-
ఆసియా స్నూకర్ రన్నరప్ భారత్
దోహా: ఆసియా టీమ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ, మల్కీత్ సింగ్‌లతో కూడిన భారత్–1 జట్టు రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్–1 జట్టు 2–3 (2–110, 81–47, 70–72, 107–5, 18–98) ఫ్రేమ్‌ల తేడాతో మొహమ్మద్ ఆసిఫ్, బాబర్ మసీలతో కూడిన పాకిస్తాన్–1 జట్టు చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్స్‌లో భారత్–1 జట్టు 3–2 ఫ్రేమ్‌ల తేడాతో మొహమ్మద్ మాజిద్ అలీ, మొహమ్మద్ బిలాల్‌లతో కూడిన పాకిస్తాన్–2 జట్టుపై... పాకిస్తాన్–1 జట్టు 3–1 ఫ్రేమ్‌ల తేడాతో వు యిజి, పాంగ్‌జున్‌జులతో కూడిన చైనా జట్టుపై విజయం సాధించాయి. -
పంకజ్ ఏడోస్సారి...
యాంగాన్ (మయన్మార్): ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ టైటిల్ నిలబెట్టుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ బెంగళూరు ప్లేయర్ ఫైనల్లో 6–1 ఫ్రేమ్‌ల తేడాతో భారత్‌కే చెందిన బాలచంద్ర భాస్కర్‌ను ఓడించాడు. ఓవరాల్‌గా పంకజ్‌కిది ఏడో ఆసియా బిలియర్డ్స్ టైటిల్ కావడం విశేషం. గతంలో 2017, 2012, 2010, 2009, 2008, 2005లలో విజేతగా నిలిచాడు. అమీ కమాని అద్భుతం: ఇదే వేదికపై జరిగిన ఆసియా మహిళల స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి అమీ కమాని విజేతగా నిలిచింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఇండోర్‌కు చెందిన అమీకమాని ఫైనల్లో 3–0తో సిరిపపోర్న్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. -
ఫైనల్లో పంకజ్
యాంగాన్ (మయన్మార్): ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నిలబెట్టుకునేందుకు భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ మరో విజయం దూరంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 5–1తో (100–72, 0–100, 100–30, 100–2, 100–6, 100–0) ధ్వజ్ హరియా (భారత్)పై గెలిచాడు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో ఇదే స్కోరుతో అంగ్ హెతె (మయన్మార్)ను ఓడించాడు. -
పంకజ్ శుభారంభం
యాంగాన్ (మయన్మార్): ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ పంకజ్ అద్వానీ శుభారంభం చేశాడు. తొలి లీగ్ మ్యాచ్‌లో పంకజ్ 4–0తో యో టెక్ షిన్ (సింగపూర్)పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో రూపేశ్ షా (భారత్) 4–0తో సిహోమ్బింగ్ (ఇండోనేసియా)పై నెగ్గాడు. -
ఆసియా బిలియర్డ్స్ టోర్నీ విజేత అద్వానీ
భారత క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ తన ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. చండీగఢ్‌లో శుక్రవారం ముగిసిన ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ విజేతగా నిలిచాడు. భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారితో జరిగిన ఫైనల్లో అద్వానీ 6–3 (54–101, 89–100, 100–9, 58–101, 100–0, 102–0, 100–0, 100–42, 101–0) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. అద్వానీ కెరీర్లో ఓవరాల్‌గా ఇది ఏడో ఆసియా టైటిల్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్‌రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్‌కు సర్వం సిద్ధం
ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement