-
రాణుల పూదోట!
3సముద్ర అలల తాకిడిలో సేదతీరుతున్న మత్స్యకన్య.. కనుచూపు మేర ఆకుపచ్చని పసరిక, మధ్య మధ్యలో చెట్లు.. తపస్సులో లీనమైన తథాగతుడి ప్రసన్న వదనం.. అందమైన కోట, దాని చుట్టూ తోట. ఆ తోటలో నీటి కొలను. కొలనుపై చెక్క వంతెన. వంతెన ఆవల పక్షుల గూడు. ఆ పక్షులను పలకరించే యువరాణి.. విశాలమైన ప్రాంగణంలో చక్కటి ఇల్లు, కారు, మనసున మనసై నిలిచిన ఓ ప్రేమజంట. ఇది మీ కల అయితే.. ఆ కలను తమ కళతో ఓ రూపమిచ్చి మీ ముందుకు తీసుకువస్తారు. మీ వృత్తిని, ఆసక్తిని, మీ కళ్ల ముందు నిలుపుకోవాలనుకునే కలలను, చిత్రాలను మీరు కోరుకున్నట్లుగా డెస్క్‌టాప్ గార్డెన్‌గా మలిచి అందిస్తారు నగరానికి చెందిన రాణి పూదోట, రాణి నరిశెట్టి. మొక్క పెంచితే కలిగే తృప్తిని, ఒత్తిడి నుంచి కలిగే ఉపశమనాన్ని గ్రహించిన వీరు డెస్క్‌టాప్ గార్డెనింగ్‌ను వీలైనంత ఎక్కువ మందికి చేరువ చేయాలనుకుంటున్నారు. ఎలాంటి వాతావరణంలోనైనా తట్టుకొని పెరిగే గట్టి మొక్కలను మినియేచర్ గార్డెనింగ్‌లో వాడతారు. ఆఫీస్‌లో, ఇంట్లో కిటికీ, బాత్రూమ్, స్టడీ టేబుల్ ఎక్కడైనా వీటిని పెట్టుకోవచ్చు. వారం పది రోజులు ఊరు వెళ్లినా బతికే తత్వం ఉన్న గట్టి మొక్కలతోనే ఈ గార్డెన్స్ రూపొందిస్తున్నారు. సన్సెవేరియా, గోల్డెన్ పాతోస్, అలోవెరా, బ్రయోఫిలం, క్రిప్టాంతస్, జమీయా లాంటి మొక్కలు తక్కువ నీరు, వెలుతురు, గాలి ఉన్నా బతికేస్తాయి. ఈ మొక్కలు గదిలో గాలిని శుద్ధి చేస్తాయి. రాత్రిళ్లు కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయవు. కలలకు రూపం.. చిన్నపిల్లలు ఫెయిరీ, కార్టూన్ క్యారెక్టర్లు, మగపిల్లలు ఆటలు, పెద్ద వాళ్లు మెడిటేషన్ గులక రాళ్లు కూడా లేకుండా మట్టి మాత్రమే ఉండేలా కావాలని కొందరు, రాధాకృష్ణులు, సంగీతం, ఆటలు, వృత్తులు, సందర్భాలు ఇలా రకరకాల థీంస్తో మినియేచర్ గార్డెన్లు రూపొందిస్తున్నారు. పార్టీల్లో 3, 4 వందల రూపాయల గిఫ్ట్ ఇచ్చే బదులు ఈ డెస్క్‌టాప్ గార్డెన్స్ ఇస్తే బాగుంటుందంటున్నారు రాణి పూదోట, రాణి నరిశెట్టి. ఇష్టంగా చేశాం.. నేను గృహిణిని. సైన్సు సబ్జెక్ట్ చదువుకున్నా. మొక్కల పెంపకంపై ఆసక్తి. మినియేచర్ గార్డెనింగ్ సింపుల్‌గా స్టార్ట్ చేశాం. కస్టమైజ్డ్ గార్డెన్ల నుంచి పార్టీ రిటర్న్ గిఫ్ట్ బల్క్ ఆర్డర్ల వరకు చేస్తున్నాం. – రాణి పూదోట స్వానుభవంతో.. నేను ఐటీ ఉద్యోగిని. ప్రతి ఉద్యోగంలో, ప్రతి ఒక్కరి జీవితంలో స్ట్రెస్ తప్పదు. నా టేబుల్ మీద ఈ చిట్టి గార్డెన్ ఉంటుంది. కాసేపు ఈ మొక్కలను చూస్తే ఎంతో రిలాక్స్డ్గా అనిపిస్తుంది. మనం పెంచే మొక్కకి ఒక ఆకు, కొమ్మ, పువ్వు వచ్చినా కలిగే ఆనందమే వేరు. – రాణి నరిశెట్టి -
మట్టిపూల పరిశ్రమ వాడని పూలతోరణం!
మీరే పారిశ్రామికవేత్త ప్రకృతి స్ఫూర్తితో నింగికెగిరి, నీటిలో ప్రయాణించిన మనిషి, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కదానినీ తాను కూడా చేసి చూసి మురిసిపోవాలనుకుంటాడు. చిత్రకళ, శిల్పకళ అలా రూపుదిద్దుకున్నవే. తాజాగా మార్కెట్ పరిభ్రమణం క్లే ఆర్టికల్స్ మీదకు మళ్లింది. క్లే ఆర్టికల్స్ తయారీ పరిశ్రమను స్థాపించాలంటే... ఈ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా కొనాల్సిన వస్తువులు పెద్దగా ఉండవు. ఇంట్లోనే ఒక గది దీని కోసం కేటాయించుకోవచ్చు. టేబుల్, కుర్చీల వంటివి ఇంట్లో ఉన్నవే వాడుకోవచ్చు. ప్రత్యేకించి పరిశ్రమ కోసం కొనాల్సినవి... ఆర్ట్ క్లే, ఫుడ్ కలర్స్, డిస్పోజబుల్ గ్లాసులు (ఫ్లవర్‌పాట్ తయారీకి), అప్పడాల కర్ర (ఆర్ట్ క్లేని మృదువుగా చేసుకోవడానికి), ప్లాస్టిక్ టూత్ పిక్స్ (పూలకు కాడలుగా, ఫ్రేమ్‌లో చక్కగా గుచ్చుకోవడానికి), పెన్, స్కెచ్ పెన్, ఐవరీ కార్డు (గ్రీటింగ్ కార్డు తయారీ కోసం), గ్లాస్ పలకలు (ఆక్రిలిక్ పలకలు కూడా వాడవచ్చు), ఫెవికాల్, అల్యూమినియం ఫాయిల్ వంటివి సరిపోతాయి. ఒక మహిళ నెల రోజుల పాటు ఇంట్లో ఈ పూలు, బొమ్మలు తయారు చేసుకోవడానికి ఇరవై కిలోల ఆర్ట్ క్లే తీసుకుంటే సరిపోతుంది. ఈ కుటీర పరిశ్రమ స్థాపించడానికి ఖర్చు పాతిక వేల రూపాయలకు మించదు. ఇంట్లో ఉత్పత్తి చేసుకుని, ఆ వస్తువులను బయట మార్కెట్ చేసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని చెప్పిన వివరాలివి. ఒక మోస్తరు షో రూమ్ పెట్టాలంటే దానికోసం అద్దె, సహాయకుల జీతాల వంటివి అదనంగా ఉంటాయి. ఏమేం చేయవచ్చు? ఆర్ట్ క్లేతో ఇరవై రకాల పూలు చేయవచ్చు. చిట్టిపూలతో దండలు, బ్రేస్లెట్లు, తోరణాలు, పెద్ద పూలతో వాల్ హ్యాంగింగ్స్, సీనరీలు, గ్రీటింగ్ కార్డులు, ఫ్ల్లవర్ వాజులు, ఫ్లవర్ బొకేలు, పెన్‌స్టాండులు చేయవచ్చు. బీడ్స్ వరుసలతో ముందు గదికి, డైనింగ్ హాల్‌కి మధ్యలో పార్టిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. దేవుడి విగ్రహాలకు, పెద్దవాళ్ల ఫొటోలకు హారాలు చేయవచ్చు. శిల్పాలు కూడా చక్కగా రూపుదిద్దుకుంటాయి. మార్కెట్ స్థితిగతులు... పెన్ స్టాండులు, చిన్న పూల తోరణాలకు మంచి గిరాకీ ఉంటోంది. పువ్వు రెండు రూపాయల చొప్పున ఎంత పొడవు కావాలంటే అంత తోరణం కట్టించుకోవచ్చు. గ్రీటింగ్ కార్డు 50 రూపాయలకే దొరుకుతుంది. ఆర్ట్ క్లే పూలతో చేసిన చిన్న వాల్ హ్యాంగింగ్ రూ 350 నుంచి మొదలవుతుంది. పెద్దవి ఉడెన్ ఫ్రేమ్ కట్టిన వాల్ హ్యాంగింగ్ ధర ఐదువేల వరకు ఉంటుంది. శిక్షణ, రిజిస్ట్రేషన్ వివరాలకు... 1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించవచ్చు. ‘ఎలీప్’ ఇచ్చిన వివరాలతో... రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి స్వయం సమృద్ధి సాధించాలనే ఆసక్తి ఉంటే చాలు... ప్రభుత్వం... ఎం.ఎస్.ఎం.ఇ. (మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్), ఎన్.ఎస్.ఐ.సి. (నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్), ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోంది. ఎలీప్ వంటి సంస్థల సమన్వయంతో శిక్షణ, పరిశ్రమ స్థాపన, ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. జిల్లాల్లో సదస్సులు పెట్టి శిక్షణనిస్తున్నాం. శిక్షణ పూర్తయిన బృందానికి, కొత్తగా శిక్షణ తీసుకున్న బృందానికి మధ్య సంధానకర్తగా ఉంటూ ఒకరి అనుభవాలను మరొకరు అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తున్నాం. శిక్షణలో నైపుణ్యం పెంచుకుంటే ఉద్యోగం లేదా పరిశ్రమ స్థాపన పట్ల ధైర్యం వస్తుంది. ఒకరుగా చేయలేని పరిశ్రమలైతే ఐదారు మంది బృందాలుగా ఏర్పడి (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) పరిశ్రమ స్థాపించవచ్చు. కుటుంబ కారణాల వల్ల ఇవేవీ చేయడం సాధ్యం కాని మహిళలు పరిశ్రమల వారికి అవుట్ సోర్సింగ్ ద్వారా పని చేసి తగిన వేతనం (పీస్ లెక్కన) తీసుకోవచ్చు. - పంకజ్ శ్రీనివాసన్, మేనేజర్, ఎంప్లాయ్మెంట్ కో ఆర్డినేటర్ ఫోన్: 8886665904 pankaj.textmin@gmail.com
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement