-
పాక్ జాతీయ స్వీటు గులాబ్ జామూన్!
పాకిస్తాన్లో తాజాగా ఎన్నికలు జరిగా యి. అయితే, మీరెన్నడూ కనీవినీ ఎరుగని ఎన్నికలవి. పాక్ జాతీయ స్వీటు ఎంపిక కోసం జరిగిన ఈ ఎన్నికల్లో అభ్యర్థులు మాత్రం.. గులాబ్ జామూన్, బర్ఫీ, జిలేబీ. జాతీయ స్వీటుగా గులాబ్ జామూన్‌ను నెటిజన్లు ఎన్నుకున్నారు. పాక్ ప్రభుత్వం ఆ దేశ నేషనల్ స్వీట్ ఎన్నికలో ట్విట్టర్ ద్వారా పాల్గొనా ల్సిందిగా ప్రజలను కోరింది. ఈ ట్విట్టర్ పోల్‌లో ప్రజలు తమ ఓటుహక్కును ఉపయో గించుకొని గులాబ్ జామూన్‌కు పట్టం కట్టారు. 47 శాతం మంది పాక్ ప్రజలు గులాబ్జామ్కే ఓటు వేయడంతో ఆ దేశపు జాతీయ స్వీటుగా గులాబ్ జామూన్‌ని ప్రకటించారు. 34 శాతం ఓట్లతో జిలేబీ ద్వితీయ స్థానంలో, బర్ఫీ 19 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచాయి. రిగ్గింగ్ జరిగింది. నేషనల్ స్వీట్పోల్లో ఓటింగ్ నిజాయితీగా సాగలేదనీ, రిగ్గింగ్ జరిగిందనీ పాక్ ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం 5 లక్షల కన్నా తక్కు వమంది ఫాలోవర్స్ ఉన్న అధికారిక ట్విట్టర్ నుంచే పోల్ నిర్వహించడం వారి వ్యతిరేకతకు కారణం. ట్విట్టర్ మినహా ఈ ఎన్నికల్లో ఇతర సోషల్ మీడియాకు అవకాశం లేకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అసలు గులాబ్ జామూన్ పాకిస్తానీ స్వీటు కాదన్నది కొందరి వాదన. దీన్ని మొగలుల కాలంలో షాజహాన్ వంటవారు కనుగొన్నారని కొందరంటోంటే, మధ్య ఆసియా నుంచి దండెత్తిన టర్కీ ఆక్రమణదారుల ద్వారా ఈ పాక్‌లోకి వచ్చిందని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తంగా జామూన్ పాకిస్తానీ స్వీటు కాదనీ, దీనికి విదేశీ రుచులున్నాయన్నది వీరి వాదన. -
అవకాశాల కోసం అర్ధనగ్నంగా..
ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలన్న సామెత తెలిసినా కొందరు దాన్ని ఆచరించలేరు. దక్షిణాదిలో మంచి స్థాయికి చేరుకున్న హీరోయిన్లు ఇక్కడ అవకాశాలను కాలదన్నుకుని బాలీవుడ్ మోహంతో అక్కడ అవకాశాల కోసం నానా తంటాలు పడుతుండడం చూస్తునే ఉన్నాం. బాలీవుడ్లో ప్రవేశించిన అతి కొందరు నటీమణులే సక్సెస్ అయ్యారు. అదీ కొన్ని చిత్రాలకే పరిమితం. మరి కొందరు ఒకటి రెండు చిత్రాలతోనే సరిపెట్టుకున్నారు. అలా టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన నటి ఇలియానా దక్షిణాది అవకాశాలను వలదని, బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. అక్కడ తొలి చిత్రం బర్ఫీ చిత్రం ఈ గోవా సుందరికి మంచి పేరునే తెచ్చి పెట్టింది. దీంతో అక్కడ తన భవిష్యత్ ఉజ్వలమేనని కలలు కనేసింది కూడా. అయితే అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకవుతుంది. అమ్మడు ఐదేళ్లలో ఐదు హిందీ చిత్రాలను మాత్రమే చేసింది. ఆ తరువాత బాలీవుడ్ ఇలియానా పక్కన పెట్టేసింది.దీంతో ఎక్కడ పారేసుకున్నానో అక్కడే వెతుక్కోవడానికి ప్రయత్నాలు మొదలెట్టిందని సమాచారం. అందుకు ఇలియానా ఎంచుకున్న విధానం ఎప్పుడూ ఏదో ఇక సంచలన చర్యలతో వార్తల్లో ఉండడం. చాలా మంది వాడుకునే ట్రిక్కే ఇది. ఇలియానా తన బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేయడం, సెక్స్ గురించి మాట్లాడడం లాంటి చీప్ ట్రిక్కులను పాఠిస్తోంది. ఇలాంటివి ఈ నాజూకు అమ్మడిని వార్తల్లోకెక్కిస్తున్నాయి గానీ, అవకాశాలు మాత్రం రావడంలేదు. దీంతో చివరి ప్రయత్నంగా ఈ భామ ఈత దుస్తులతో కూడిన ఫొటోలను, పూర్తి నగ్న ఫొటోలను ఇంటర్నెట్కు విడుదల చేసింది. తను బాత్రూమ్ టబ్‌లో నగ్నంగా స్నానం చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తున్నాయి. మరి అవన్నా ఇలియానాకు అవకాశాలను అందిస్తాయే లేక వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న చింతకు గురవుతుందో చూడాల్సిందే.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్‌లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్‌నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
Advertisement