూషిస్తూ పోస్టులు పెడుతున్నారు.జగన్‌పై దు్రష్పచారం చేయడం, టీడీపీకి ఓటు వేయాలని కోరుతుండటంతో వాటిని టచ్‌ చేయాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. ఎలాగైనా వైఎస్సార్‌సీపీని మళ్లీ అధికారంలోకి రానీయకుండా అడ్డుకునేందుకు టీడీపీ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి.. దు్రష్పచారం చేస్తున్నాయి. ఈ విషయమై రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉండే మీడియా సర్టీఫికేషన్‌ ఆఫ్‌ మానిటరింగ్‌ కమిటీలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Chennai Super Kings beat Sunrisers Hyderabad by 78 runs
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాట‌ర్లు.. స‌న్‌రైజ‌ర్స్ ఘోర ఓట‌మి

ఐపీఎల్‌-2024లో వరుస ఓటుమ‌ల త‌ర్వాత చెన్నై సూప‌ర్ కింగ్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చెపాక్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 78 ప‌రుగుల తేడాతో సీఎస్‌కే ఘ‌న విజ‌యం సాధించింది. 213 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్.. సీఎస్‌కే బౌల‌ర్ల దాటికి 134 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో మార్‌క్ర‌మ్‌(32) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మిగితా అంద‌రూ విఫ‌ల‌మ‌య్యారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో తుషార్ దేశ్‌పాండే నాలుగు వికెట్లతో చెల‌రేగ‌గా.. ముస్త‌ఫిజుర్ రెహ్మాన్‌, ప‌తిర‌నా త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. వీరితో పాటు జ‌డేజా, శార్ధూల్ చెరో వికెట్ సాధించారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. సీఎస్‌కే బ్యాటర్లలో కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మరోసారి అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని రుతురాజ్‌ కోల్పోయాడు. 54 బంతులు ఎదుర్కొన్న 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 98 పరుగులు చేశాడు.  

తప్పక చదవండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement