-
డ్రైవింగ్ మజావా..
సాక్షి, సిటీబ్యూరో :ఏదైనా చూస్తే ఫ్లాట్ అయిపోయాం అంటాం. అయితే ఆ ఫ్లాట్‌ను చూస్తే ఫ్లాట్ అయిపోతాం. అంటే అదేదో ఎక్కడా చూడని లగ్జరీ ఇంటీరియర్స్తోనో మరొకటో అని కాదు. చూడగానే ఒక బైక్ షోరూమ్‌లా అనిపిస్తుంది. ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో బైక్స్ వరుసగా పార్క్ చేసి ఉండడమే విశేషం అంటే.. అవి అన్నీ ఒకే బ్రాండ్ బైక్స్ కావడం మరో విశేషం. సిటీలో బైకర్స్ చాలా మందే ఉన్నారు. కొండాపూర్‌లో నివసించే వ్యాపారి సుజాత్ అలీఖాన్ తమ 3వ అంతస్థులోని ఫ్లాట్‌లో కనీసం 10కి మించిన జావా/ఎజ్డీ బైక్స్ ఉండటం విశేషం. వీటిని వరుసగా పేర్చేశారు. ‘1987లో కాలేజ్‌కి జావా బైక్ కొని దాని మీదే వెళ్లేవాడ్ని. అలా అలా ఆ తర్వాత జావా/ఎజ్డీ బైక్‌కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ప్రస్తుతం నాకు వ్యక్తిగతంగా 10 మా కుటుంబ సభ్యులకు 15 వరకూ బైక్స్ అవే ఉన్నాయి’ అంటూ చెప్పారు సుజాత్ అలీ ఖాన్. ఇంకా ఆయన తన అభిరుచి గురించి ఇలా పంచుకున్నారు. సౌండ్.. స్పెషల్.. జావా/ఎజ్డీలు 2 స్ట్రోక్ బైక్. రెండు సైలెన్సర్స్ ఉంటాయి. దాని సౌండ్ వల్లే జావాకి ఆ పేరొచ్చింది. మోటార్ సైకిల్ ర్యాలీల్లో(పోటీల్లో) దీన్ని బాగా వాడేవారు. జీవితాంతం ఒకటే బైక్‌కి నేను కట్టుబడి ఉన్నాను. నా దగ్గర ఉన్నవాటిల్లో 1961 జావా ఖరీదైనది. దాని ట్యాంక్ మీద బ్యాటరీ ఛార్జింగ్ చేసే యాంపియర్ మీటర్ ఉంటుంది. దాని తర్వాత వచ్చే వాటిలో అది లేదు. నా జీవితంలో ఎన్నో వేల కిలో మీటర్లు జావా మీద ప్రయాణించాను. కానీ తనివి తీరదు. అదేమిటో... 3 బెడ్రూమ్ల మా ఇంట్లో 2 బెడ్ రూమ్స్ పూర్తిగా బైక్స్‌కే కేటాయించాను. నెలవారి నిర్వహణ కూడా ఖరీదే. మా బైక్స్ కోసం ఒక ప్రత్యేకమైన మెకానిక్ కూడా ఉన్నాడు. -
షో అదుర్స్
బైక్ కంపెనీ ఉత్పత్తుల ప్రమోషన్ వర్క్‌లో భాగంగా ఓ ప్రైవేట్ సంస్థ జిల్లా కేంద్రం అనంతపురంలో శనివారం నిర్వహించిన స్టంట్ షో యువతను ఆకట్టుకుంది. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బైక్ స్టంట్ చేయడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన యువకులు అందరూ చూస్తుండగా పలు విన్యాసాలు చేశారు. అదే సమయంలో అప్రమత్తంగా లేకపోతే జరిగే అనర్థాలను కూడా షోలో భాగంగా కిందపడి చూపారు. యువకుల సాహస విన్యాసాలను చూసేందుకు పలువురు ఎగబడ్డారు. - సాక్షి పొటోగ్రాఫర్, అనంతపురం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్‌దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
Advertisement