Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

Will Jacks smashes fifth fastest hundred during GT vs RCB match
విల్ జాక్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. 10 సిక్స్‌ల‌తో! వీడియో వైర‌ల్‌

ఐపీఎల్‌-2024లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన‌ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆట‌గాడు విల్ జాక్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. 201 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో జాక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌ను జాక్స్ ఊచ‌కోత కోశాడు. ఈ క్ర‌మంలో కేవ‌లం 41 బంతుల్లోనే జాక్స్ త‌న సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. జాక్స్‌కు ఇది తొలి ఐపీఎల్ సెంచ‌రీ కావ‌డం విశేషం. ఓవ‌రాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న జాక్స్‌.. 5 ఫోర్లు, 10 సిక్స్‌ల‌తో 100 ప‌రుగుల‌తో ఆజేయంగా నిలిచింది. జాక్స్ విధ్వంసం ఫ‌లితంగా 201 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ  కేవ‌లం 16 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో జాక్స్‌తో పాటు కోహ్లి(70 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ఇక మ్యాచ్‌లో సెంచరీ మెరిసిన జాక్స్ ఓ అరుదైన ఘ‌న‌తను త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన నాలుగో ఆట‌గాడిగా జాక్స్ నిలిచాడు. ఈ జాబితాలో విండీస్ లెజెండ్ క్రిస్ గేల్ తొలి స్ధానంలో ఉన్నాడు. 2013 ఐపీఎల్ సీజ‌న్‌లో ఆర్సీబీ త‌ర‌పున గేల్.. పుణే వారియ‌ర్స్‌పై కేవ‌లం 30 బంతుల్లోనే గేల్ శ‌త‌కం సాధించాడు. ఆ త‌ర్వాతి స్ధానాల్లో యూస‌ఫ్ ప‌ఠాన్‌(37  బంతులు ), డేవిడ్ మిల్ల‌ర్‌(38  బంతులు ), ట్ర‌విస్ హెడ్‌(39  బంతులు ), విల్‌జాక్స్‌(41  బంతులు ) ఉన్నారు. అదే విధంగా ఆర్సీబీ త‌రపున ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన రెండో ఆట‌గాడిగా జాక్స్ రికార్డుల‌కెక్కాడు. 

Cm Jagan Tweet On Chandrababu
అలా చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు?.. సీఎం జగన్‌ ట్వీట్‌

సాక్షి, తాడేపల్లి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరోసారి చారిత్రక విజ­యంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మలివిడత ఎన్నికల ప్రచార భేరి మోగించారు.ఇక సిద్ధం సభలు గ్రాండ్‌ సక్సెస్‌ కావడం.. బస్సు యాత్ర చరిత్ర సృష్టించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరు­పతి లోక్‌సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్‌, నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్‌లో ఆదివారం జరిగిన సభల్లో సీఎం జగన్‌ ప్రసంగించారు. మరోవైపు, ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా చంద్రబాబు మోసాలను సీఎం జగన్‌ ఎండగట్టారు.‘‘అయ్యా చంద్రబాబూ.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు...? వచ్చే ఎన్నికల్లో మన వైసీపి అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను’’ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.  అయ్యా చంద్రబాబు.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు. 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం. మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా… pic.twitter.com/lSAAuOO7zw— YS Jagan Mohan Reddy (@ysjagan) April 28, 2024

Harassment Case Filed Against Deve Gowda Grandson Prajwal Revanna
అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు

బెంగళూరు: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక జనతాదళ్‌ (సెక్యులర్‌) అగ్రనేత దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజ్వల్‌ రేవణ్ణపై హాసన్ జిల్లా హోలెనరసిపూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.ఆ ఎఫ్‌ఐఆర్‌లో 2019, 2022 మధ్య కాలంలో తాను అనేకసార్లు లైంగిక వేధింపులకు గురైనట్ల బాధితురాలు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు సిట్‌ బృందానికి సమాచారం అందించారు. కాగా, మరింత మంది మహిళలు కేసులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని ప్రజ్వల్ రేవన్న ఖండించారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న అశ్లీల వీడియోలు మార్ఫింగ్‌ చేసినవి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకర వీడియోల కేసు దుమారం రేగడంతో ప్రజ్వల్ రేవణ్ణ నిన్న ఉదయం జర్మనీ వెళ్లారు.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ నిజానిజాలు తేల్చేందుకు సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళపై లైంగిక వేధింపుల కోణాన్ని కూడా దీనిలో దర్యాప్తు చేస్తామన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ లోక్‌సభ నియోజకవర్గంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) అభ్యర్థిగా ఉన్నారు. ఏప్రిల్ 26న రెండో దశలో ఓటింగ్ జరిగింది. 

IPL 2024 SRH vs CSK: Sunrisers Hyderabad won the toss, elected bowl First
సీఎస్‌కేతో ఎస్ఆర్‌హెచ్ పోరు.. తుది జ‌ట్లు ఇవే

ఐపీఎల్‌-2024లో మ‌రో ర‌స‌వ‌త్త‌ర‌పోరుకు రంగం సిద్ద‌మైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా  చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన  ఎస్ఆర్‌హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు ఎటువంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగాయి. కాగా ఈ రెండు జ‌ట్లు కూడా త‌మ చివ‌రి మ్యాచ్‌ల్లో ఓట‌మి చ‌విచూశాయి. సీఎస్‌కే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో చేతిలో ప‌రాజ‌యం పాల‌వ్వ‌గా.. ఎస్ఆర్‌హెచ్ ఆర్సీబీపై ఓట‌మి పాలైంది. పాయింట్ల ప‌ట్టిక‌లో ఎస్ఆర్‌హెచ్ మూడో స్ధానంలో కొన‌సాగుతుండ‌గా.. సీఎస్‌కే ఆరో స్ధానంలో ఉంది.తుది జ‌ట్లుచెన్నై సూపర్ కింగ్స్ : అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీప‌ర్‌), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానాసన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ 

Alakh Pandey Urges Indian Students At Harvard, Stanford
విద్యార్థుల్లారా.. రండి మాతృ దేశానికి సేవ చేయండి.. ఫిజిక్స్‌ వాలా పిలుపు

అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్ధుల్లారా.. మీరెక్కడున్నా దేశానికి తిరిగి వచ్చేయండి. దేశ సేవ చేయండి. దేశ అభివృద్దిలో పాలు పంచుకోండి అంటూ ప్రముఖ ఎడ్యుటెక్‌ ఫిజిక్స్‌ వాల వ్యవస్థాపకుడు, సీఈఓ అలఖ్ పాండే పిలుపునిచ్చారు.యూఎస్‌లో చదువుతున్న భారతీయ విద్యార్ధులు దేశ సేవ చేయాలని అలఖ్‌ పాండే కోరారు. తిరిగి రాలేని వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దేశ పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అలఖ్‌ పాండే ఇటీవల హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీల్లో ప్రసంగించేందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ క్యాంపస్‌లలో భారతీయ విద్యార్ధులతో దిగిన ఫోటోల్ని, అనుభవాల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  అవును, మన దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఏ దేశం పరిపూర్ణంగా లేదు. కానీ  యువత దేశాన్ని మార్చుకునే అవకాశం ఉందని అన్నారు.      View this post on Instagram           A post shared by Physics Wallah (PW) (@physicswallah)

IPL 2024: Will Jacks Slams Blasting Century, RCB Beat Gujarat By 9 Wickets
విల్‌ జాక్స్‌ సుడిగాలి శతకం.. గుజరాత్‌ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ మూడో విజయం సాధించింది. ప్లే ఆఫ్స్‌ అవకాశాలు గల్లంతయ్యాక కోలుకున్న ఆర్సీబీ గుజరాత్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 28) జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్‌ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. విల్‌ జాక్స్‌ (41 బంతుల్లో 100 నాటౌట్‌; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్‌ సునామీ ఇన్నింగ్స్‌ ముందు విరాట్‌ కోహ్లి (44 బంతుల్లో 79 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ మరుగున పడింది. ఛేదనలో ఆర్సీబీకి డుప్లెసిస్‌ (12 బంతుల్లో 24; ఫోర్‌, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. జాక్స్‌ తానెదుర్కొన్న చివరి 13 బంతుల్లో ఏకంగా 64 పిండుకున్నాడు. మోహిత్‌ వేసిన 15వ ఓవర్‌లో 29 పరుగులు, రషీద్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో 29 పరుగులు రాబట్టాడు. జాక్స్‌ దెబ్బకు గుజరాత్‌ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. డుప్లెసిస్‌ వికెట్‌ సాయికిషోర్‌కు దక్కింది.అంతకుముందు టాస్‌ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. సాయి సుదర్శన్‌ (49 బంతుల్లో 84 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్‌ ఖాన్‌ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో వృద్దిమాన్‌ సాహా (5), శుభ​్‌మన్‌ గిల్‌ (16) నిరాశపర్చగా.. డేవిడ్‌ మిల్లర్‌ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్‌) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌, స్వప్నిల్‌ సింగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

Ap Government Key Decision On Distribution Of Pensions
పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

సాక్షి, విజయవాడ: పెన్షన్లు పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుండి 5 వ తేదీలోపు పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. డీబిటి విధానం లేదా శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. 74.70 శాతం మంది పెన్షన్లను బ్యాంకుల్లో ప్రభుత్వం నేరుగా డబ్బులు జమ చేయనుంది.ఆధార్ లింక్‌యిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం.. దివ్యాంగులు, దీర్ఘకాలిగా వ్యాధులతో సతమతమవుతున్న వారికి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంక్ ఖాతాలేని 25 శాతం మందికి ఇంటింటికి వెళ్లి ఉద్యోగులు పెన్షన్ ఇవ్వనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రిన్సిపాల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 

Not Joining Any Political Party Says Arvinder Singh Lovely
రూ. 600 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత.. 14 మంది అరెస్ట్

గుజరాత్‌లోని అరేబియా సముద్ర తీరంలో భారీస్థాయి మాదకద్రవ్యాల రాకెట్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఛేదించింది. భారత్‌లోకి అక్రమంగా మాదకద్రవ్యాలు చేరవేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రను భగ్నం చేసింది. ఎన్‌సీబీ, గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌), ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ శనివారం రాత్రి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.600 కోట్ల విలువైన 86 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోరుబందర్‌ సమీప తీరంలోని నౌక నుంచి వాటిని సీజ్‌ చేసి, పాకిస్థాన్‌కు చెందిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్‌లో భాగంగా పాక్‌ నౌకని నిలువరించేందుకు కోస్ట్‌గార్డ్‌ నౌకలు,  విమానాలను మోహరించింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న కీలక నౌకల్లో కోస్ట్ గార్డ్ షిప్ రాజ్‌రతన్‌లో ఎన్సీబీ,ఏటీఎస్‌ అధికారులు దాడులు చేశారు. Anti #Narco #Operations @IndiaCoastGuard Ship Rajratan with #ATS #Gujarat & #NCB @narcoticsbureau in an overnight sea - air coordinated joint ops apprehends #Pakistani boat in Arabian Sea, West of #Porbandar with 14 Pak crew & @86 Kg contraband worth approx ₹ 600Cr in… pic.twitter.com/N49LfrYLzz— Indian Coast Guard (@IndiaCoastGuard) April 28, 2024

Cm Jagan Speech In Kandukur Public Meeting
చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ: సీఎం జగన్‌

సాక్షి, నెల్లూరు జిల్లా: మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ముందుకొస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కందుకూరు కేఎంసీ సర్కిల్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘ఈ ఎన్నికల్లో చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ. మనది ఇంటింటికీ మంచి చేసి అభివృద్ధి చేసిన పార్టీ. చంద్రబాబు పార్టీలతో జతకడితే మీ బిడ్డ అందరికీ మంచిచేసి ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నాడు’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.‘‘తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి అన్నట్టుగా.. ఎన్నికలు వస్తుంటే మన రాష్ట్రానికి పొత్తుల నాయకులు వస్తున్నారు. చంద్రబాబు కానీ, దత్తపుత్రుడు కానీ, వదినమ్మ కానీ, ఈనాడు రామోజీరావు కానీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ, టీవీ5 నాయుడు కానీ ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నారా?. ఎన్నికలు వచ్చాయి కాబట్టే చంద్రబాబు కూటమి ఆంధ్రరాష్ట్రానికి వచ్చారు. ఓడిన వెంటనే మళ్లీ హైదరాబాద్‌కి వెళ్లిపోతారు. చంద్రబాబు కూటమి అంటే నాన్ లోకల్ కిట్టీపార్టీ. నయా ఈస్టిండియా కంపెనీ చంద్రబాబు కూటమిలో ఏ ఒక్కరికీ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేసిన చరిత్రే లేదు’’ అని సీఎం జగన్‌ ధ్వజమెత్తారు.‘‘ప్రతి పేద ఇంటికి మనం చేసిన మంచి ఇది అని గర్వంగా చెప్పుకుంటున్నాం. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా, సైనికులుగా నిలవండి అని కోరుతున్నాను. సెల్ఫోన్ నేనే కనిపెట్టా అంటూ బాబులా నేను బడాయిలు చెప్పడం లేదు. ఈ 58 నెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు ప్రజల ముందు పెట్టి మార్కులు వేయమని అడుగుతున్నా. మీరు అధికారం ఇవ్వడం వల్లే ప్రతి పల్లె, పట్టణంలో కనీసం 6 వ్యవస్థలు ఏర్పాటు చేసాం. సచివాలయాలు, వాలంటీర్లు, నాడునేడుతో మారిన బడి, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్, మహిళా పోలీస్, డిజిటల్ లైబ్రరీ, ఫైబర్ గ్రిడ్ ప్రతి ఊరిలో కనిపిస్తాయి. ఇక మీదట కూడా ఈ పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కి మీ బిడ్డకు తోడుగా ఉండండి.’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు.‘‘ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్, ఇంటి ముంగిటికే వచ్చే రేషన్... మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఈ సంప్రదాయం. పేదలకు మనం ఇస్తున్న ఈ మర్యాద కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డకు తోడుగా ఉండండి. చంద్రబాబు మార్కు రాజ్యం.. దోపిడీ సామ్రాజ్యం, గ్రామగ్రామాన లంచాలు, వివక్షలతో జన్మభూమి కమిటీలు. లంచాలు, వివక్ష లేకుండా, కులం, మతం, ప్రాంతం, వర్గం, ఎవరికి ఓటేసారు అనేది కూడా చూడకుండా అర్హులందరికీ ఇచ్చిన ఈ పథకాలన్నీ వచ్చే ఐదేళ్లు కూడా కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డకు తోడుగా ఉండండి. 130 బటన్లు నొక్కి రూ.2,70,000 కోట్లు డీబీటీగా అక్కచెల్లెమ్మల ఖాతాలకు నేరుగా అందించాం’’ అని సీఎం జగన్‌ చెప్పారు ‘‘మళ్లీ వచ్చే ఐదేళ్లూ ఇది కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కండి అని కోరుతున్నాను. ప్రతి పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదన్నా.. మీ గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్,  ఇంటికే అందిస్తున్న ఆరోగ్య సురక్ష సేవలు... విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా అందాలంటే మీ బిడ్డను ఆశీర్వదించండి’’ అని సీఎం జగన్‌ కోరారు.     

​​​ IPL 2024: Gujarat Titans Set 201 Runs Target For RCB
IPL 2024 GT VS RCB: విజృంభించిన సాయి సుదర్శన్‌, షారుక్‌ ఖాన్‌

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్‌ 28) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌.. సాయి సుదర్శన్‌ (49 బంతుల్లో 84 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్‌ ఖాన్‌ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో వృద్దిమాన్‌ సాహా (5), శుభ్‌మన్‌ గిల్‌ (16) నిరాశపర్చగా.. డేవిడ్‌ మిల్లర్‌ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్‌) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌, స్వప్నిల్‌ సింగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.గుజరాత్‌ ఇన్నింగ్స్‌ విశేషాలు..7.4 ఓవర్లలో 49 పరుగులు మాత్రమే చేసిన గుజరాత్‌ చివరి 12.2 ఓవర్లలో ఏకంగా 151 పరుగులు చేసింది.ఈ సీజన్‌లో సాయి సుదర్శన్‌ 400 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.షారుక్‌ ఖాన్‌ తన తొలి ఐపీఎల్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఈ మైలురాయిని షారుక్‌ కేవలం 24 బంతుల్లోనే సాధించాడు. 

తప్పక చదవండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement