-
ఆ క్యాచే కొంపముంచిందా?
-
ఆ క్యాచే కొంపముంచిందా?
హైదరాబాద్: ఐపీఎల్ ఫైనల్లో స్వల్ప లక్ష్యాన్ని సునాయంగా ఛేదిస్తుందని భావించిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్టు చివరికి ఓటమి పాలైంది. చేతుల్లోకి ఇచ్చిన మ్యాచ్‌ను చేజార్చుకుని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తన టీమ్ పరాజయంతో స్టీవ్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ వృధా అయింది. అర్ధసెంచరీతో చివరి ఓవర్ వరకు పోరాడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. కీలక సమయంలో అవుటవడంతో పుణే మూల్యం చెల్లించుకుంది. ఆఖరి ఓవర్లో పుణే విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతిని మనోజ్ తివారి చక్కటి ఫోర్‌గా మలిచాడు. తర్వాతి బంతికి అతడు అవుటయ్యాడు. అయితే స్మిత్ క్రీజ్‌లో ఉండడంతో పుణే విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. అప్పటికే అతడు ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కానీ పుణేకు మిచెల్ జాన్సన్ షాక్ ఇచ్చాడు. తివారి అవుట్ చేసిన తర్వాతి బంతికే స్మిత్‌ను పెవిలియన్‌కు పంపాడు. స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను అంబటి రాయుడు పట్టడంతో అతడు నిరాశగా మైదానాన్ని వీడాడు. ఈ క్యాచ్‌ను రాయుడు వదిలేసివుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ క్యాచ్ ఫలితాన్ని మార్చేసిందని అందరూ అభిప్రాయపడ్డారు. స్మిత్ అవుటైన తర్వాత పుణేపై ఒత్తిడి మరింత పెరిగింది. చివరి బంతికి 4 పరుగులు చేయాల్సిన పుణే రెండు పరుగులు మాత్రమే సాధించి ఓటమి పాలయింది. స్మిత్ ఉన్నంతసేపు పుణేవైపు ఉన్న మ్యాచ్ అతడు అవుటైన తర్వాత ముంబై చేతుల్లోకి వచ్చింది. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి రోహిత్ సేన మూడోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్‌నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement