-
పెళ్లికూతురు ముందు పరువు పోగొట్టుకున్న పెళ్లికొడుకు.. వీడియో వైరల్..
పెళ్లి వేడుక అంటేనే ఆహ్లాదకరంగా సందడి వాతావరణం ఉంటుంది. అయితే ఒక్కోసారి వేదికపైనే నవ్వూలు పూయించే ఘటనలు జరుగతుంటాయి. అక్కడున్న వారిని పొట్టచెక్కలయ్యేలా నవ్వేలా చేస్తాయి. ఓ విహవా వేడుకలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కొత్త పెళ్లి కొడుక్కు తన జీవిత భాగస్వామి ముందే ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో అతడ్ని చూసి ఆమె పొట్టచెక్కలయ్యేలా నవ్వింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో పెళ్లి అనంతరం పూలదండలు మార్చుకుంటున్నారు వధూవరులు. అయితే పెళ్లికూతురు మెడలో దండ వేసే సమయంలో పెళ్లికొడుకు పైజామా జారిపోయింది. అతను మాత్రం గమనించలేకపోయాడు. చుట్టుపక్కల ఉన్నవాళ్లతో పాటు పెళ్లికూతురు కూడా నవ్వడంతో వెంటనే తేరుకుని ప్యాంటు పైకి లాక్కున్నాడు. ఈ సమయంలో అతను సిగ్గుపడటం చూసి పెళ్లికి వచ్చిన వారంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. ये दूल्हे के साथ क्या हो गया !!! 😂😂😂😂😂😂😂 pic.twitter.com/RSELxUTzQ9 — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) March 16, 2023 ఈ వీడియోపై స్పందిస్తూ.. పాపం ఈ పెళ్లికొడుకుకు ఏమైంది? అని నెటిజన్ నవ్వులు పూయించాడు. ప్యాంటు లూస్‌గా ఉన్నట్టుంది బ్రో.. కొంచెం చూసుకోవాలి కదా అంటూ మరో యూజర్ చమత్కరించాడు. అయ్యో.. పెళ్లికూతురు ముందు పరువుపాయే.. మున్ముందైనా జర చూసుకో.. అంటు మరో యూజర్ సలహా ఇచ్చాడు. చదవండి: ఇన్స్టాంట్ ఖర్మ అంటే ఇదే.. గేదెను తన్ని బైక్‌పై నుంచి జారి.. -
చీర ఆర్డర్ చేస్తే చిరిగిన ప్యాంటొచ్చింది
పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా): సోదరికి కానుక ఇద్దామని చీర ఆర్డర్ చేస్తే సగానికి చిరిగిన పాత ప్యాంటు డెలివరీ అయిన ఘటన పెనుగంచిప్రోలులో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు పండుగకు తన సోదరికి చీర కొనిద్దామనుకున్నాడు. ఓ ఆన్లైన్ యాప్‌లో రూ.550 విలువ గల చీర బుక్ చేశాడు. శనివారం ఆర్డర్ అందింది. డెలి వరీ బాయ్‌కు డబ్బు చెల్లించి, కవర్‌ను తెరిచి చూడగా దానిలో చీరకు బదులు చిరిగిన పాత ప్యాంట్ అదీ ఒక కాలు వరకు మాత్రమే ఉండ టంతో అవాక్కయ్యారు. ఇదేమని డెలివరీ బాయ్‌ను ప్రశ్నించగా తమకేం తెలియదని, రిటన్ ఆప్షన్ ఉంటుంది చేసుకోమంటూ సలహా ఇచ్చాడు. జరిగిన దానికి తానేమీ చేయలేనని, ఆన్లైన్ వ్యాపారంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పిమరీ వెళ్లాడు. -
ఏముంది భయ్యా ఆ జీన్స్ ప్యాంట్లో.. 60 లక్షలు పెట్టి మరీ కొన్నావ్!
వస్తువులు పాతవయ్యే కొద్దీ వాటిని పక్కన పెట్టడం సహజం. వాటి విలువ తగ్గడం, ఆ స్థానంలో కొత్తవి రావడం, పాడైపోవడం లాంటి కారణాలతో పక్కన పెట్టేస్తాం. ఇదంతా ఒక వైపే. మరో వైపు చూస్తే.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ దశాబ్దాల కాలం నాటి వస్తువుల కోసం కోట్లు పెడుతుంటాం. ఎందుకంటే కొన్ని వస్తువులు ఎంత పాతవైతే అంత విలువ పెరుగుతుంది. అందుకే కొంతమంది అలాంటి వాటి కోసం వేచి చూస్తుంటారు. వేలంలోకి రాగానే భారీ నగదు చెల్లించి సొంతం చేసుకుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మెక్సికోలో చోటు చేసుకుంది. అమ్మో.. ఈ ప్యాంటు ధర రూ.60 లక్షలా! అమెరికాలోని న్యూ మెక్సికోలో జరిగిన వేలంలో 1880ల నాటి లెవీ జీన్స్ జత $76,000కి( భారత కరెన్సీ ప్రకారం రూ.60 లక్షల పైమాటే) అమ్ముడైంది. శాన్ డియాగోకు చెందిన 23 ఏళ్ల పాతకాలపు దుస్తుల వ్యాపారి కైల్ హౌపెర్ట్ ఇటీవల జరిగిన వేలంలో ఈ జీన్స్ ప్యాంటును కొనుగోలు చేశాడు. అయితే, హౌపెర్ట్ కొనుగోలుదారుల ప్రీమియంతో కలిపి మొత్తం $87,400 చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై హౌపెర్ట్ మాట్లాడుతూ "నేను ఇప్పటికీ ఒకరకంగా అయోమయంలో ఉన్నాను, ఆ ప్యాంట్‌ను కొనుగోలు చేసినందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది" అని చెప్పారు. అతను పాతకాలపు దుస్తుల కంపెనీ డెనిమ్ డాక్టర్స్ యజమాని జిప్ స్టీవెన్సన్తో కలిసి జీన్స్‌ను కొనుగోలు చేశాడు. వేలంలో పలికిన దీని ధరలో ఇప్పటికే 90 శాతాన్ని హౌపెర్ట్ చెల్లించాడు. View this post on Instagram A post shared by Golden State Vintage (@goldenstatevtg) చదవండి: యూజర్లకు బంపరాఫర్.. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్! -
బౌలింగ్ మరిచి ప్యాంటు లాగి.. అంపైర్ పరువు తీశాడు
క్రికెట్లో ఫన్నీ ఘటనలు చోటుచేసుకోవడం సహజం. తోటి ఆటగాళ్లను, కోచ్‌ను ఫ్రాంక్ చేస్తే పర్లేదు. కానీ మైదానంలో గంభీరంగా నిలబడే అంపైర్‌ను కూడా ఫ్రాంక్ చేయడం ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ చేయాల్సింది మరిచి అంపైర్ ప్యాంట్‌ను లాగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన లంకాషైర్ క్రికెట్ లీగ్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. రిస్టన్ క్రికెట్ క్లబ్లో లంకాషైర్ లీగ్, ఈస్ట్ లంకాషైర్ క్రికెట్ క్లబ్ మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. బౌలింగ్ వేయడానికి సిద్ధమైన బౌలర్ రన్అప్కు వెళ్లాడు. బంతిని చేతిలో ఉంచుకొని రన్అప్ తీసుకోకుండా నేరుగా అంపైర్ వద్దకు వెళ్లి అతన్ని ప్యాంట్ లాగాడు. ఇదంతా గమినించిన తోటి ఆటగాళ్లు అక్కడేం జరుగుతుందో ఒక్కక్షణం అర్థం కాలేదు. ఆ తర్వాత బౌలర్ నవ్వుతూ అంపైర్‌కు క్షమాపణ చెబుతూ.. ''ఇట్స్ ప్రాంక్'' అని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒకసారి లుక్కేయండి. కాగా ఈ వీడియోపై అభిమానులు ఫన్నీగా స్పందించారు. ''ఆ బౌలర్ ప్రాంక్ చేయడం ఏమో గాని అంపైర్ ప్యాంటు లాగి పరువు మొత్తం తీశాడు''.. ''ఇంకా నయం ప్యాంటు ఒక్కటే లాగాడు.. దాంతో పాటు చెడ్డీ కూడా వచ్చి ఉంటే''.. ''ఎంత ఘోరం జరిగిపోయింది'' అంటూ కామెంట్స్ చేశారు. @ThatsSoVillage the funniest/most village thing to happen at @Rishtoncc Lancashire this weekend. 😂😂😂 pic.twitter.com/oF2qWeZbXk — Tino Hallerenko (@tinohalleron) August 27, 2022 చదవండి: నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగనున్న పాకిస్తాన్.. కారణం ఏంటంటే? Asia Cup IND Vs PAK: ప్రపంచ రికార్డుకు 10 పరుగుల దూరంలో హిట్‌మ్యాన్ -
DC Vs CSK: చెన్నైకు మరో షాక్.. 3 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం
చెన్నైకు మరో షాక్.. 3 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 137 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ తడబడుతూ లక్ష్యాన్ని చేధించింది. చివర్లో హెట్‌మైర్(28) కీలక ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. అంతకముందు శిఖర్ ధావన్ 39 పరుగులతో రాణించాడు. చెన్నై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, జడేజా రెండు వికెట్లు సాధించగా, హాజెల్‌వుడ్ , దీపక్ చాహర్, డ్వేన్ బ్రావో చెరో వికెట్ పడగొట్టారు. అంతక ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.కేవలం 64 పరుగులకే 4 కీలకమైన వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో పడింది. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు జట్టును ఆదుకున్నాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో హాఫ్ సెంచరీ చేసి చెన్నైకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఢిల్లీ బౌలర్లో అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించగా, నోర్జ్, ఆశ్విన్, అవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. ఢిల్లీకు బిగ్ షాక్.. ధావన్ (39) ఔట్ 137 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ తడబడుతుంది. కేవలం 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మంచి ఊపు మీద ధావన్ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో మొయిన్ అలీకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఢిల్లీ విజయానికి ఇంకా 28 బంతుల్లో 36 పరుగులు కావాలి. ప్రస్తుతం 15.4 ఓవర్లులో 6 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. కెప్టెన్ పంత్ (15)ఔట్ కెప్టెన్ పంత్ (15) రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో మొయిన్ అలీకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 11 ఓవర్లలో ఢిల్లీ 84 పరుగులు చేసింది. ధావన్(32) రిపల్ పటేల్(12) పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. శ్రేయస్ అయ్యర్ (2)ఔట్ స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. జోష్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్(2) రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మరో వైపు ధావన్ మాత్రం ఫోర్లు, సిక్స్రలతో చెన్నై బౌలర్లపైన విరుచుకు పడుతున్నాడు. ప్రస్తుతం 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఢిల్లీ 64 పరుగులు చేసింది. ధావన్(32), పంత్(9) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా(18)ఔట్ 137 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో పృథ్వీ షా(18), డు ప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 4 ఓవర్లలో ఢిల్లీ వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. ధావన్(6), అయ్యర్(1) పరుగులతో క్రీజులో ఉన్నారు. అర్దసెంచరీతో మెరిసిన రాయుడు.. సీఎస్కే 20 ఓవర్లలో 136/5 ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే పవర్ ప్లేలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. కేవలం 64 పరుగులకే 4 కీలకమైన వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో పడింది. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు జట్టును ఆదుకున్నాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో హాఫ్ సెంచరీ చేసి చెన్నైకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఢిల్లీ బౌలర్లో అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించగా, నోర్జ్, ఆశ్విన్, అవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు Photo Courtesy: IPL వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన చెన్నై ఢిల్లీ బౌలర్ల ధాటికి చెన్నై బ్యాట్సమన్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. కేవలం 62 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి సీఎస్కే పీకల్లోతు కష్టాల్లో పడింది. వరుస క్రమంలో ఉతప్ప (19), మొయిన్ అలీ(5) వికెట్లును కోల్పోయింది. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. రాయుడు (2), ధోని (1) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ బౌలర్లో అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించగా, నోర్జ్, ఆశ్విన్ చెరో వికెట్ సాధించారు. రెండో వికెట్ కోల్పోయిన చెన్నై.. గైక్వాడ్ (13) ఔట్ గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్ కేవలం 13పరుగులే చేసి పెవిలియన్‌కు చేరాడు. అన్రిచ్ నోర్జ్ బౌలింగ్‌లో ఆశ్విన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సీఎస్కే 5 ఓవర్లలో 2 వికెట్లు సష్టపోయి 41 పరుగులు చేసింది. ఉతప్ప (1), మొయిన్ అలీ(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 35/1 ఓపెనర్ డుప్లెసిస్(10) రూపంలో సీఎస్కే తొలి వికెట్‌ను కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో డుప్లెసిస్, అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 4ఓవర్లో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. రుతురాజ్ (13), ఉతప్ప (1) పరుగులతో క్రీజులో ఉన్నారు. దుబాయ్: ఐపీఎల్ 2021లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నేడు రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా లీగ్‌లో ఇరు జట్లు 24 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా చెన్నై 15 .. ఢిల్లీ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. కాగా ప్రస్తుత సీజన్ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో సీఎస్కేపై ఘనవిజయం సాధించింది . పాయింట్ల పట్టికలో తొలి, రెండు స్థానాల్లో ఉన్న ఈ జట్లు.. నేటి మ్యాచ్ లో గెలిచి ఆధిక్యాన్ని ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ధోని (కెప్టెన్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్ ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), రిపల్ పటేల్, అక్షర్ పటేల్, షిమ్రాన్ హెట్‌మైర్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నోర్జ్
Pagination
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రిషబ్ పంత్‌కు భారీ షాక్.. ఒక మ్యాచ్ నిషేధం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement