-
బాబోయ్ చీకటి పడితే.. ఆ రోడ్డంటే భయం భయం
సాక్షి,సిరిసిల్ల(కరీంనగర్): సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులోని కలెక్టరేట్ బైపాస్‌రోడ్డుపై సాయంత్రం వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. వీధిలైట్లు వెలుగక ఎటూ చూసిన కారుచీకట్లే ఉండడం అఘంతకులకు కలిసొస్తుంది. ఆ రహదారిపై సాయంత్రం వాహనాల రాకపోకలు చాలా తక్కువగా ఉంటుండడంతో దుండగులకు అవకాశంగా మారింది. ఇటీవల తరచూ దా రిదోపిడీ ఘటనలు జరుగుతున్నాయి. గతంలో ఓ ద్విచక్రవాహనదారున్ని బెదిరించిన తీరు.. తాజాగా రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి బంగారం ఉంగరం ఎత్తకెళ్లడంతో స్థానికులు భయపడుతున్నారు. దారిపొడువున చీకటి సిరిసిల్ల బైపాస్ రోడ్డు మొత్తం అంధకారం అలుముకుంటుంది. సాయంత్రం వేళ ఆ రోడ్డుపై వాహనాల రద్దీ దాదాపు తగ్గిపోతుంది. కలెక్టరేట్, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం అదే దారిలో ఉన్నాయి. ఆయా కార్యాలయాలకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేక ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. విధులు ముగిసిన అనంతరం సాయంత్రం కాలినడకన వెళ్దామంటే వీధిదీపాలు లేక చీకటిగా ఉంటుంది. ఇదే ఆసరాగా చేసుకుని కొందరు పోకిరీలు వెకిలి చేష్టలు చేస్తుండగా, మరికొందరు దారికాచి దొంగతనాలు చేస్తున్నారు. వాహనాలపై వెంబడించి దారిదోపిడీలకు పాల్పడుతున్నారు. పోలీసులమని బెదిరింపులు జిల్లాలో పోలీసుల పేరు చెప్పి బెదిరించే సంస్కృతి ఊపందుకుంటోంది. రగుడు ఎల్లమ్మరోడ్డు నుంచి బైపాస్‌రోడ్డులో పలు సంఘటనలు జరిగాయి. జిల్లా ఆవిర్భవించిన ఏడాదికి భార్యభర్తలు బైక్‌పై వె ళ్తుంటే పోలీసులమని చెప్పి వాహనాన్ని తనిఖీ చేసి డబ్బులు వసూలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు నెలల క్రితం వ్యాపారులను కొందరు బెదిరించి పెద్ద ఎత్తున నగదు లాక్కున్నట్లు తెలిసింది. మళ్లీ ఇప్పుడు విశ్రాంత రెవెన్యూ ఉద్యోగిని పోలీసులమని బెదిరించి బంగారు ఉంగరాన్ని లాక్కెళ్లారు. దీంతో సదరు ఉద్యోగి తనకు జ రిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించాడు. బైపాస్‌రోడ్డులో పోలీసుల గస్తీ పెంచాలని, వీధి దీపాలు బిగించాలని స్థానికులు కోరుతున్నారు. ఉంగరం లాక్కున్నారు భూమి పనిమీద సిరిసిల్లలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి బుధవారం సాయంత్రం వెళ్లిన. బైపాస్‌రోడ్డులో ఇద్దరు అడ్డగించి, నా జేబులు చెక్ చేశారు. రూ.200 మాత్రమే ఉండడంతో చేతికి ఉన్న బంగారు ఉంగారాన్ని లాక్కున్నారు. – ఎం.సిద్ధేశ్వర్‌రావు, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి, బొప్పాపూర్ చర్యలు తీసుకుంటాం పోలీసులమని చెప్పి తనిఖీలు చేసి.. చేతికున్న ఉంగరాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తీసుకున్నట్లు ఒక వృద్ధుడు పోలీస్‌స్టేషన్‌లో తెలిపిన మాట వాస్తవమే. ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో నాకు ఆలస్యంగా తెలిసింది. తగు చర్యలు తీసుకుంటాం – అనిల్‌కుమార్, సీఐ, సిరిసిల్ల చదవండి: స్కూల్‌కు సెలవులివ్వడం లేదని విషం కలిపాడు! -
నగరంలో ఓ రాత్రి నడిచిందిలా..
ఇది వ్యాపారం చేసే బాజారు కాదు ఆప్తులు తప్పిపోయే ‘మేళా’ కాదు అత్తరు చల్లుకొనే కమ్మని ఆలింగనం ‘బతాసులు’ దొరికే స్వప్నలోకం హైద్రాబాదంటే రాఖీలు పేర్చిన దీపాల షామియాన - రాజా హైదరాబాదీ వీధి దీపాల వెలుగులో మాత్రమే చూడగలిగే విచిత్రాలు.. పగటిపూట రద్దీకి పూర్తి విరుద్ధంగా అరకొర వాహనాలతో రహదారులు.. ఫ్లాస్క్‌లో టీ, కాఫీ, డబ్బాలో సిగరెట్ ప్యాకెట్లు రోడ్లకు వారగా పెట్టుకొని విక్రయించే చిరు వ్యాపారులు.. చీకటి వెలుగుల మాటున రాత్రిని ఎంజాయ్ చేస్తూ సిటీలో సంచరించే నైట్ లవర్స్.. గతంలోనూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఇలాంటి అభిరుచి కలిగిన వారంతా గ్రూపులు కట్టారు. ‘నైట్ వాక్స్’ పేరుతో బృందాలుగా నగర సంచారం చేస్తున్నారు. రంజాన్ పండుగ సంబరాల నేపథ్యంలో వీరి ‘వాక్స్’ మరింత ‘పీక్స్’కి చేరాయి. - ఓ మధు వాక్.. సాగేదిలా.. హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతంలో ఎప్పుడూ సందడే ఉంటుంది. రంజాన్ సమయంలో ఈ సందడి పదింతలవుతుంది. రాత్రులు కూడా పగళ్లను మరిపిస్తూ సందర్శకుల తాకిడితో ఆ పరిసరాలన్నీ కలర్ఫుల్గా మారుతాయి. అందుకే ఇప్పుడు నగరంలోని నైట్ వాకర్స్ అంతా అదే ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా సమాచారం అందించుకుంటూ బృందాలుగా నైట్ వాక్‌లు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పాతబస్తీలో వీరి సందడి ఊపందుకుంది. స్థానికంగా నయాబ్ హోటల్ దగ్గర మొదలుకొని కనీసం 2 కి.మీ దూరంలో చార్మినార్ పరిసరాల్లోని హైలైట్స్ అన్నీ టచ్ చేస్తారు. పాతబస్తీ ప్రత్యేకతలు, ఆర్ట్, క్రాఫ్ట్ విషయాల్ని మాట్లాడుకుంటూ గల్లీగల్లీ చుట్టేస్తారు. చార్మినార్, మక్కా మసీదుల చరిత్ర పంచుకుంటారు. కాస్త సమయం చిక్కితే సిటీ కల్చర్ గురించి స్థానికులతో పిచ్చాపాటీ జరుపుతారు. ఇరానీ ఛాయ్ తాగి చార్మినార్ సందుల్లో తిరిగి.. హలీం రుచుల్ని ఆస్వాదిస్తారు. లాడ్‌బజార్, మదీనా షాపుల్లో తిరుగుతూ షాపింగ్ చేస్తారు. చీకటి నడకల వెలుగులెన్నో.. వేర్వేరు ప్రాంతాల నుంచి నగరానికి కొత్తగా వచ్చిన వారిని ఈ నైట్ వాక్ ఈవెంట్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సిటీ కల్చర్, పండుగ స్పెషల్స్ అన్నీ ఈ వాక్ అండ్ టాక్‌లో భాగమయ్యాయి. ఉదాహరణకు ఈ టైమ్‌లో రంగుల్లో వెలిగిపోయే చార్మినార్, దాని చుట్టూ అంతకన్నా కలర్ఫుల్గా సాగే రంజాన్ నైట్ బజార్.. గాజుల మెరుపులు, ఇరానీ ఛాయ్ ఘుమఘుమలు, హలీం రుచులు, దాని విశిష్టత.. ఇలా నగర సంస్కృతీ సంప్రదాయాలన్నీ ఒక్క పూటలోనే అవగతమయ్యేందుకు వీరికి అవకాశం లభిస్తోంది. పని తప్ప మరో ప్రపంచం తెలియని నగర ఉద్యోగులకు ఇవి ఎంతగానో ఉపకరిస్తున్నాయి. ఇక నగర సంస్కృతిపై అవగాహన కల్పించేందుకు సందర్భానుసారంగా నైట్ వాక్‌లు నిర్వహిస్తూ పండుగలు, ఈవెంట్ల ప్రత్యేకతలు తెలియజేస్తున్న ‘హైదరాబాద్ ట్రెయిల్స్’ సంస్థ లాంటివి కూడా ఉన్నాయి. రంజాన్ సందర్భంగా ఈ సంస్థ ఈ నెలలో ఐదు సార్లు వాక్ నిర్వహించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి వీకెండ్లో 20-25 మంది గ్రూపుగా వెళ్లి సిటీ హెరిటేజ్‌కి షోకేస్ లాంటి ప్రదేశాల్ని విజిట్ చేస్తున్నారు. వందల ఏళ్ల నాటి నగర చారిత్రక వైభవాన్ని ఆస్వాదిస్తూ సాగుతున్నాయి ఈ నైట్‌వాక్స్. సిటీ కల్చర్‌కి కేరాఫ్‌గా నిలిచే చార్మినార్ ప్రాంతంలో వాక్ పూర్తయిన తర్వాత ఓ చక్కని ఫీలింగ్‌తో ఇళ్లకు చేరుతున్నారు వాకర్స్. మంచి అవకాశం.. ఈ వాక్ రాత్రి 9:30 గంటలకు ప్రారంభమై 12:30 వరకు కొనసాగుతుంది. చార్మినార్ దగ్గర నైట్ వాక్ అంటే కేవలం ఒక పండుగ గురించి తెలిపేదే కాదు.. హైదరాబాద్ చరిత్ర, వైభవాన్ని తట్టి చూపే ఒక చక్కటి అవకాశం. - గోపాల కృష్ణ, హైదరాబాద్ ట్రెయిల్స్ ఎంజాయ్ చేశా.. పగటి పూట జరిగే జాతరలు, మార్కెట్లు ఎన్నో చూశాం. నైట్ వాక్స్లోనూ పాల్గొన్నాం. కానీ ఫెస్టివ్ మూడ్‌తో ఉండే నైట్ బజార్ని సందర్శించడం ఇదే తొలిసారి. బాగా ఎంజాయ్ చేశాను. -స్వాతి,ఐటీ ఉద్యోగి,బెంగళూర్ ఇల్లు గుర్తుకు రాదు.. నైట్ వాక్స్ వెరైటీ ఎక్స్పీరియన్స్. రాత్రి పూట దొరికేవి తినడం ఇంట్రెస్టింగ్. నాన్‌వెజ్ మాత్రమే కాదు.. దోసెలు, స్వీట్లు, సమోసాలకు సైతం లోటుండదు. కళ్లు, కాళ్లు అలిసిపోయి.. కడుపు ఆయాస పడుతుంటే గానీ ఇళ్లకు వెళ్లాల్సిన సమయమైందని గుర్తు రాదు. - రాజేశ్, టూరిస్ట్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్‌రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్‌కు సర్వం సిద్ధం
ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement