-
Nysa Devgan Latest Photos: కాజోల్ కూతుర్ని చూశారా? హీరోయిన్ కన్నా తక్కువేం కాదు (ఫోటోలు)
-
తప్పతాగిన స్టార్ హీరో కూతురు.. నెటిజన్ల దారుణ ట్రోల్స్
బాలీవుడ్ సెలబ్రిటీలు వారాంతం వచ్చిందంటే ఎంజాయ్ చేయడం మామూలే. పబ్‌లు, నైట్ పార్టీలకు కొదవే లేదు. అయితే ఇటీవల బాలీవుడ్ స్టార్ నటుల పిల్లలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ కల్చర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల సుహానా ఖాన్, ఖుషి కపూర్ ఓ పార్టీలో సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అజయ్ దేవగణ్ కూతురు నైసా దేవగణ్ తన ఫ్రెండ్ ఓర్హాన్ అవత్రమణితో ముంబైలో పార్టీకి వెళ్లిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఎందుకంటే వారిద్దరూ వీడియోలో తప్పతాగి కనిపించారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్, మహికా రాంపాల్, ఇతర స్టార్కిడ్లు కూడా పార్టీలో కనిపించారు. నైసా దేవగణ్, ఓర్రీ చేతులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడుస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ వారిద్దరూ తప్ప తాగి ఉన్నారంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఓ నెటిజన్ తల్లిదండ్రులు కష్టపడి పేరు సంపాదిస్తే.. వారి పిల్లలు వాటిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మరో నెటిజన్ నైసా దేవగణ్ ఫుల్‌గా తాగి ఉందంటూ పేర్కొన్నాడు. దుస్తులు, మేకప్, ఓపెన్ హెయిర్, బోల్డ్ మేకప్‌తో ఆమె తన రూపాన్ని మార్చేసిందని కామెంట్స్ చేశారు .నైసా దేవగణ్.. అజయ్, కాజోల్‌లకు మొదటి సంతానం. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు యుగ్ కూడా ఉన్నాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
లండన్‌లో ‘పుష్ప’ సింగర్ వెడ్డింగ్ రిసెప్షన్, స్టార్ హీరో కూతురు సందడి
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా’(పుష్ప సినిమాలోని ఊ అంటావా..ఊ ఊ అంటావా హిందీ వెర్షన్) అంటూ తన గాత్రంతో బాలీవుడ్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించిన కనికా లండన్‌కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ హతిరమనిని రెండో పెళ్లి చేసుకుంది. లండన్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో జరిగిన ఈ వివాహ వేడుకలో మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉసాసన కామినేని హజరైంది. కనికా స్నేహితురాలైన ఉపాసన ఈ పెళ్లిలో సందడి చేసింది. ఇదిలా ఉంటే వీరి వెడ్డింగ్ రిసెప్షన్ విక్టోరియా అండ్ అల్బర్ట్ మ్యూజియంలో గ్రాండ్ నిర్వహించారు. ఈ రిసెప్షన్లో బాలీవుడ్ స్టార్ కిడ్ సందడి చేసింది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, హీరోయిన్ కాజోల్ ముద్దుల తనయ నైసా దేవగన్ ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైంది. చదవండి: 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ తన స్నేహితులతో కలిసి ఈ ఫంక్షన్లో పాల్గొన్న నైసా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. బాడీకాన్ పింగ్ డ్రెస్‌లో లైట్ జ్యువెల్లరిలో మెరిసిన నైసా ఈ ఫంక్షన్లో సందడి చేసింది. కనికా, తన స్నేహితులతో పాటు ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ముంబైలో జరిగే సెలబ్రెటీలకు సంబంధించిన ఏ వేడుకకైన నైసా తన తల్లి కాజోల్, తండ్రి అజయ్ దేవగన్‌లతో కలిసి హజరవుతుంది. అయితే తొలిసారి ఆమె ఒంటరిగా ఈ కార్యక్రమంలో కనిపించడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా ఇటీవల 19 ఏళ్లు నిండిన నైసా ప్రస్తుతం సింగపూర్‌లో డిగ్రీ చదువుతోంది. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry1) -
ఆమె.. అజయ్ దేవగణ్ బలహీనత.. ఎవరంటే ?
Unknown Facts About Ajay Devgn: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇటీవల విడుదలైన దర్శక ధీరుడు తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'లో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి రన్‌వే 34 సినిమాలో అలరించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే అజయ్ దేవగణ్ మరో సంవత్సరం పెద్దవాడయ్యాడు. 1969, ఏప్రిల్ 2న జన్మించిన అజయ్ దేవగణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు బాలీవుడ్ సినీ తారలు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. అయితే 53వ పడిలోకి అడుగు పెడుతున్న ఈ బాలీవుడ్ హీరో 5 రహస్యాలు ఏంటో తెలుసుకుందామా ! 1. ట్రావెలర్ అజయ్ దేవగణ్ మంచి నటుడే కాకుండా ట్రావెల్ లవర్ కూడా. అతని కుటుంబంతో ప్రయాణించడం కంటే ఆయనకు ఏది గొప్ప ఆనందాన్ని ఇవ్వదట. అజయ్ తన తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, ఇద్దరు సోదరీమణులు, వారి భర్తలు, పిల్లలతో కలిసి దూర ప్రయాణాలు చేస్తుంటాడని సమాచారం. సెలవుల్లో 25 మంది కుటుంబ సభ్యుల బృందం కలిసి టూర్‌కు వెళ్తాడట. ఇందుకోసం బిజినెస్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించి స్టే చేసేందుకు సాధ్యమైతే ఏకంగా ఒక ఐలాండ్నే బుక్ చేస్తాడని సమాచారం. 2. శివ భక్తుడు అజయ్ దేవగణ్ గొప్ప శివ భక్తుడు. ఎంత గొప్ప భక్తుడు అంటే అతని ఛాతిపై శివుడి పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. అంతేకాకుండా ఆయన డైరెక్ట్ చేసిన 'శివాయ్' మూవీని శివుడికి అంకితం ఇచ్చాడు. 3. టాలెంటెడ్ కుక్ అద్భుతంగా వండటంలోనూ అజయ్ దేవగణ్ సిద్ధహస్తుడు. భారతీయ, కాంటినెంటల్ డిషెస్‌ను సూపర్‌గా చేయగలడని టాక్. 4. కుటుంబమంటే అమితమైన ప్రేమ యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టే అజయ్ దేవగణ్ మంచి ఫ్యామిలీ మ్యాన్ కూడా. ఆయనకు మొదటగా పుట్టిన కూతురు నైసా.. అజయ్ దేవగణ్ బలహీనత. కనీసం రోజులో కొన్నిసార్లు అయినా ఆమెతో మాట్లాడలేకపోతే అజయ్‌కు రోజు గడవదట. అలాగే కుమారుడు యుగ్ అన్న అజయ్‌కి అమితమైన ప్రేమ. 5. పోలో గ్రీన్ కొలోన్ అంటే ఇష్టం అజయ్ దేవగణ్ గత మూడు దశాబ్దాలుగా రాల్ఫ్ లారెన్ తయారు చేసిన పోలో గ్రీన్ అనే కొలోన్నే ధరిస్తున్నాడని సినీ వర్గాల నుంచి సమాచారం. -
స్టార్ హీరో కూతురు అదిరే స్టెప్లు చూశారా!
సాక్షి, ముంబై: బాలీవుడ్ ‘సింగం’ అజయ్ దేవగణ్-కాజోల్ దంపతుల గారాల పట్టి నైసా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ప్రస్తుతం సింగపూర్‌లో తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా నైసా తన స్నేహితులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నైసా తన ఇద్దరు స్నేహితులకు సులభంగా డ్యాన్స్ స్టెప్పులు ఎలా వేయాలో నేర్పిస్తుంది. ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే అనేకమంది వీక్షించారు. ఈ వీడియో చూసిన వారంతా ‘డ్యాన్స్ మెలుకువలు నేర్పుతూ ఎంతైనా నటుడి కుమార్తె అనిపించుకుంది’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (చదవండి: అతనితో జాగ్రత్తగా ఉండమన్నారు: కాజోల్) కాగా నైసా స్టార్ సెలబ్రిటీ కూతురు అయినప్పటికీ ఆమె చాలా సాధారణంగా ఉంటారు. ఇతర సెలబ్రిటీల్లా లాగా సోషల్ మీడియాలో కూడా ఎక్కవ కనిపించరు. తన విషయాలు, ఫోటోలు అందరికి కనిపించకుండా గోప్యంగా ఉంచుతారు. ఇక కాజోల్, అజయ్ దేవగణ్ 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2003లో కూతురు నైసా, 2010లో కుమారుడు యుగ్ దేవగణ్ జన్మించారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్లో నెపోటిజంపై చర్చలు, స్టార్ కిడ్స్ పై ట్రోలింగ్ చర్చ సందర్భంగా నైసా దేవగణ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించాయి. ‘.స్టార్ హీరోల పిల్లలగా ఉండటం స్టార్డమ్ తో పాటు ఒక్కోసారి ఇబ్బందులు తెస్తాయి. తాము ఏ చిన్న తప్పు చేసినా విమర్శించేందుకు సమాజంలో చాలా మంది ఉంటార’ని సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసింది. (చదవండి: క్షమాపణ కోరిన ప్రముఖ ర్యాప్ సింగర్) View this post on Instagram oh @nysadevgan girl hmu and I’ll teach u how to twerk...for free! • #nysadevgan A post shared by ♡ (@nysadevganx) on Nov 11, 2020 at 10:34am PST
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్‌లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement