-
కథా బలంతోనే విజయం
కర్నూలు (కల్చరల్): చిత్రంలోని కథా బలమే ఈ విజయానికి కారణమని పెళ్లిచూపులు సినిమా రచయితా, దర్శకుడు తరుణ్‌భాస్కర్ తెలిపారు. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ఆ సినిమాకు సంబంధించి జరిగిన సక్సెస్ మీట్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ బడ్జెట్‌తో తీసిన పెళ్లి చూపులు సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించిందన్నారు. సినిమా షూటింగ్ జరిగే సందర్భంలో ఇంత విజయం తమను వరిస్తుందని అనుకోలేదన్నారు. కొత్త నటీ నటులతో తీసిన ఈ సినిమా సినీ మేధావుల అంచనాలు దాటి సక్సెస్‌ను అందుకోవడం హర్షణీయమన్నారు. ఆసక్తికలిగిన యువతీ, యువకులు సినీ రంగంలో ప్రవేశించేందుకు ప్రతిభనే ప్రాతిపదికన ఎంచుకోవాలన్నారు. తాను షార్ట్‌ఫిలింలు నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్మాత తనకు చక్కని అవకాశం కల్పించి మార్గం సుగమం చేశారన్నారు. సభలో ముఖ్యఅతితిగా పాల్గొన్న ప్రముఖ పారిశ్రామిక వేత్త టీజీ భరత్ మాట్లాడుతూ పెళ్లి చూపులు చిత్రం యువతకు మంచి సందేశాన్ని అందించిందన్నారు.ఇలాంటి సందేశాత్మక చిత్రాలు ఇంకా రావాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూలులో స్టూడియో నిర్మించేందుకు అవసరమైన అన్ని హంగులు ఉన్నాయన్నారు. ఎవరైనా ముందుకొస్తే స్టూడియో నిర్మాణానికి తానూ సహకరిస్తానన్నారు. టీజీవీ యాక్టింగ్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఎంతో మంది యువతీ, యువకులు నటనలో శిక్షణ పొందుతున్నారన్నారు. లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కళాకారులకు కొదవే లేదన్నారు. ఇటీవల తాము నిర్వహించిన షార్ట్‌ఫిలిం పోటీల్లో చాలా మంది యువతీ, యువకులు పాల్గొన్నారన్నారు. అనంతరం పెళ్లి చూపులు సినిమా డైరెక్టర్ తరుణ్‌భాస్కర్‌ను ఘనంగా సత్కరించారు. సినిమాలో నటించిన కమిడియన్ అభయ్, కెమెరామెన్ నగేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత సాయికృష్ణ, నటి తన్విలను వారు ఘనంగా సత్కరించారు. -
విన్నవించుకోనా... చిన్న కోరికా...
దసరా సరదా అదిగదిగో ఆ ఇంట్లోకి ఒక్కసారి తొంగిచూడండి. ఏం కనిపిస్తోంది. పెళ్లిచూపుల తంతు కదూ. ఎంత ఆర్భాటంగా, ఉత్సాహంగా జరుగుతోందో చూశారా. ఎంతమందికి పెళ్ళిళ్లు అయ్యి, సంసారాలు సజావుగా నడుస్తున్నా, ఎప్పటికప్పుడు పెళ్లిచూపుల తంతు కొత్తేగా. అది సరే. అక్కడ చూడండి... అమ్మాయి గురించి అబ్బాయివారు అబ్బాయి గురించి అమ్మాయివారు అన్నీ ఎంత ముచ్చటగా మాట్లాడుకుంటున్నారో. ఇక్కడ విశేషం చూశారా. వారి మధ్యన మాటలన్నీ ఎంత ప్రశాంతంగా నడిచిపోతున్నాయో. ఇరుపక్షాలకు ఏ ఇబ్బందీ లేకుండా ఎంత హాయిగా ఉందో. నిజమే... పెళ్లిచూపులు ఇలా జరిగిపోతే ఎంతబాగుంటుందో కదండీ. అయ్యో ఇదేంటి. ఇంతలోనే అమ్మాయి తల్లి లేచి తనకేదో కోరిక ఉందని... ‘విన్నవించుకోనా చిన్నకోరికా’ అంటూ గొంతు సవరిస్తోంది. పదండి చూద్దాం, ఆవిడగారి ఆ కోరికేమిటో మనమూ తెలుసుకుందాం. అన్నయ్యగారూ మాదొక చిన్న షరతండీ... అంటూ కొంచెం దర్పంగా పలికింది అమ్మాయి తల్లి. షరతా! చెప్పండి! చెప్పండి! అంటూ హడావుడి పడ్డాడు అబ్బాయి తండ్రి. షరతేమిటి వదినగారూ! అంటూ అబ్బాయి తల్లి ఇంత సాగ దీసింది. ఏమీలేదండీ! మీరంత హడావుడి పడకండి, మాదేమీ గొంతెమ్మ కోరిక కాదు, మీరలా భయపడిపోవడానికి. మేమూ అబ్బాయిని కన్న తల్లిదండ్రులమే... అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది అమ్మాయి తల్లి.. ఏమోనమ్మా! అబ్బాయి పెళ్లి జరగడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, అన్నీ కుదిరాయి, మా అబ్బాయి పెళ్లి అవుతుందిలే అని నేను సంబరపడుతుంటే, మీరిలా కండిషన్ పెడుతున్నానంటే నాకు భయంగా ఉండదా మరి... అంది పెళ్లికొడుకు తల్లి. అంత భయపెట్టేవాళ్లల్లా ఉన్నామా. మేమూ అబ్బాయి పెళ్లి చేసినవాళ్లమేనండీ. మా అబ్బాయి పెళ్లిలో మా వియ్యాలవారు మమ్మల్ని ఏది అడిగారో, మేమూ మిమ్మల్ని అదే అడగ బోతున్నాం. కొంపదీసి అత్తగారి లాంఛనాలు, బావమరిది కట్నాలు, మరదలి వేడుకలు ఏమైనా తీర్చాలా ఏంటి వదినగారూ! కట్నాలు, లాంఛనాలు ఇచ్చిపుచ్చుకోవడాలు లేదని మనం ముందే అనుకున్నాం కదా. పెళ్లి అంటే రెండు కుటుంబాలు కలిసిపోయి, జీవితాంతం హాయిగా సంతోషంగా విందువినోదాలతో గడపాలనేది మా లక్ష్యం. నిజమే. మీ మాటతో పూర్తిగా ఏకీభవిస్తాను. అందులో సందేహమే లేదు. ఈ మధ్యన పెళ్లి అంటే వ్యాపారంగా మారిపోయింది కదండీ. అందుకని అడిగాను. మనం అలాంటి వ్యాపారాల విషయాలు మాట్లాడుకోవద్దు. మాటల్లో పెట్టేసి, అసలు విషయం దాటేస్తున్నారు... దాటేయడం ఎందుకండీ! మీరేమైనా ఊహిస్తారేమోనని ఎదురుచూస్తున్నాను.... ఏమో మీరేం అనుకుంటున్నారో నేను ఎలా ఊహించగలను. ఊహించండి. కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. సరదాగా అంటే గుర్తు వచ్చిందండోయ్. సరదా పదంలోనే దసరా ఉంది కదా. దసరా పండుగ రాబోతోంది కదా. ఆ ఇప్పటికి దారిలోకి వచ్చారు. అంటే... మన పిల్లల పెళ్లి అయ్యాక వచ్చే మొదటి పండుగ దసరానే కదా. అవును. ఇందులో కొత్తేమీ లేదుగా. అమ్మాయి తరఫువారు అబ్బాయి తరఫువారిని పండుగకు ఆహ్వానించి వారందరికీ కొత్తబట్టలు పెట్టడం ఆనవాయితీనేగా. అసలు దసరా అంటేనే అల్లుళ్ల పండుగ కదా. ఇందులో విశేషం ఏంటో అర్థం కావట్లేదు. అదేమరి... ఈ సారి మార్పు చేద్దాం. ఏమిటో...? ఏమీ లేదు. ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా అందరూ చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుతున్నారు. అయితే ఏంటంటారు? ఈ దసరా పండుగకి కొత్త కోడలిని, వారి తర ఫువారిని ఆహ్వానించి స్వయంగా మీరే ఆదరించాలి. ఇది అల్లుళ్ల పండుగ మాత్రమే కాదు, కోడళ ్లపండుగ కూడా ‘నవ దసరా’కి నాంది పలకాలి. ఇదే మా షరతు... హాయిగా నవ్వుతూ పలికింది అమ్మాయి తల్లి. ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా అబ్బాయి తల్లి అంగీకరించింది. ‘నిజమే కదా, నా పెళ్లయిన కొత్తలో నేను ఇలాగే అనుకున్నాను కదా, ఎప్పుడూ అల్లుళ్లని పిలవడమే కాని, కోడళ్లను పిలవరా అని, నా మనసులోని మాట తెలుసుకున్నట్లు వియ్యపురాలు ఈ షరతు పెట్టడం బావుంది’ అని మనసులో అనుకుంటూనే... తప్పకుండా వదినగారూ, అంతకంటేనా, మా ఇంట్లో అడుగు పెట్టేవరకే కోడలు, ఆ తరవాత మా అమ్మాయేగా! అలా కూడా మేం అల్లుడిని సత్కరించుకున్నట్లేగా... అంటూ హాయిగా నవ్వేసింది. దసరా పండుగ ఎంత సరదాగా గడపాలా అని కబుర్లు చెప్పుకుంటూ తాంబూలాలు పుచ్చుకున్నారు. - డా. పురాణపండ వైజయంతి -
పెళ్లిచూపులు ప్రెస్‌మీట్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement