Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

Chennai Super Kings beat Sunrisers Hyderabad by 78 runs
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాట‌ర్లు.. స‌న్‌రైజ‌ర్స్ ఘోర ఓట‌మి

ఐపీఎల్‌-2024లో వరుస ఓటుమ‌ల త‌ర్వాత చెన్నై సూప‌ర్ కింగ్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చెపాక్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 78 ప‌రుగుల తేడాతో సీఎస్‌కే ఘ‌న విజ‌యం సాధించింది. 213 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్.. సీఎస్‌కే బౌల‌ర్ల దాటికి 134 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో మార్‌క్ర‌మ్‌(32) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మిగితా అంద‌రూ విఫ‌ల‌మ‌య్యారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో తుషార్ దేశ్‌పాండే నాలుగు వికెట్లతో చెల‌రేగ‌గా.. ముస్త‌ఫిజుర్ రెహ్మాన్‌, ప‌తిర‌నా త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. వీరితో పాటు జ‌డేజా, శార్ధూల్ చెరో వికెట్ సాధించారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. సీఎస్‌కే బ్యాటర్లలో కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మరోసారి అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని రుతురాజ్‌ కోల్పోయాడు. 54 బంతులు ఎదుర్కొన్న 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 98 పరుగులు చేశాడు.  

Daryl Mitchell, Ruturaj Gaikwad power CSK to 212-3
రుతురాజ్‌ విధ్వంసం.. ఎస్‌ఆర్‌హెచ్‌ ముందు భారీ టార్గెట్‌

ఐపీఎల్‌-2024లో చెపాక్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.సీఎస్‌కే బ్యాటర్లలో కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మరోసారి అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని రుతురాజ్‌ కోల్పోయాడు. 54 బంతులు ఎదుర్కొన్న 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 98 పరుగులు చేశాడు. 19వ ఓవర్‌లో నటరాజన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గైక్వాడ్‌ ఔటయ్యాడు.ఇక సీఎస్‌కే బ్యాటర్లలో గైక్వాడ్‌తో పాటు మిచెల్‌(52), శివమ్‌ దూబే(39 నాటౌట్‌) పరుగులతో రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు అందరూ పూర్తిగా తేలిపోయారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌, ఉనద్కట్‌ తలా వికెట్‌ సాధించారు. కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌,నటరాజన్‌ ఇద్దరి కలిసి ఏకంగా 92 పరుగులు సమర్పించుకున్నారు.

Sunita Kejriwal Second Day Delhi Road Show
భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్

ఢిల్లీ: ఆప్ పార్టీ తరపున ఏప్రిల్ 27 నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ రోజు (ఆదివారం) పశ్చిమ ఢిల్లీ నియోజక వర్గంలో ఆప్ అభ్యర్థి మహాబల్ మిశ్రాకు మద్దతు కోరుతూ క్యాంపెయిన్ నిర్వహించారు.ఢిల్లీ రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. భారతమాత కుమార్తెగా.. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన భర్త సింహం అని, ఆయన్ను ఎవరూ పడగొట్టలేరని అన్నారు. కారు సన్‌రూఫ్‌లోంచి నిల్చుని ఓటర్లకు అభివాదం చేశారు.పాఠశాలలు కట్టడం, ఉచిత విద్యుత్‌ అందించడం, మొహల్లా క్లినిక్‌లు ప్రారంభించి ప్రజలకు మంచి పనులు చేసినందుకే జైలుకెళ్లారని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఆయన (కేజ్రీవాల్) భరతమాత పుత్రుడు, నియంతృత్వానికి వ్యతిరేఖంగా ఓటు వేసి ప్రజాస్వామ్యం కాపాడుకోవడం మీ బాధ్యత. దయచేసి దీని విలువ అర్థం చేసుకోండి అని ఆమె అన్నారు.లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ఆప్' తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఇక ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, చాందినీ చౌక్ స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలబెట్టింది.जनता के इस सैलाब के आगे,कोई तानाशाह टिक नहीं सकता 🔥अपने बेटे, अपने भाई केजरीवाल को आशीर्वाद देने सड़कों पर उमड़ी पश्चिमी दिल्ली की जनता 💯#KejriwalKoAshirwad pic.twitter.com/ZTPl8LrsaS— AAP (@AamAadmiParty) April 28, 2024

Odisha Is Being Run By Pan Says Rahul Gandhi
‘మీరు కావాల్సినంత పాన్‌ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్‌దే అధికారం

ఒడిశాను ‘పాన్’ (పాండియన్, అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ, నవీన్ పట్నాయక్) పరిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బిజూ జనతాదళ్ ఒకరినొకరు పెళ్లి చేసుకున్నాయి అని అన్నారు. ఒడిశాలోని కేంద్రపరా ప్రాంతంలో రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఒడిశాలో బీజేపీ-బీజేడీలు పెళ్లి చేసుకున్నాయి. వారు అందరికీ పాన్‌ ఇచ్చారు. పీఎం మోదీ 22-25 మంది కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అదే పద్ధతిలో నవీన్ పట్నాయక్ కూడా కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులకే అధికారం దక్కుతుంది. ఈ వ్యక్తులు మీ సంపదను దోచుకున్నారు. రైతుల భూములు లాక్కున్నారని ఆరోపించారు.  మీరు (ప్రజలు) తగినంత పాన్ తిన్నారు. ఇప్పుడు ఒడిశాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని రాహుల్‌ గాంధీ జోస్యం చెప్పారు.  ఒడిశాలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి నాలుగు దశల్లో జరగనున్నాయి. మే 13న మొదటి దశ, మే 20న రెండో దశ, మే 25న మూడో దశ, జూన్ 1న చివరి దశ.  జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.  2019 లోక్‌సభ ఎన్నికల్లో, బిజూ జనతాదళ్ (బీజేడీ)కి అత్యధిక స్థానాలు (12), ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ (8), కాంగ్రెస్‌కు ఒక్కటే సీటుతో సరిపెట్టుకుంది. 

Will Jacks smashes fifth fastest hundred during GT vs RCB match
విల్ జాక్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. 10 సిక్స్‌ల‌తో! వీడియో వైర‌ల్‌

ఐపీఎల్‌-2024లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన‌ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆట‌గాడు విల్ జాక్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. 201 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో జాక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌ను జాక్స్ ఊచ‌కోత కోశాడు. ఈ క్ర‌మంలో కేవ‌లం 41 బంతుల్లోనే జాక్స్ త‌న సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. జాక్స్‌కు ఇది తొలి ఐపీఎల్ సెంచ‌రీ కావ‌డం విశేషం. ఓవ‌రాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న జాక్స్‌.. 5 ఫోర్లు, 10 సిక్స్‌ల‌తో 100 ప‌రుగుల‌తో ఆజేయంగా నిలిచింది. జాక్స్ విధ్వంసం ఫ‌లితంగా 201 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ  కేవ‌లం 16 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో జాక్స్‌తో పాటు కోహ్లి(70 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ఇక మ్యాచ్‌లో సెంచరీ మెరిసిన జాక్స్ ఓ అరుదైన ఘ‌న‌తను త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన నాలుగో ఆట‌గాడిగా జాక్స్ నిలిచాడు. ఈ జాబితాలో విండీస్ లెజెండ్ క్రిస్ గేల్ తొలి స్ధానంలో ఉన్నాడు. 2013 ఐపీఎల్ సీజ‌న్‌లో ఆర్సీబీ త‌ర‌పున గేల్.. పుణే వారియ‌ర్స్‌పై కేవ‌లం 30 బంతుల్లోనే గేల్ శ‌త‌కం సాధించాడు. ఆ త‌ర్వాతి స్ధానాల్లో యూస‌ఫ్ ప‌ఠాన్‌(37  బంతులు ), డేవిడ్ మిల్ల‌ర్‌(38  బంతులు ), ట్ర‌విస్ హెడ్‌(39  బంతులు ), విల్‌జాక్స్‌(41  బంతులు ) ఉన్నారు. అదే విధంగా ఆర్సీబీ త‌రపున ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన రెండో ఆట‌గాడిగా జాక్స్ రికార్డుల‌కెక్కాడు. 

Cm Jagan Tweet On Chandrababu
అలా చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు?.. సీఎం జగన్‌ ట్వీట్‌

సాక్షి, తాడేపల్లి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరోసారి చారిత్రక విజ­యంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మలివిడత ఎన్నికల ప్రచార భేరి మోగించారు.ఇక సిద్ధం సభలు గ్రాండ్‌ సక్సెస్‌ కావడం.. బస్సు యాత్ర చరిత్ర సృష్టించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరు­పతి లోక్‌సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్‌, నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్‌లో ఆదివారం జరిగిన సభల్లో సీఎం జగన్‌ ప్రసంగించారు. మరోవైపు, ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా చంద్రబాబు మోసాలను సీఎం జగన్‌ ఎండగట్టారు.‘‘అయ్యా చంద్రబాబూ.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు...? వచ్చే ఎన్నికల్లో మన వైసీపి అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను’’ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.  అయ్యా చంద్రబాబు.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు. 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం. మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా… pic.twitter.com/lSAAuOO7zw— YS Jagan Mohan Reddy (@ysjagan) April 28, 2024

Harassment Case Filed Against Deve Gowda Grandson Prajwal Revanna
అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు

బెంగళూరు: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక జనతాదళ్‌ (సెక్యులర్‌) అగ్రనేత దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజ్వల్‌ రేవణ్ణపై హాసన్ జిల్లా హోలెనరసిపూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.ఆ ఎఫ్‌ఐఆర్‌లో 2019, 2022 మధ్య కాలంలో తాను అనేకసార్లు లైంగిక వేధింపులకు గురైనట్ల బాధితురాలు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు సిట్‌ బృందానికి సమాచారం అందించారు. కాగా, మరింత మంది మహిళలు కేసులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని ప్రజ్వల్ రేవన్న ఖండించారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న అశ్లీల వీడియోలు మార్ఫింగ్‌ చేసినవి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకర వీడియోల కేసు దుమారం రేగడంతో ప్రజ్వల్ రేవణ్ణ నిన్న ఉదయం జర్మనీ వెళ్లారు.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ నిజానిజాలు తేల్చేందుకు సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళపై లైంగిక వేధింపుల కోణాన్ని కూడా దీనిలో దర్యాప్తు చేస్తామన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ లోక్‌సభ నియోజకవర్గంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) అభ్యర్థిగా ఉన్నారు. ఏప్రిల్ 26న రెండో దశలో ఓటింగ్ జరిగింది. 

Alakh Pandey Urges Indian Students At Harvard, Stanford
విద్యార్థుల్లారా.. రండి మాతృ దేశానికి సేవ చేయండి.. ఫిజిక్స్‌ వాలా పిలుపు

అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్ధుల్లారా.. మీరెక్కడున్నా దేశానికి తిరిగి వచ్చేయండి. దేశ సేవ చేయండి. దేశ అభివృద్దిలో పాలు పంచుకోండి అంటూ ప్రముఖ ఎడ్యుటెక్‌ ఫిజిక్స్‌ వాల వ్యవస్థాపకుడు, సీఈఓ అలఖ్ పాండే పిలుపునిచ్చారు.యూఎస్‌లో చదువుతున్న భారతీయ విద్యార్ధులు దేశ సేవ చేయాలని అలఖ్‌ పాండే కోరారు. తిరిగి రాలేని వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దేశ పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అలఖ్‌ పాండే ఇటీవల హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీల్లో ప్రసంగించేందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ క్యాంపస్‌లలో భారతీయ విద్యార్ధులతో దిగిన ఫోటోల్ని, అనుభవాల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  అవును, మన దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఏ దేశం పరిపూర్ణంగా లేదు. కానీ  యువత దేశాన్ని మార్చుకునే అవకాశం ఉందని అన్నారు.      View this post on Instagram           A post shared by Physics Wallah (PW) (@physicswallah)

IPL 2024: Will Jacks Slams Blasting Century, RCB Beat Gujarat By 9 Wickets
విల్‌ జాక్స్‌ సుడిగాలి శతకం.. గుజరాత్‌ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ మూడో విజయం సాధించింది. ప్లే ఆఫ్స్‌ అవకాశాలు గల్లంతయ్యాక కోలుకున్న ఆర్సీబీ గుజరాత్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 28) జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్‌ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. విల్‌ జాక్స్‌ (41 బంతుల్లో 100 నాటౌట్‌; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్‌ సునామీ ఇన్నింగ్స్‌ ముందు విరాట్‌ కోహ్లి (44 బంతుల్లో 79 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ మరుగున పడింది. ఛేదనలో ఆర్సీబీకి డుప్లెసిస్‌ (12 బంతుల్లో 24; ఫోర్‌, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. జాక్స్‌ తానెదుర్కొన్న చివరి 13 బంతుల్లో ఏకంగా 64 పిండుకున్నాడు. మోహిత్‌ వేసిన 15వ ఓవర్‌లో 29 పరుగులు, రషీద్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో 29 పరుగులు రాబట్టాడు. జాక్స్‌ దెబ్బకు గుజరాత్‌ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. డుప్లెసిస్‌ వికెట్‌ సాయికిషోర్‌కు దక్కింది.అంతకుముందు టాస్‌ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. సాయి సుదర్శన్‌ (49 బంతుల్లో 84 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్‌ ఖాన్‌ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో వృద్దిమాన్‌ సాహా (5), శుభ​్‌మన్‌ గిల్‌ (16) నిరాశపర్చగా.. డేవిడ్‌ మిల్లర్‌ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్‌) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌, స్వప్నిల్‌ సింగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

Ap Government Key Decision On Distribution Of Pensions
పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

సాక్షి, విజయవాడ: పెన్షన్లు పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుండి 5 వ తేదీలోపు పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. డీబిటి విధానం లేదా శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. 74.70 శాతం మంది పెన్షన్లను బ్యాంకుల్లో ప్రభుత్వం నేరుగా డబ్బులు జమ చేయనుంది.ఆధార్ లింక్‌యిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం.. దివ్యాంగులు, దీర్ఘకాలిగా వ్యాధులతో సతమతమవుతున్న వారికి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంక్ ఖాతాలేని 25 శాతం మందికి ఇంటింటికి వెళ్లి ఉద్యోగులు పెన్షన్ ఇవ్వనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రిన్సిపాల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 

తప్పక చదవండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement