-
ఎమ్మెల్యే కావాలని ఉంది: డైరెక్టర్
సాక్షి, చెన్నై: దర్శకుడు పేరరసు ఎమ్మెల్యే కావాలని ఆశ పడుతున్నారట. కళాకారులను ప్రోత్సహించే విధంగా 2017 రైజింగ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఇటీవల స్థానిక వడపళనిలోని ఆర్కేవీ స్టూడియోలో జరిగింది. భాస్కర్ మీడియా, ఆర్కేవీ ఫిలింఇన్స్టిట్యూట్, ఇండియన్ క్లాసిక్ అండ్ కల్చరల్ ట్రస్ట్, ఆరోగ్య ఇనిప్పు తులసీ చారు సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దర్శకుడు పేరరసు, ఆర్వీ.ఉదయకుమార్, జాగ్వర్‌తంగం, పవర్‌స్టార్ శ్రీనివాసన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 2017లో విడుదలైన చిత్రాల్లో ఉత్తమ పరిచయ కథానాయకుడి అవార్డును నందన్ (పళ్లిపరువత్తిలే), ఉత్తమ పరిచయ కథానాయకి అవార్డును అతిథిబాలన్ (అరువి), ఉత్తమ పరిచయ దర్శకుడు – అరుణ్‌ప్రభు పురుషోత్తమన్ (అరువి), ఉత్తమ ప్రతినాయకుడు –డేనియల్ బాలాజీ (ఇప్పడై వెల్లుమ్), ఉత్తమ కథారచయిత – గోపీనైనార్ (అరమ్), ఉత్తమ దర్శకుడు – జిప్సీరాజ్కుమార్ (అయ్యనార్ వీధి) ఉత్తమ సంగీతదర్శకుడు–శ్యామ్ సీఎస్ (ఇరుదుచుట్రు) అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పేరరసు మాట్లాడుతూ 2017లో చిన్నచిత్రాలే పెద్ద విజయాలను సాధించాయన్నారు. ఇది ఆహ్వానించదగ్గ విషయం అని పేర్కొన్నారు. రైజింగ్ స్టార్ అవార్డులను అందుకున్న కళాకారులందరికీ అభినందలు తెలుపుతున్నానన్నారు. ఈ రోజుల్లో దర్శకత్వం కంటే నటనే బెటర్ అనిపిస్తోందన్నారు. దర్శకత్వంతో గౌరవం లభించడం లేదన్నారు. ఇకపై తానూ నటనపై దృష్టి సారించాలనుకుంటున్నానని అన్నారు. తద్వారా కనీసం ఎమ్మెల్యే కావాలని ఆశపడుతున్నానని దర్శకుడు పేరరసు ఈ సందర్భంగా అన్నారు. -
కండల రాణి
భారతదేశం పెద్ద పెద్ద బాడీబిల్డర్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కాని మహిళా బాడీబిల్డర్లు అప్పట్లో లేరు. అయితే, ఇప్పుడు మహిళల బాడీబిల్డింగ్‌లో రైజింగ్‌స్టార్ ఆవిర్భవించారు. ఆమే నగరవాసి కిరణ్ డెంబ్లా. ఇటీవల హంగేరిలో జరిగిన ప్రపంచ మహిళల బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో 6వ స్థానాన్ని కైవసం చేసుకుని మనదేశంలోనూ మహిళా బాడీబిల్టర్లు ఉన్నారని చాటిచెప్పారు ఈ ఇద్దరు పిల్లల తల్లి. కండలక్వీన్గా మారి నగరంలో ఫిట్నెస్ ప్రపంచానికి సరికొత్త దారులు తెరిచారు. కేవలం మగవారే కాదు మగువలు కూడా ఫిట్నెస్ పరంగా అద్భుతాలు సృష్టించగలరని నిరూపించడంతోపాటు రకరకాల కారణాలతో వ్యాయామానికి దూరమవుతున్న మహిళల్లో చైతన్యం తేవాలనేదే తన ప్రయత్నం అంటారు కిరణ్. యోగా కావచ్చు.. జాగింగ్ కావచ్చు.. ఏరోబిక్స్ కావచ్చు.. ఏదైనా సరే మహిళ తలచుకుంటే అగ్రస్థానంలో నిలవగలదని పేర్కొన్నారామె.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్‌ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
విశాఖ రుణం తీర్చుకుంటా
● లచ్చయ్యపేటలో అలా...
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement