-
ఏసీబీ కనుసన్నల్లో రేవంత్ కుమార్తె నిశ్చితార్థం
* ఏపీ సీఎం చంద్రబాబు సహా మంత్రుల హాజరు * మీడియాకు అనుమతి నిరాకరణ * బెయిల్ గడువు ముగిసిన అనంతరం జైలుకు రేవంత్ సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కోర్టు ఆదేశాల మేరకు గురువారం 12 గంటలపాటు బెయిల్‌పై బయటకు వచ్చి తన కుమార్తె నైమిషరెడ్డి నిశ్చితార్థంలో పాల్గొన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమం ఏసీబీ అధికారులు, పోలీసుల కనుసన్నల్లోనే జరిగింది. మీడియాను కార్యక్రమానికి హాజరు కానీయలేదు. కేవలం కెమెరాలను మాత్రమే కాసేపు అనుమతించి బయటకు పంపారు. ఉదయం 6 గంటలకు చర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చిన రేవంత్... పోలీస్ ఎస్కార్ట్ అనుసరించగా పార్టీ నాయకులు, అభిమానుల కోలాహలం మధ్య జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం 8 గంటలకు భార్య గీత, కుమార్తెతో కలసి నిశ్చితార్థ వేదికకు చేరుకొని 10 గంటల వరకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ నిశ్చితార్థానికి హాజరైన అతిథులను పలకరిస్తూ గడిపారు. నిశ్చితార్థానికి హాజరైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు దంపతులు, లోకేశ్, సినీ నటుడు బాలకృష్ణ.. రేవంత్‌రెడ్డి దంపతులు, నిశ్చితార్థం జరుగుతున్న నైమిష, సత్యనారాయణరెడ్డిలతో ఆత్మీయంగా గడిపారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఏపీ మంత్రులు దేవినేని ఉమ, పుల్లారావు, అయ్యన్నపాత్రుడు, పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, వివేక్, గాంధీ, సండ్ర వెంకట వీరయ్య, బి.కె. పార్థసారథి, కాంగ్రెస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, దానం నాగేందర్, విష్ణువర్ధన్‌రెడ్డి, బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సినీనటి కవిత తదితరులు హాజరై రేవంత్ కుమార్తెను ఆశీర్వదించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేసిన రేవంత్... 3 గంటలకు తిరిగి నివాసానికి చేరుకున్నారు. గంటసేపు కుటుంబ సభ్యులతో గడిపిన రేవంత్‌రెడ్డి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బెయిల్ గడువు ఉండటంతో ఆలోపే తిరిగి చర్లపల్లి జైలుకు వెళ్లారు. -
'బాస్' పక్కన రేవంత్
హైదరాబాద్ : ఎట్టకేలకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి 'బాస్' పక్కన కూర్చున్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్టయి తాత్కాలిక బెయిల్‌పై విడుదలైన రేవంత్ రెడ్డి తొలిసారిగా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. తన కుమార్తె నిశ్చితార్థానికి వచ్చిన చంద్రబాబు పక్కన రేవంత్ రెడ్డి కూర్చున్నారు. అయితే వాళ్లిద్దరూ చిరునవ్వు నవ్వడమే తప్ప...పలకరించుకోలేదు. కాగా రేవంత్ రెడ్డికి 12 గంటల పాటు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు ఈ సందర్భంగా ఆయనకు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. బెయిల్ మీద బయట ఉన్న సమయంలో మీడియాతోనూ, రాజకీయ నాయకులతోనూ రేవంత్ కలవకూడదని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయరాదని, దర్యాప్తుకు ఆటంకం కలిగించరాదని సూచించింది. విచారణకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేయరాదని స్పష్టం చేసింది. దాంతో కోర్టు నిబంధనల ప్రకారం రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి వచ్చిన అతిథులను పలకరించలేకపోయారు. మరోవైపు సివిల్ డ్రెస్‌లో ఏసీబీ అధికారులు నిఘా కొనసాగింది. రేవంత్ కదలికలపై వారు దృష్టి పెట్టారు. బెయిల్ మంజూరు చేస్తాం, కానీ రేవంత్ కదలికలపై నిఘాకు అనుమతించాలన్న ఏసీబీ విజ్ఞప్తిని కోర్టు ఆమోదించిన విషయం తెలిసందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్‌రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్‌కు సర్వం సిద్ధం
ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement