-
దూసుకుపోతున్న ‘చదువురాని చాయ్‌వాలా’
దేశంలో టీ దుకాణాలకు మంచి డిమాండ్ ఉంది. ఎక్కడ కొత్తగా టీ దుకాణం ఏర్పాటైనా అది విజయవంతం అవుతుందనే మాట వినిపిస్తుంటుంది. తాజాగా బీహార్‌లో వినూత్న టీ దుకాణం ఏర్పాటయ్యింది. దాని పేరు వినగానే ఎవరికైనా వింతగా అనిపిస్తుంది. మాధేపురాలోని సింగేశ్వర్కు చెందిన రోహిత్ ‘అన్పఢ్ చాయ్‌వాలా’ (చదువురాని చాయ్‌వాలా) పేరుతో టీ స్టాల్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఐదు రకాల టీలు లభిస్తాయి. అయితే ఇక్కడ టీ బాగోలేదని ఎవరైనా వినియోగదారుడు అంటే రోహిత్ వారికి డబ్బు వాపసు చేస్తాడు. విద్యార్థులకు టీపై ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఇస్తుంటాడు. రోహిత్ తన దుకాణంలో టీని రూ. 10కే అందిస్తున్నాడు. మొదట్లో తన దుకాణం పేరు బాగోలేదని చాలామంది అన్నారని, అయితే ఆ పేరు అలాగే ఉంచాలని అనుకున్నానని రోహత్ తెలిపాడు. తాను ఎటువంటి డిగ్రీ చదవలేదని, పెద్దగా ఏమీ చదువుకోలేదని అందుకే అన్పఢ్ చాయ్‌వాలా అని దుకాణానికి పేరు పెట్టానని రోహిత్ వివరించాడు. ఇప్పుడు తన టీ దుకాణం పేరు స్థానికంగా అందరి నోళ్లలో నానుతోందని, తాను ప్రతిరోజూ 400 నుండి 500 కప్పుల టీ విక్రయిస్తున్నానని రోహిత్ తెలిపాడు. విద్యార్థులకు 10శాతం తగ్గింపు ధరకే టీ ఇస్తున్నానని, దీనివలన చదువుకుంటున్న విద్యార్థులకు కాస్త ఉపశమనం లభిస్తుందని రోహిత్ తెలిపాడు. యూట్యూబ్‌లో పలు టీ దుకాణాల వీడియోలను చూశాక, తాను ‘అన్పఢ్ చాయ్‌వాలా’ పేరుతో సొంత స్టార్టప్‌ను ప్రారంభించానని అన్నాడు. తాను వినియోగారులకు మసాలా టీ, ప్లెయిన్ టీ, స్పెషల్ టీ, అల్లం టీ, కాఫీ టీ అందిస్తున్నానని తెలిపాడు. -
'టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్' వృద్ధుని దుకాణంపై ఆనంద్ మహీంద్ర పోస్ట్..
'టీ ' అంటే మనందరికీ ఇష్టమే. ఉదయం లేచిన దగ్గర నుంచి టీ తాగకుండా ఇంకే పని మొదలుపెట్టము. పనిలో కాస్త ఇబ్బంది అనిపిస్తే వెంటనే ఓ కప్ టీ తాగి మళ్లీ ఫ్రెష్‌గా ప్రారంభిస్తాము. అందుకే ఏ సందులో చూసినా టీ షాప్ ఉంటుంది. ఇది ఎందరికో జీవనోపాధిని కల్పిస్తుంది. అయితే.. తాజాగా అమృత్‌సర్‌లో ఓ వృద్ధుడు కొనసాగిస్తున్న టీ షాప్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత 45 ఏళ్లుగా వృద్దుడు ఓ మర్రి చెట్టు మొదలులో టీ షాప్‌ని నడిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. 'అమృత్‌సర్‌లో చాలా ప్రదేశాలు చూశాను. కానీ వీడియోలో కనిపిస్తున్న ఈ టీ షాప్‌ని ఎప్పుడూ చూడలేదు. ఈ సారి అమృత్సర్ వెళ్లినప్పుడు ఈ దుకాణాన్ని తప్పుకుండా చూస్తాను. గత 40 ఏళ్లుగా ఓ వృద్ధుడు నడిపిస్తున్న టీ షాప్‌ని 'టెంపుల్ ఆప్ టీ సర్వీస్' గా పేర్కొంటూ' ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ఆలోచిస్తే మన హృదయమే దేవాలయం అని పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. There are many sights to see in Amritsar. But the next time I visit the city, apart from visiting the Golden Temple, I will make it a point to visit this ‘Temple of Tea Service’ that Baba has apparently run for over 40 years. Our hearts are potentially the largest temples.… pic.twitter.com/Td3QvpAqyl — anand mahindra (@anandmahindra) July 23, 2023 ఈ వీడియోలో 80 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వృద్ధుడు ఓ భారీ వృక్షం సందులో టీ షాప్‌ని నిర్వహిస్తున్నాడు. గత 45 ఏళ్ల నుంచి తను ఒకటే పనిని కొనసాగిస్తున్నారు. అందరూ అతన్ని బాబాగా పిలుస్తారు. స్థానికంగా అతనంటే తెలియని వారుండరు. ఈ టీ విక్రయదారునికి పని పట్ల ఉన్న నిబద్ధత, విధేయత, ఆసక్తి నెటిజన్లను ఆకర్షించింది. Amidst the timeless charm of Amritsar, under the embracing canopy of a majestic tree, a venerable man gracefully serves the elixir of Indian Tea. With every cup poured, he weaves a tapestry of tradition, warmth, and hospitality, earning the title of the "Temple of Tea Service 😊 — Rahul Verulkar (@verulkar_rahul) July 23, 2023 The city has a lot of magnetic qualities. Truly Golden city.....City with the legendary Golden temple and seems to have lovable human beings like Babaji too 😍👏🥳🙏..... — Sunil Balachandran (@Sunil_bchandran) July 23, 2023 ఇదీ చదవండి: రామ నవమి అల్లర్ల కేసు.. సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాక్ -
మానవత్వం అంటే ఇది కదా! రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటున్న ఆమెను..
ఇప్పటి వరకు ఎన్నో వైరల్ వీడియోలు చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో అందరీ హృదయాలను దోచేవిధంగానూ, కదిలించేలా ఉంటుంది. రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవించే ఒక వృద్ధురాలు కలలో కూడా ఊహించి ఉండి ఉండదు. తన జీవితంలో ఇలాంటి మంచి రోజు ఒకటి ఉంటుందని, చింత లేకుండా బతకుతాను అని అనుకుని ఉండకపోవచ్చు కదా. ఆ యువకుడు ఒక్కరోజులో ఆమె జీవితాన్ని మొత్తం మార్చేశాడు. వివరాల్లోకెళ్తే...75 ఏళ్ల వృద్ధురాలు రోడ్డుపై చెత్త కాగితాలు అమ్ముకుంటూ జీవిస్తుంటుంది. ఒక యువకుడు వచ్చి ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతాడు. ఆమె చెత్తకాగితాలు అమ్ముకుంటూ బతుకుతుంటానని చెప్పింది. ఆ తర్వాత ఆ యువకుడు ఆమెను తీసుకెళ్లి షాపింగ్ చేయించి ..కూరగాయాలు, వేయింగ్ మిషన్, తోపుడు బండి వంటి అన్ని వస్తువులు కొని కూరగాయాలు అమ్ముకుంటూ బతకమని చెబుతాడు. అంతేగాదు ఆమెకు రోజు బతకడానికి కావల్సిన కనీస అవసరాలన్నింటిని సమకూరుస్తాడు. దీంతో సదరు వృద్ధురాలి సంబరపడిపోతూ ఆ యువకుడిని ఆనందంగా ఆశీర్వదిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో ఐఏఎస్ ఆఫీసర్ అవినాశ్ శర్మ పోస్ట్ చేశారు. ఆ వృద్ధురాలికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి తరుణ్ మిశ్రా అనే ఇన్స్ట్రాగ్రామర్ అని చెప్పారు. అతను తన అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియో నచ్చడంతో షేర్ చేసినట్లు తెలిపారు. అంతేగాదు నెటిజన్లు ఆ వృద్ధురాలికి చేసిన సాయానికి సదరు యువకుడిని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. Humanity.🙏🙏🙏 pic.twitter.com/NUZTGEB6Cp — Awanish Sharan (@AwanishSharan) October 18, 2022 View this post on Instagram A post shared by TARUN MISHRA (@tarun.mishra17) (చదవండి: చికెన్ బిర్యానీ కోసం ఏకంగా రెస్టారెంట్‌ని తగలెట్టేశాడు) -
ఒక్కరాత్రిలో.. ఆమె జీవితమే మారిపోయింది!
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అది ఏ రూపంలో అయినా సరే!. కానీ, సమయానికి అది బయటపడితేనే.. గుర్తింపు దక్కేది. అందుకు ఎవరో ఒకరి ప్రోత్సాహం అవసరం కూడా. ఇవాళ రేపు ఓవర్‌నైట్ సెన్సేషన్స్‌కి ఒక వేదిక అయ్యింది ఇంటర్నెట్. బచ్పన్ కా ప్యార్, కచ్చా బాదామ్ లాంటి వాళ్లు ఇలా పాపులర్ అయినవాళ్లే. ఈ లిస్ట్‌లో ఇప్పుడు చేరిపోయింది బెలూన్లు అమ్ముకునే యువతి కిస్బూ. కిస్బూ రాజస్థానీ కుటుంబానికి చెందిన అమ్మాయి. కేరళలో ఆమె కుటుంబం సెటిల్ అయ్యింది. రోడ్ల మీద, సిగ్నళ్ల దగ్గర బెలూన్లు, బొమ్మలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తోంది ఈమె కుటుంబం. అయితే అండలూర్ కవూ జాతరకు బుగ్గలు అమ్మడానికి వెళ్లిన కిస్బూ జీవితం.. రాత్రికి రాత్రే ఊహించని మలుపు తిరిగింది. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ అయిన అర్జున్ కృష్ణన్.. సరదాగా జాతరకు వెళ్లి ఫొటోలు తీయసాగాడు. అక్కడ అర్జున్.. అనుకోకుండా అక్కడే బుగ్గలు అమ్ముకుంటున్న కిస్బూను క్లిక్‌మనిపించాడు. ఆ ఫొటో అద్భుతంగా వచ్చింది. దీంతో ముగ్దుడైన అర్జున్..ఆ ఫొటోను కిస్బూ, ఆమె తల్లికి చూపెట్టాడు. ఆపై సోషల్ మీడియాలోనూ ఆ ఫొటో వైరల్ కావడానికి ఎంతో టైం పట్టలేదు. దీంతో స్టైలిష్ రమ్య ఆధ్వర్యంలో ఆమెతో కొన్ని ఫొటోషూట్లు చేయించారు. దీంతో ఇప్పుడామె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోయింది. View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) సిగ్నళ్ల దగ్గర బుడగలు అమ్ముకునే కిస్బూ.. మోడలింగ్ ఫొటోషూట్లు వైరల్ కావడం, ఆమెకు పలు బ్రాండ్స్ అవకాశాలు దక్కడంపై ఫొటోగ్రాఫర్ అర్జున్ స్పందించాడు. తాను తీసిన ఒక్క ఫొటో వల్ల ఆమె జీవితం మారిపోవడం సంతోషంగా ఉందని అన్నాడు. ఇంత గుర్తింపునకు కారణమైన అర్జున్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు కిస్బూ, ఆమె తల్లి. View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) -
Kacha Badam Singer: కచ్చా బాదామ్ సింగర్‌కు యాక్సిడెంట్
కచ్చా బాదామ్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్‌తో విపరీతంగా ఆదించారు.. ఇంకా ఆదరిస్తున్నారు జనాలు. పచ్చి పల్లీలు అమ్ముకునే ఓ వీధివ్యాపారి.. ఊరూరా తిరుగుతూ అరిచిన అరుపులనే పాటగా మలిచి క్రేజీనెస్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆ పల్లీల వ్యాపారి జీవితమే మారిపోయింది. అయితే.. తాజాగా ఈ వైరల్ సెన్సేషన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ‘పాత సామాన్లు ఇచ్చి.. పచ్చి పల్లీలు తీసుకెళ్లండంటూ’ గల్లీలో తిరుగుతూ తనదైన శైలిలో పాడుతూ జనాల్ని ఆకట్టుకునేవాడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన భూబన్ బద్యాకర్. కచ్చా బాదామ్ పాటతో క్రేజ్‌తో పాటు అవతారమే పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో దక్కిన కొద్దిపాటి రెమ్యునరేషన్‌తో సెకండ్ హ్యాండ్ కారు కూడా కొనుక్కున్నాడు. సోమవారం స్వయంగా తానే కారును నేర్చుకునే క్రమంలో యాక్సిడెంట్‌కు గురయ్యాడు అతను. ఛాతీలో బలమైన గాయం కావడంతో కుటుంబీకులు అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం భూబన్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ఇక ‘కచ్చా బాదామ్’ భూబన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామం.. భూబన్ స్వస్థలం. భార్యతో పాటు ముగ్గురు పిల్లల తండ్రైన భూబన్.. పచ్చి పల్లీలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ.. వాటిని జంక్ షాపుల్లో అమ్మి ఆ వచ్చే 200, 300 వందల రూపాయలతో జీవనం కొనసాగించేవాడు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్స్, ఇన్‌స్టా రీల్స్‌తో కచ్చా బాదామ్ ఫేమస్ అయ్యింది. మొదట్లో సాంగ్ వైరల్ అయినప్పుడు.. తనకు క్రెడిట్ దక్కలేదని గోల చేసిన భూబన్, తీరా అది దక్కాక పూర్తిగా మారిపోయాడు. ఇకపై పల్లీలు అమ్ముకోనని, సింగింగ్ కెరీర్లోనే కొనసాగుతానని, ఈ క్రేజ్ కారణంగా తనను కిడ్నాప్ చేస్తారేమోనని భయంగా ఉందంటూ భూబన్ పోలీసులను సైతం ఆశ్రయించాడు. ఆ బిల్డప్ చూసి అప్పటిదాకా అతన్ని మెచ్చుకున్న వాళ్లే.. తిట్టకున్నారు కూడా. తాజాగా కోల్‌కతాలోని ఓ పోష్ క్లబ్లో అతగాడు రాక్‌స్టార్ అవతారంలో ప్రదర్శన కూడా ఇవ్వడం చూసి ముక్కున వేలేసుకున్నారు చాలామంది. సంబంధిత వార్త: కచ్చా బాదామ్ అంటూ ఊపేసిన పోరి గురించి తెలుసా?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
Advertisement