-
వివాహాబంధంలోకి అడుగుపెట్టిన ఎంఎస్ ధోని నటి!
ప్రముఖ బాలీవుడ్ నటి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఈ వేడుకలో స్విని ఖరా తన ప్రియుడిని పెళ్లాడింది. అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రంలో బాలనటిగా మెప్పించిన స్వీని ఖరా కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. జైపూర్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో ఉర్విష్ దేశాయ్‌తో ఏడడుగులు నడిచారు. ఈ విషయాన్ని నటి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పెళ్లికి సంబధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు పలువురు సినీతారలు కూడా హాజరయ్యారు. కాగా.. స్విని 2005లో విద్యాబాలన్ నటించిన పరిణీతతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. అదే ఏడాది టీవీ సీరియల్ బా బహూ ఔర్ బేబీలో కూడా నటించింది. అమితాబ్ బచ్చన్. టబు, పరేష్ రావల్ నటించిన చిత్రం చీనీ కమ్. ఈ చిత్రంలో స్వినీ ఖరా బాలనటుడిగా 'సెక్సీ' అనే పాత్రను పోషించింది. ఆ తర్వాత ఆమె జాన్ అబ్రహం చిత్రం ఎలాన్, హరి పుత్తర్, షాహిద్ కపూర్ నటించిన పాఠశాల, ఢిల్లీ సఫారి, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా ధరి కా వీర్ యోధా పృథ్వీరాజ్ చౌహాన్, దిల్ మిల్ గయే, సీఐడీ, జిందగీ ఖట్టి మీథీ వంటి షోలు చేసింది. ఆమె వృత్తిరీత్యా న్యాయవాది కాగా.. చదువుపై దృష్టి పెట్టేందుకు నటనకు స్వస్తి చెప్పింది. View this post on Instagram A post shared by Swini Khara (@swinikhara) -
క్రికెట్ నేపథ్యంలో హిట్ కొట్టిన సినిమాలు.. ఈ ఓటీటీలలో చూడొచ్చు
వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్ సత్తా చాటి మరికొన్ని గంటల్లో నేడు ఆస్ట్రేలియాతో ఫైనల్ ఫైట్‌కు రెడీ అయింది. లీగ్ దశలో పరాజయమే లేకుండా విజయ పరంపరతో కొనసాగిన భారత జట్టు.. అదే దూకుడుతో ఫైనల్ మ్యాచ్‌లోనూ వీర విజృంభణతో దూసుకెళ్లి కప్ సాధించాలని కోట్లాది మంది భారతీయులు ఆశిస్తున్నారు. అహ్మదాబాద్ వేదికగా నేటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు విద్యార్థులు, ఉద్యోగులూ, వ్యాపారులూ, సినీ సెలబ్రెటీలు తదితర క్రికెట్ క్రీడాభిమానులంతా సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కొన్ని సూపర్ హిట్ సినిమాలను గుర్తుచేసుకుంటున్నారు. ఆ సినిమాలో ఏ ఓటీటీలో ఉన్నాయో అని తెగ వెతుకుతున్నారు. సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ 2017లో 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' అనే చిత్రాన్ని జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వం వహించారు. భారతీయ త్రిభాషా డాక్యుమెంటరీ స్పోర్ట్స్ చిత్రంగా తెరకెక్కించారు. 200 నాటౌట్ ప్రొడక్షన్స్, కార్నివాల్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రవి భాగ్చంద్కా, శ్రీకాంత్ భాసీ నిర్మించారు . ఈ చిత్రం భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవితంపై రూపొందించిన డాక్యుమెంటరీ.ఇది టెండూల్కర్ క్రికెట్, వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా చూపించారు. అలాగే అతని జీవితంలో ఇంతకు ముందెన్నడూ వినని లేదా చూడని కొన్ని అంశాలను కూడా ఈ చిత్రంలో చూడవచ్చు. ఇందులో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్ కూడా కొన్ని సీన్స్‌లలో కనిపిస్తారు. ఈ చిత్రం చూడాలనుకుంటే సోనీ లైవ్‌లో అందుబాటులో ఉంది. MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ 2016లో MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రం విడుదలైంది. ధోని బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. నీరజ్ పాండే రచించి దర్శకత్వం వహించారు. భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగారూపొందించబడింది. ఈ చిత్రంలో MS ధోనిగా దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించారు , వీరితో పాటు దిశా పటానీ , కియారా అద్వానీ, అనుపమ్ ఖేర్ నటించారు. ఈ చిత్రం ధోని చిన్నప్పటి నుంచి జీవితంలోని అనేక సంఘటనల ద్వారా అతని జీవితాన్ని వివరిస్తుంది. ధోనీ అంగీకారంతో ఈ సినిమా మొదలైంది. 61 దేశాలలో ఈ సినిమా విడుదలైంది. వాణిజ్యపరంగా ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇది 2016లో అత్యధిక వసూళ్లు చేసిన ఐదవ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా రూ. 215.48 కోట్లు వసూలు చేసిన ఆరవ భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను చూడాలనుకుంటే.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉచితంగానే చూడొచ్చు. 800 ముత్తయ్య మురళీధరన్ 2023లో తెలుగులో ఈ సినిమా విడుదలైంది. శ్రీలంక స్టార్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమాకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా శ్రీదేవి మూవీస్ పై శివలెంక కృష్ణప్రసాద్ దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేశాడు. మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 6న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్స్ తీసిన ఏకైక బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్ ఉన్నారు. అందుకే ఈ చిత్రానికి 800 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. 'ఆజార్' 2016లో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా 'ఆజార్' అనే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టోనీ డిసౌజా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ద్వారా శోభా కపూర్, ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇమ్రాన్ హష్మీ టైటిల్ రోల్లో సూపర్‌గా మెప్పించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 13 మే 2016న విడుదలైంది . అజార్ జీవితంలో మ్యాచ్ ఫిక్సింగ్, వివాహేతర సంబంధం వంటి అంశాలపై కూడా ఈ చిత్రంలో క్లారిటీ ఇచ్చారు. అజార్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమాలో ఇవే ► నాని నటించిన జెర్సీ ZEE5లో స్ట్రీమింగ్ అవుతుంది. ► గోల్కోండ హైస్కూల్ (సన్‌నెక్ట్స్) ► కౌసల్య కృష్ణమూర్తి (సన్‌నెక్ట్స్) ► విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' (అమెజాన్,డిస్నీ హాట్‌స్టార్) ► నాగచైతన్య 'మజిలీ' (అమెజాన్ ప్రైమ్ వీడియో) ► వెంకటేష్ 'వసంతం' (డిస్నీ హాట్‌స్టార్) ► లగాన్ హిందీ (నెట్‌ఫ్లిక్స్) -
ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..!
-
ధోని బయోపిక్ రీరిలీజ్.. సుశాంత్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
దిగంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ 'ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్' స్టోరీ సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అలా ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాయి. చదవండి: అందుకే మేం విడాకులు తీసుకున్నాం.. నాగచైతన్య ఓపెన్ కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ నటించిన ఎంఎస్ ధోనీ సినిమాను రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 2016లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ ధోని పాత్రలో నటించగా, దిశా పటానీ, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ముందు, ఆ తర్వాత కూడా పలు క్రీడాకారుల బయోపిక్‌తో సినిమాలు వచ్చినా 'ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ' అంతగా ఏ సినిమా ప్రభావం చూపలేదు..వసూళ్లు సాధించలేదు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా నడుస్తుండటంతో అటు క్రికెట్, ఇటు సినీ అభిమానుల కోసం ఈ సినిమాను మే12న మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చదవండి: ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి Maahi phir aa raha hai!! M.S. Dhoni: The Untold Story Re-Releasing in cinemas on 12th May in Hindi, Tamil and Telugu#MSDhoniTheUntoldStory @msdhoni #sushantsinghrajput @starstudios_ @advani_kiara @DishPatani @AnupamPKher @bhumikachawlat pic.twitter.com/bOFtEaup4X — Ramesh Bala (@rameshlaus) May 4, 2023 -
నిశ్చితార్థం చేసుకున్న బాలీవుడ్ నటి.. పిక్స్ వైరల్
బాలీవుడ్లో పెళ్లిల్ల సందడి కొనసాగుతోంది. కొత్త ఏడాది ప్రారంభంలోనే కేఎల్ రాహుల్- అతియాశెట్టి, కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా జంటలు వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ నటి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. స్విని నిమేష్ ఖరా టీవీ షో బా బహూ ఔర్ బేబీలో కొంటె చైతాలి పాత్రకు గుర్తింపు తెచ్చుకుంది. 2007లో వచ్చిన అమితాబ్-టబు నటించిన చిత్రం చీనీ కమ్‌లో పోషించిన పాత్రకు ప్రసిద్ధి చెందింది. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్విని ఖరా నటించింది. ఈ చిత్రంలో బిగ్ బికి మంచి స్నేహితురాలిగా కనిపించింది. స్వినీ ఖరా సోషల్ మీడియా ద్వారా తన నిశ్చితార్థం అయినట్లు ప్రకటించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఇది చూసిన ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఆమె స్నేహితులతో పాటు అవికా గోర్, నవికా కోటియా నూతన జంటకు కంగ్రాట్స్ చెప్పారు. కాగా.. స్విని ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంలో భాగమైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ఈ చిత్రంలో స్వినీ.. జయంతి అనే పాత్రను పోషించింది. ఆమె బా బహూ ఔర్ బేబీ, దిల్ మిల్ గయే, సీఐడీ, జిందగీ ఖట్టి మీథీ వంటి టీవీ షోలలో కూడా పనిచేసింది. View this post on Instagram A post shared by Swini Khara (@swinikhara)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు..
కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement