-
హామిల్టన్‌కు పోల్
సింగపూర్: ఈ సీజన్లో ఏడో విజయంపై మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ దృష్టి పెట్టాడు. శనివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ దుమ్ము రేపాడు. అందరికంటే వేగంగా ల్యాప్‌ను ముగించి ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే ఆరు రేసుల్లో గెలిచిన హామిల్టన్ క్వాలిఫయింగ్ చివరి సెషన్లో ల్యాప్‌ను ఒక నిమిషం 36.015 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ రెండో స్థానాన్ని పొందగా... ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా 7, 9 స్థానాల నుంచి రేసును మొదలు పెడతారు. సీజన్లో 14 రేసులు పూర్తయ్యాక ప్రస్తుతం హామిల్టన్ 256 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉండగా... 226 పాయింట్లతో వెటెల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సాయంత్రం గం. 5.35 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
బొటాస్‌కు తొలి పోల్
వియన్నా: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ ఈ సీజన్లో తొలి పోల్ పొజిషన్ సంపాదించాడు. శనివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 03.130 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన హామిల్టన్ రెండో స్థానం నుంచి... ఫెరారీ డ్రైవర్ వెటెల్ మూడో స్థానం నుంచి రేసును మొదలు పెడతారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా 11వ, 17వ స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు. -
రోస్‌బర్గ్ ‘హ్యాట్రిక్’
మొనాకో గ్రాండ్‌ప్రిలో టైటిల్ సొంతం మోంటెకార్లో : నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న మొనాకో గ్రాండ్‌ప్రి రేసులో మెర్సిడెస్ రేసర్ నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచి అరుదైన ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. 65 ఏళ్ల చరిత్ర కలిగిన మొనాకో గ్రాండ్‌ప్రి రేసును వరుసగా మూడేళ్లు సాధించిన నాలుగో డ్రైవర్‌గా నిలిచాడు. గతంలో అయర్టన్ సెనా, అలైన్ ప్రాస్ట్, గ్రాహమ్ హిల్ మాత్రమే ఈ ఘనత సాధించారు. 78 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 49 నిమిషాల 18.420 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ-1:49:22.906) రెండో స్థానంలో నిలువగా... ‘పోల్ పొజిషన్’ నుంచి రేసును ఆరంభించిన హామిల్టన్ (మెర్సిడెస్-1:49:24.473) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో నిలువగా... మరో డ్రైవర్ హుల్కెన్‌బర్గ్ 11వ స్థానంలో నిలిచాడు. రేసులో 63వ ల్యాప్ వరకు హామిల్టన్ ఆధిక్యంలో ఉన్నాడు. ఈ దశలో చిన్నపాటి ప్రమాదం చోటు చేసుకోవడంతో సేఫ్టీ కారును రప్పించారు. అదే సమయంలో హామిల్టన్‌ను పిట్ స్టాప్‌లో ఆగాలని జట్టు ఆదేశించింది. అప్పటికే రెండో స్థానంలో ఉన్న రోస్‌బర్గ్, మూడో స్థానంలో ఉన్న వెటెల్ ముందుకు దూసుకుపోయారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్‌ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement