-
మాట్లాడే నేస్తం..మానవ పుస్తకం..
అక్కడ పుస్తకాలు మాట్లాడతాయి.. తమలోని సారాన్ని వినిపిస్తాయి.. విశేషాలను వివరిస్తాయి.. జ్ఞానాన్ని అందిస్తాయి.. జీవిత గాథలను కళ్లకు కడతాయి.. సందేహాలను నివృత్తి చేస్తాయి.. అవే మానవ పుస్తకాలు. కొత్తగా ఉంది కదూ! అవును.. నగరంలో నయాట్రెండీ హ్యూమన్ లైబ్రరీ. ఈ లైబ్రరీ సిటీలో సంచరిస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, పాఠకుల చెంతకే వచ్చేస్తోంది. మరో ప్రదర్శనకు సిద్ధమవుతోన్న ‘హ్యూమన్ లైబ్రరీ’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, సిటీబ్యూరో: ప్రతి ఒక్కరికీ కొన్ని పరిధులు, పరిమితులు ఉంటాయి. తమకు తెలిసినవే నిజమని భావిస్తారు. వాస్తవాలను తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉండదు. ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి బాధను, జీవితాన్ని అర్థం చేసుకోవడంలో అందరికీ ఒకే విధమైన అభిప్రాయాలు ఉండకపోవచ్చు. సమాజంలో ‘గే’లుగా ముద్రపడిన వ్యక్తులపై భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అలాగే సరిహద్దుల్లో జరిగే యుద్ధాల వాస్తవిక విశేషాలు అందరికీ తెలియకపోవచ్చు. గృహహింసను ఎదుర్కొనే మహిళ సమస్యలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసుకోవచ్చు. కొంతమంది వ్యక్తుల విజయగాథలు ఎంతో ఆసక్తిగా, స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇలాంటి అనేక రకాల విశేషాలను పుస్తకాల్లో చదివి తెలుసుకుంటాం. కానీ... ఆ వ్యక్తులే స్వయంగా తమ గురించి వివరిస్తే, అదే ‘హ్యూమన్ బుక్’ కాన్సెప్ట్. 100కు పైగా మానవ పుస్తకాలు.. ఇది మొట్టమొదట డెన్మార్క్‌లో మొదలైంది. రొన్నీ అబేర్గల్ ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. జాతి, కులం, మతం, ప్రాంతం, వివక్ష, లైంగికహింస, హ్యూమన్ ట్రాఫికింగ్, లైఫ్‌స్టైల్, ఊబకాయం తదితర అనేక అంశాలతో ‘హ్యూమన్ లైబ్రరీ’ ఆవిర్భవించింది. గతేడాది మార్చిలో హర్షద్, ఆయన మిత్రులు నగరంలో ‘హ్యూమన్ లైబ్రరీ’ ఏర్పాటు చేశారు. ఈ లైబ్రరీలో ప్రస్తుతం 100కు పైగా ‘హ్యూమన్ బుక్స్ (మానవ పుస్తకాలు)’ ఉన్నాయి. వివిధ అంశాలపై స్వచ్ఛందంగా మాట్లాడేవాళ్లను, తమ గురించి తాము చెప్పుకునే ఆసక్తి ఉన్నవాళ్లను సోషల్ మీడియా వేదికగా ఒక్క దగ్గరికి చేర్చారు. అలా ఏర్పడిన ఈ హ్యూమన్ లైబ్రరీ నగరంలో ప్రదర్శనలు నిర్వహిస్తోంది. లామకాన్, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, బ్రిటీష్ లైబ్రరీ తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు జరిగాయి. తాజాగా స్కూళ్లు, కాలేజీల్లోనూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. విభిన్నం.. వైవిధ్యం నగరంలో నిర్వహించే ‘హ్యూమన్ బుక్స్ ఎగ్జిబిషన్’లో వైవిధ్యమైన అంశాలు ఉంటాయి. ఒక అంతర్జాతీయ యాత్రికుడు ఇండో–ఆఫ్రికన్ సంబంధాల గురించి మాట్లాడతాడు. బ్రాహ్మణుడు ఉర్దూలో అనర్గళమైన ప్రసంగం చేస్తాడు. ఈ విభిన్న అంశాలకు తగినట్లుగానే పుస్తకాలకు శీర్షికలు పెట్టారు. బీయింగ్ ఏ డక్, బ్రేక్ ది సైలెన్స్ ఆన్ చైల్డ్ సెక్సువల్ హరాజ్మెంట్, ది సొజోర్నర్, డెఫ్ అండ్ మ్యూట్, ఓవర్‌కమింగ్ ఒబేసిటీ, వండర్ ఉమన్, యంగ్ పొలిటీషియన్, హోప్ అండ్ హ్యాపీనెస్, ది ప్రైజ్ ఆఫ్ స్మైలింగ్ తదితర ఉన్నాయి. ‘హ్యూమన్ లైబ్రరీ’ ప్రతినిధులు ఈ నెల 11న ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు హోటల్ గ్రీన్‌పార్కులో ‘ఔట్ ఆఫ్ ది బాక్స్’ హాల్లో హ్యూమన్ బుక్స్ ప్రదర్శన నిర్వహించనున్నారు. పాఠకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంపిక చేసుకొనే విధంగా ఇక్కడ కేటలాగ్ ఉంటుంది. ఎంపిక చేసుకున్న అంశంపై 30 నిమిషాలు హ్యూమన్ బుక్ (మనిషి) మాట్లాడుతుంది. -
మనిషే ఓ గ్రంథం...
పఠనాశైలి మహానగరాల నుంచి మారుమూల పట్టణాల వరకు గ్రంథాలయాలకు ఆదరణ అంతంత మాత్రంగా మారిన కాలం ఇది. యూనివర్సిటీ క్యాంపస్‌లలోని గ్రంథాలయాల దగ్గర యువ‘జన సమ్మర్దం’ కనిపించినా, వారందరూ చదివేది పోటీపరీక్షలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు మాత్రమే. కథ, నవల, కవిత్వం వంటి కాల్పనిక సాహిత్యానికి పాఠకులు కరువైపోయిన గడ్డుకాలం ఇది. ఇదంతా మన దేశంలోని పరిస్థితి. పాశ్చాత్య దేశాల్లో దృశ్యం మరోలా ఉంది. పుస్తకాల్లో ఉన్న విషయాలను మించి తెలుసుకోవాలనే ఉత్సుకత, జిజ్ఞాస గల పాఠకుల కోసం కొన్ని దేశాల్లో ఏకంగా మానవ గ్రంథాలయాలే (హ్యూమన్ లైబ్రరీస్) నడుస్తున్నాయి. మొట్టమొదటి మానవ గ్రంథాలయం డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో మొదలైంది. నగరంలోని హింసాకాండకు వ్యతిరేకంగా ప్రారంభమైన యువజన సంస్థ కొత్తగా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో 2000 సంవత్సరంలో దీనికి నాంది పలికింది. గడచిన పదిహేనేళ్లలో ఈ మానవ గ్రంథాలయాలు మరిన్ని దేశాలకు విస్తరించాయి. చాలా గ్రంథాలయాలు మామూలు పుస్తకాలతో పాటు మానవ గ్రంథాల సేవలనూ అందిస్తున్నాయి. ఇవి పూర్తిగా ఉచితం. గ్రంథాలుగా ఉండదలచుకున్న వారు నిర్ణీత వేళల్లో గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంటారు. ఆ సమయంలో పాఠకులు ఎవరైనా వారిని ‘చదవ’వచ్చు. అంటే, మరేమీ లేదు... గ్రంథాలుగా అందుబాటులో ఉన్నవారి వద్దకు వెళ్లి కూర్చుంటే చాలు, వారు తమ అనుభవాలను పాఠకులతో పంచుకుంటారు. ప్రస్తుతం హంగేరీ, రుమేనియా, ఆస్ట్రియా, ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, ఇటలీ, హాలండ్, స్లోవేనియా, బెల్జియం, పోర్చుగల్, ఆస్ట్రేలియా దేశాల్లో ఇలాంటి మానవ గ్రంథాలయాలు పాఠకులతో కళకళలాడుతున్నాయి. త్వరలోనే బ్రెజిల్, చైనా, కొలంబియా, సైప్రస్, మలేసియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement