-
దీపావళికి మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి ఇలా..
దీపావళి అంటే దీపాల పండుగే కాదు, ఇళ్లువాకిళ్లను శుభ్రం చేసి, ఇంటిని చక్కగా సర్దుకోవడం కూడా. ఇంటిని సర్దే క్రమంలో అందంగా అలంకరించుకోవడం కూడా ఈ పండగ సమయంలో చేసే ముఖ్యమైన పని. ఎంత అనుకున్నా ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఇంటిని డెకరేట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా ఏం పర్లేదు.. చిన్నచిన్న ఐడియాలు, చిట్కాలతో మీ ఇంటిని క్షణాల్లో అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో చూడండి. ►గాజు, రాగి, ఇత్తడి వెడల్పాటి పాత్రలో నీళ్లుపోసి తాజాపువ్వులతో నింపేయాలి. పూలమధ్యలో దీపాలను వెలిగించాలి. ఈ పాత్రను గుమ్మానికి ఎదురుగా, డోర్ పక్కన పెడితే చాలా అందంగా ఉంటుంది. ► ఇంటి గుమ్మం పెద్దగా ఉన్నట్లయితే సంప్రదాయబద్ధంగా అలంకరించాలి. గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులను పూలతో అలకరించి మధ్యలో దీపాలు పెట్టాలి. ఈ రంగవల్లుల పైన వేలాడే ల్యాంప్స్‌ను వెలిగిస్తే ఇంటి గుమ్మం కళకళలాడిపోతుంది. ► వివిధ రంగులతో మెరిసిపోయే చీరలు చున్నీలను గ్లాస్ విండో, డోర్లకు కర్టెన్స్లా పెట్టాలి. ఈ చీరలపైన సన్నని లైటింగ్ దండలను వేలాడదీయాలి. గది మధ్యలో సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిస్తే ఇల్లు మరింత కాంతిమంతంగా మారుతుంది. ► గుమ్మం ముందు, హాల్లో వేసే ముగ్గుని రెండు మూడు రకాల పువ్వులతో వేయాలి. ఈ ముగ్గు మధ్యలో మట్టిప్రమిదలు, సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ పెట్టి వెలిగించాలి. ► ఇంటిముందు పెద్దగా స్థలం లేనప్పుడు డోర్ పక్కనే ఉన్న గోడ మూలనుంచి దీపాలు పెట్టాలి. వీటిచుట్టూ పూలతో ఆలంకరించాలి. ఇవి ఇంటిని మరింత అందంగా చూపిస్తాయి. ► మార్కెట్లో దొరికే వివిధ రకాల వేలాడే దీపాలను వెలిగిస్తే చీకట్లో సైతం ఇల్లు కాంతులీని, పండుగ వాతావరణం కనిపిస్తుంది. ► గోడలకు వేలాడదీసే రంగురంగుల డెకరేషన్ వస్తువులు మార్కెట్లో చాలా కనిపిస్తాయి. కలర్‌ఫుల్ పూసలు, దారాలు, రంగురంగుల మెరిసే క్లాత్‌తో చేసిన, గంటలతో వచ్చే అలంకరణ వస్తువులను గోడకు వేలాడదీసి, కింద మట్టి దీపాలతో అలంకరిస్తే ఇల్లు కళకళలాడిపోతుంది. ► వీటిలో ఏదీ చేసే సమయం లేకపోతే మార్కెట్లో దొరికే చెక్క, యాక్రాలిక్ ల్యాంప్స్ కొనుక్కోని... కిటికీలు, గ్యాలరీలోవేలాడదీస్తే మీ ఇంటి దీపావళికి కళ వస్తుంది. ఇంకెందుకాలస్యం మీ ఇంటికి నప్పే విధంగా సింపుల్ డెకరేషన్ ప్రయత్నాలు మొదలుపెట్టండి. -
పెయింట్ల బిజినెస్‌కు గ్రాసిమ్ సై
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ పెయింట్ల బిజినెస్‌పై దృష్టి పెట్టింది. ప్రధానంగా డెకొరేటివ్ విభాగంలో పట్టు సాధించాలని యోచిస్తోంది. అత్యధిక వృద్ధికి వీలున్న ఈ విభాగంలో దేశంలోనే నంబర్ టూ కంపెనీగా ఆవిర్భవించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణరంగ మెటీరియల్స్ సరఫరాకు కొత్తగా ప్రవేశించిన బీటూబీ ఈకామర్స్ బిజినెస్‌కు జతగా పెయింట్ల బిజినెస్‌ను పెంచుకోవాలని ప్రణాళికలు వేసింది. పరివర్తన దశ వృద్ధిలో భాగంగా రెండు కొత్త బిజినెస్‌లవైపు దృష్టి సారించినట్లు కంపెనీ వార్షిక సమావేశంలో చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పేర్కొన్నారు. దిగ్గజాలతో పోటీ గతేడాది పెయింట్ల బిజినెస్‌పై పెట్టుబడి ప్రణాళికలను సవరిస్తూ గ్రాసిమ్ రెట్టింపునకు పెంచింది. వెరసి రూ. 10,000 కోట్లను పెయింట్ల బిజినెస్‌పై వెచ్చించేందుకు సిద్ధపడుతోంది. తద్వారా మార్కెట్లో ఇప్పటికే విస్తరించిన పెయింట్స్ తయారీ దిగ్గజాలు ఏషియన్, బెర్జర్, కన్సాయ్ నెరోలాక్, ఆక్జో నోబెల్ ఇండియా తదితరాలతో పోటీకి తెరతీయనుంది. ప్రణాళికలకు అనుగుణంగా ఆరు సైట్లలోనూ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నట్లు బిర్లా పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) నాలుగో త్రైమాసికానికల్లా ప్లాంట్లు ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. పరిశోధన, అభివృద్ధి యూనిట్ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లు తెలియజేశారు. డెకొరేటివ్ పెయింట్ల విభాగంలో నంబర్ టూ కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంతో ఉన్నట్లు వాటాదారులకు బిర్లా తెలియజేశారు. గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 4,307 కోట్లు వెచి్చంచగా.. వీటిలో రూ. 1,979 కోట్లు పెయింట్ల బిజినెస్‌కు కేటాయించినట్లు వివరించారు. దేశీ పెయింట్ల బిజినెస్ ప్రస్తుత రూ. 62,000 కోట్ల స్థాయి నుంచి రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్లకు చేరనున్నట్లు కొన్ని నివేదికలు అంచనా వేశాయి. ఇటీవల గ్రాసిమ్తోపాటు.. జేఎస్‌డబ్ల్యూ, పిడిలైట్ సైతం పెయింట్ల బిజినెస్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. వారాంతాన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేరు బీఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 1,775 వద్ద ముగిసింది. -
Diwali 2022: అరవిరిసిన కాంతులు.. పండుగ వేళ ఇంటిని ఇలా అలంకరించండి!
దీపపు కాంతులతో కూడిన పూల పరిమళాలు దీపావళి అందాన్ని పెంచి ఆనందం మిన్నంటేలా చేస్తాయి. పండుగరోజు ఇంటి అలంకరణలు చేయడం సాధారణమే కాని దానికి కొంచెం కళాత్మకత జోడిస్తే దీపావళి రోజు ఇల్లు గ్రాండ్ లుక్‌తో అదిరిపోతుంది. ఈ సరికొత్త అలంకరణ ఐడియాలపై ఒక లుక్... 1. దీపావళి అంటే తీపి లేకుండా జరగదు కదా! కుటుంబ సభ్యులందరూ కలసి తీపిని పంచుకునే డైనింగ్ టేబుల్ అలంకరణ ఇలా ఉంటే... 2. ఈ అలంకరణకు సమయం ఎక్కువే పట్టొచ్చు కాని మీ ఇంటి దీపావళిని ప్రత్యేకంగా మారుస్తుందనడంలో సందేహం లేదు. 3. చూడటానికి హాయిగా ఎంత బావుందో కదా! శ్రద్ధ తీసుకుని చేసే ఈమాత్రం చిన్న అలంకరణ చాలు ఇంటికి అద్భుతమైన అందం చేకూరడానికి! 4. వివిధ ఆకారాల్లో ఉండే వేలాడే దీపాలంకరణకు పూల సొబగులు అద్దితే కనులకు భలే విందు! 5. చూడటానికి ఎటువంటి హడావిడి లేకున్నా ప్రశాంతమైన భావనను కలిగించాలంటే అరటాకులలో దీపాలు పరిచి ఆహ్లాద దీపావళిని ఆహ్వానించండి. 6. కాదేదీ అలంకరణకు అనర్హం. ఇంట్లో పడున్న వాటితోనూ అందం తేవొచ్చు. గోడ మీద బొమ్మను చిత్రించి చిన్న వెదురు తట్టల్లో దీపాలు పెట్టి ఇంట్లో ఉన్న నిచ్చెనకి పూల అలంకరణలు చేస్తే చాలు.. -
ఎకో-ఫ్రెండ్లీ, ట్రెండీ లుక్‌లో మీ ఇంటికి దీపావళి కళ కావాలంటే!
సాక్షి, హైదరాబాద్: దీపావళి వేళ మీ ఇంటి శోభను రెట్టింపు చేయాలంటే ఇల్లును, ఇంట్లోని వస్తువులను శుభ్రం చేయడమే కాదు.. చిన్న చిన్న మెళకువలతో ట్రెండీ లుక్ తీసుకురావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ అలంకరణ స్థానంలో ట్రెండీ లుక్ రావాలంటే ఎక్స్టీరియర్, ఇంటీరియర్ రెండు చోట్లా డెకరేటివ్ చేస్తే ఎకో-ఫ్రెండ్లీ దీపావళిగా మారుతుందంటున్నారు. ♦ సంప్రదాయమైన దీపాంతులు, కొవ్వొత్తులకు కాలం చెల్లింది. వీటి స్థానంలో సిరామిక్ లేదా మార్బుల్ పళ్లెంలో మట్టి దీపాంతలను వెలిగించండి. వీటిని హాల్, పూజ గదిలో పెట్టండి. డిస్కౌంట్ ధరల్లో వినూత్న డిజైన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరింత సృజనాత్మకత కావాలంటే బంగారపు వర్ణం ఉండే ఎలక్ట్రిక్ దీపాంతలు కూడా లభ్యమవుతాయి. ♦ ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు బహుళ రంగుల లైట్లు, పోర్టబుల్ లైట్లు, లాంతర్లు వంటి వినూత్న లైటింగ్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వైర్లెస్ ఉత్పత్తులు కావటంతో మొబైల్‌తో మనకు ఎంత కావాలంటే అంత కాంతి స్థాయి, రంగులను ఎంపిక చేసుకోవచ్చు. ఇంటి ప్రధాన ద్వారం, మెయిన్ ఎంట్రెన్స్ లేదా భవనం మీద ఓం, స్వస్తిక్ వంటి చిహ్నాలను పెట్టుకోవచ్చు. ఇవి ఎల్ఈడీ లైట్లతో తయారు చేసిన ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ♦ రంగు రంగుల బాటిల్స్‌లో కొవ్వొత్తులను పెట్టి గోడల మూలల్లో లేదా ప్రధాన ద్వారానికి ఇరు వైపులా, ఇంటి చుట్టూ వేలాడదీయవచ్చు. దీంతో ఇల్లు రకరకాల వర్ణాల్లో అందంగా దర్శనమిస్తుంటుంది. ♦ మట్టి దీపాంతలు, లాంతర్లకు బదులు అకార్డియన్ పేపర్ లాంతర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి పగటి పూట సూర్యరశ్మిని సేకరించి.. రాత్రి సమయాల్లో ప్రకాశిస్తాయి -
వాటితో డిజైన్.. ఇంటిని ప్యాలస్‌లా మార్చండి!
ఆకాశంలో విరిసే హరివిల్లుతో పాటు అక్కడ ఉండే మబ్బులు, తారలు, చందమామ.. అన్నీ మన ఇంటి రూఫ్ మీద కనువిందు చేస్తుంటే ఎంత అందంగా కనిపిస్తుందో కదా! ‘ఆ హంగులన్నీ ఏ ప్యాలెస్‌లోనో కనిపిస్తాయి.. మన ఇళ్లకు అంత సీన్ లేదు’ అని అనుకోనక్కర్లేదు. ఇప్పుడు ఆ ప్యాలెస్ స్టైల్ ట్రెండ్‌లోకి వచ్చేసింది. సీలింగ్ స్టిక్కర్‌తో మనిళ్లనూ అలా అలంకరించుకోవచ్చు. గది గదికో తీరు లివింగ్ రూమ్ గ్రాండ్‌గా కనిపించే స్టిక్కర్ డిజైన్స్‌లో అడవి అందాలు, వన్యమృగాలు, పువ్వుల చందాలతో సీలింగ్ సిత్రాలు కనువిందు చేస్తున్నాయి. బెడ్రూమ్లో చుక్కల ఆకాశాన్ని, సముద్రపు సొగసును దించేస్తున్నాయి. ఎలాంటి ఆర్భాటాలూ వద్దూ అనుకునేవారికి సింపుల్ చిత్రాలూ ఉన్నాయి. మది మెచ్చిన జోరు కార్లు, విమానాలు.. ఏవి కోరుకుంటే అవి సీలింగ్‌కి అతికించేసి ముచ్చట తీర్చేసుకునే రోజు వచ్చేసింది. లైట్లు ఆర్పేస్తే తళుక్కున చుక్కలు మెరిసేలా రూఫ్ డిజైన్ చేయించుకునేవారు ఇదివరకు. ఇప్పుడు ఇది కాస్త అడ్వాన్స్ అయ్యి ఏకంగా ఆకాశాన్నే ఇంటి పైకప్పుకు కట్టేసుకుంటున్నారు ఈ రూఫ్ స్టిక్కర్స్‌తో. సీలింగ్ ఆర్ట్ యాంటిక్ థీమ్‌నూ రూఫ్ మీద పరచవచ్చు. దాని కోసం ఎంపిక చేసుకున్న డిజైన్‌ను వాల్ ఆర్ట్‌లాగే రూఫ్ మీదా ఆర్ట్‌గా వేయించుకోవచ్చు. కార్టూన్ హుషారు పిల్లల బెడ్రూమ్లలో పాలపుంతనే కాదు కామిక్ రూపాలనూ కనువిందుగా డిజైన్ చేయించవచ్చు. ఇందుకు సులువైన ఎంపిక సీలింగ్ స్టిక్కర్సే! పిల్లలకు ఇష్టమైన కామిక్ క్యారెక్టర్లు, బొమ్మల చిత్రాలు, కార్ల జోరు.. వగైరా రూఫ్ పేపర్స్ జాబితాలో ఉన్నాయి. రూ.200 నుంచి లభించే ఈ సీలింగ్ స్టిక్కర్స్‌తో ఇంటి రూపాన్నే మార్చేయచ్చు. కొంచెం బోర్ కొట్టిన ఇంటి రొటీన్ డిజైన్ నుంచి ‘వావ్’ అనిపించేలా క్రియేట్ చేయచ్చు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్‌లు!
Advertisement