-
సెల్ఫీతో కామెర్లను గుర్తించవచ్చు!
రక్తంలోకి బైలిరూబిన్ అనే పదార్థం ఎక్కువగా విడుదల కావడం వల్ల వచ్చే కామెర్ల వ్యాధిని ముందుగా గుర్తించడం కష్టం. రక్త పరీక్ష చేస్తేగానీ గుర్తించలేని ఈ వ్యాధిని.. కేవలం ఓ సెల్ఫీతో గుర్తించవచ్చట. అదీ ముందుగానే. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఇందుకు సంబంధించి ఓ యాప్‌ను అభివృద్ధి చేశారు. ఈ యాప్‌లోని కెమెరాతో సెల్ఫీ దిగితే.. మనకు కామెర్ల(జాండీస్) వ్యాధి వచ్చే అవకాశముందా? లేదా? అనే విషయాన్ని ముందుగానే గుర్తించి చెబుతుందట. ఈ విషయమై యూనివర్సిటీ శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ.. ‘జాండీస్ రావడానికి ముందు మనిషి కళ్లలో అనేక మార్పులు సంభవిస్తాయి. వాటిని గుర్తించి, విశ్లేషించి వందశాతం సరైన సమాచారం అందించేలా ఈ యాప్‌ను అభివృద్ధి చేశాం. అంతేకాదు పాంక్రియాటిక్ కేన్సర్‌ను కూడా ముందుగానే గుర్తించవచ్చు. గుర్తించిన వెంటనే చికిత్స చేయించుకుంటే ప్రాణహాని తప్పుతుంది’ అని ఆయన అన్నారు. -
విహారయాత్రలో విషాదం
♦ జలాశయంలో ఈతకు దిగి కప్పరాడ వాసి గల్లంతు ♦ జాడ లేని శివరామకృష్ణ ♦ కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు వారంతా కుటుంబ సభ్యులతో సరదాగా విహారానికి బయలుదేరారు. మార్గమధ్యలో సెల్ఫీలు దిగుతూ ఎంతో ఉత్సాహంగా ప్రయాణం సాగించారు. ఇంతలోనే కళ్యాణపు లోవ వచ్చింది. ఎంతో ఉత్సాహంతో రిజర్వాయర్, చుట్టుపక్కల ప్రాంతాలు చూసి ముగ్ధులయ్యారు. సరదాగా ఈత కొట్టేందుకు రిజర్వాయర్‌లోకి దిగారు. అంతే వీరిలో ఓ వ్యక్తి గల్లంతు కావడంతో విషాదం అలుముకుంది. రావికమతం (చోడవరం): కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన బృందంలో ఓ వ్యక్తి కళ్యాణపులోవ జలాశయంలో గల్లంతు కావడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కంచరపాలెంలోని కప్పరాడ ప్రాంతానికి చెందిన బిక్కవోలు శివరామకృష్ణ (26) జలాశయంలో గల్లంతయ్యాడు. శివరామకృష్ణ ఆయన సోదరి బంధువులు అడ్డురోడ్డు నుంచి కొరిబిల్లి రాజు, కాండ్రేగుల దొరబాబు, పలివెల అభిజ్ఞ, వరలక్ష్మి, రామలక్ష్మిలతో కలిసి రావికమతం మండలం కళ్యాణపులోవ రిజర్వాయర్‌కు ఆదివారం విహార యాత్రకు బయలుదేరారు. వారం రోజులు క్రితం జోగుంపేటలోని అమ్మగారింటికి వెళ్లిన భార్య పార్వతిని రమ్మని శివరామకృష్ణ చెప్పాడు. మూడు ప్రాంతాల నుంచి వేర్వేరుగా వచ్చిన వీరు నర్సీపట్నంలో కలుసుకుని అక్కడ నుంచి కళ్యాణపులోవ రిజర్వాయర్ ప్రాంతానికి ఆటోలో పయనమయ్యారు. జలాశయం వద్ద పోతురాజుబాబు ఆలయాన్ని, రిజర్వాయర్ పరిసరాలను సందర్శించారు. అనంతరం శివరామకృష్ణ జలాశయంలో ఈతకని దిగాడు. అతనితో వచ్చిన వారు జలాశయంలో లోతు తక్కువగా ఉన్న ప్రాంతంలో స్నానాలు చేస్తున్నారు. ఇంతలోనే శివరామకృష్ణ జలాశయం క్లస్టర్ గేట్లు వద్ద గల ప్రాంతంలో ఉన్న నీటిలో స్నానం చేస్తానని భార్యకు, వెంట వచ్చిన వారికి చెప్పి అక్కడికి వెళ్లాడు. క్లస్టర్ గేట్లు వద్ద స్నానం చేయడం ప్రమాదమని, లోతు, నీటి మట్టం అధికంగా ఉంటుందని భార్య పార్వతి భర్తకు వివరించింది. అయితే తనకు ఈత వచ్చని, ఏమి కాదని చెప్పి క్లస్టర్ గేట్లుపై నుంచి నీటిలోకి దూకాడు. మొదటిసారి బయటకు వచ్చిన శివరామకృష్ణ రెండోసారి కుడా గేట్లపై నుంచి నీటిలోకి దూకాడు. అంతతోనే నీటిలో మునిగిపోతుండడంతో తన భర్తను రక్షించాలని భార్య పార్వతి, బంధువులు కేకలు వేశారు. దీంతో స్థానికులు వచ్చేలోగానే శివరామకృష్ణ నీటిలో మునిగిపోయాడు. వారు ఎంతగా జలాశయంలో వెదికినా శివరామకృష్ణ జాడ లభించలేదు. దీంతో భార్య పార్వతి, బంధువుల రోదన అందరినీ కంటతడి పెట్టించింది. శివరామకృష్ణ 2013లో జోగుంపేటకు చెందిన పార్వతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల బాబు చందు ఉన్నాడు. గల్లంతైన సమాచారాన్ని తెలుసుకున్న స్థానిక సర్పంచ్ వంజరి గంగరాజు, వీఆర్వో ఎ.ఎస్.నాయుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ సమాచారాన్ని కొత్తకోట పోలీసులకు తెలిపారు -
సెల్ఫీ దిగాలంటే..‘పేటీఎం’ చేయాల్సిందే!
వినూత్న రీతిలో ఓ కళాకారుడి విరాళాల సేకరణ హైదరాబాద్: భుజాన క్రికెట్ బ్యాట్‌తో హుషారుగా మెట్లు దిగుతున్న ఇతని పేరు నూకాజీ. చదువుకున్నది గ్రాడ్యుయేషన్. అయినా కళల పట్ల మక్కువతో దాన్నే జీవనాధారంగా చేసుకున్నాడు. ఇటీవల ఏర్పడిన నగదు కొరతతో రాబడి తగ్గిపోవడంతో ఓ ఉపాయంగా ‘పేటీఎం’ద్వారా ఆన్లైన్ విరాళాలు స్వీకరిస్తున్నాడు. ప్రతి ఆదివారం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నెక్లెస్ రోడ్డులో ఇలా వివిధ వేషధారణలతో పేటీఎం ట్యాగ్‌తో కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తు్తన్నాడు. ఇతనితో దిగే మొదటి సెల్ఫీ ఉచితం. తరువాత దానికి మాత్రం పేటీఎం ద్వారా పేమెంట్ చేయాల్సిందే. మూసాపేట మెట్రో రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం కనిపించిన దృశ్యం ఇది.. -
ఆ ప్రశ్న వింటే నాకు ఒళ్లు మంట
ఫస్ట్ లవ్.. ఫస్ట్ బైక్/కార్.. ఫస్ట్ జాబ్.. ఇలా జీవితంలో తొలిసారి జరిగే ముఖ్యమైన విషయాలు మనకు తీపి గుర్తు అవుతాయి. అందుకే మొదటి లవ్ గురించి, మొదటి వాహనం, ఉద్యోగం గురించి అడిగితే టకీమని సమాధానం చెప్పేస్తారు. అదే, ఈ మధ్య చివరిగా ఎప్పుడు అబద్ధం ఆడారు? ఫలానా వర్క్ లాస్ట్ టైమ్ ఎప్పుడు చేశారు? అని అడిగితే ఠక్కున సమాధానాలు చెప్పేవారు ఎంత మంది ఉంటారు? కష్టమే కదూ! ప్రియాంకా చోప్రా మాత్రం ఫటాఫట్ చెప్పేశారు. మరో పది రోజుల్లో ఈ ఏడాదికి టాటా చెప్పేయడానికి రెడీ అవుతోన్న ప్రియాంకా చోప్రా... ‘2016 లాస్ట్ థింగ్స్’ పేరిట చెప్పిన కబుర్లు చదవండి. ► ‘షూటింగ్ లేట్ కావడంతో రాత్రి ఆలస్యంగా నిద్రపోయా. అందువల్లే ఉదయం లేటుగా నిద్రలేచా’ – నేను లేటుగా లేచిన ప్రతిసారీ ఈ అబద్ధం చెబుతుంటా. బహుశా ఈ ఏడాది నేను చెప్పే చివరి అబద్ధం ఇదే అవుతుందేమో. వచ్చే ఏడాది నిజాలే చెబుతారా? అని అడగకండి. ఇప్పుడే చెప్పలేను. ► నేను ఓ ఫొటోషూట్‌కి వెళితే అక్కడ నా చుట్టూ ఓ కుక్కపిల్ల తిరిగింది. ఆ పప్పీని వదలడం ఇష్టం లేక ఇంటికి తీసుకెళ్లా. దాన్ని దత్తత తీసుకున్నా. డయానా అని పేరు పెట్టా. భలే ముద్దు ముద్దుగా ఉంటుంది తెలుసా. డయానాతో ఫొటోలు తీసుకోవడం నాకో అలవాటుగా మారింది. చివరగా తనతోనే ఓ ఫొటో (సెల్ఫీ) తీసుకున్నా. ► నేను ప్రముఖ హాలీవుడ్ నటి ఇవా మెండిస్లా ఉన్నానని అంటుంటారు. ఈ మధ్య నన్నొకరు ఆమెతోనే పోల్చారు. ఆ తర్వాత ఎవరూ పోల్చలేదు. సో.. ఇవా మెండిస్‌తో నన్ను పోల్చడం ఇదే చివరిసారి అవుతుందేమో. ► 2005 లేదా 2006లో నిద్రలేకుండా షూటింగ్స్ చేసిన రోజులున్నాయి. ఎందుకంటే ఒకేసారి నాలుగైదు సినిమాలు అంగీకరించా. ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాది ఆ పరిస్థితి వచ్చింది. ఇండియాలో ‘బాజీరావ్ మస్తానీ ప్రమోషన్లు, అమెరికాలో ‘క్వాంటికో’ టీవీ సిరీస్ షూటింగ్.. ఇలా ఈ ఏడాది ప్రారంభంలో కంటిన్యూస్‌గా వర్క్ చేశా. అప్పుడు నిద్రలేని రాత్రులు గడిపా. ఇండియా, అమెరికాల మధ్య చక్కర్లు కొట్టా. ఒక్కోసారి ఫ్లైట్‌లోనే చిన్నపాటి కునుకు తీసేదాన్ని. నిద్ర లేకుండా పని చేయడం ఇదే చివరిసారి అయితే బాగుంటుందనుకుంటున్నా. ► వరుస చిత్రీకరణలు, ప్రయాణాలతో ఈ ఏడాదంతా క్షణం తీరిక లేకుండా గడిపా. కానీ, లాస్ట్ టైమ్ షాపింగ్ చేసినప్పుడు నాకోసం నేను ఓ డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నా. త్వరలో ఆ నెక్లెస్‌ను మీకు చూపిస్తా! ► సాధారణంగా చాలామంది ప్రతి సందర్భంలోనూ ‘ఎలా ఉన్నారు?’ అనే ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్న అంటే నాకు చిరాకు. ఆ ప్రశ్న వింటే కోపం వచ్చేస్తుంది. అప్పుడు నేను ‘ఆకలి వేస్తుందనో, చలిగా ఉందనో’ చెబుతుంటా. చివరిసారిగా కోపం వచ్చింది కూడా ఎవరో ఈ ప్రశ్న అడిగినప్పుడే. ► ఈ ఇయర్ ఎండింగ్లో దేవుడు నన్నో కోరిక కోరుకోమంటే ఈ వయసులోనే ఓ వారం రోజులు ఉంచేయమంటా. ఇప్పుడు నాకు 34 ఏళ్లు. ఈ ఏడాదంతా గొప్పగా గడిచింది. -
నలుగురు తమ్ముళ్లు.. ఓ అన్నయ్య... సూపర్ సెల్ఫీ
మెగా బ్రదర్స్ ముగ్గురిలో చిన్నోడు పవన్‌కల్యాణ్. రియల్ లైఫ్‌లోనే ఆయన తమ్ముడు. కొత్త సినిమాలో పెద్దన్న పాత్రను పోషిస్తున్నారు. పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘కాటమరాయుడు’. కిశోర్ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా నటిస్తున్నారు పవన్. నలభై రోజులుగా పొల్లాచ్చిలో జరుగుతోన్న షూటింగ్ చివరికి వచ్చేసిందట! పొల్లాచ్చి షెడ్యూల్లో పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్న శివబాలాజీ, అజయ్, చైతన్యకృష్ణ, కమల్ కామరాజులు కూడా పాల్గొంటున్నారు. మంగళవారం లంచ్ టైమ్‌లో తమ్ముళ్లతో కలసి ఓ సెల్ఫీ తీసుకున్నారు పవన్. ఫొటోలో మీరు చూస్తున్నది ఆ సెల్ఫీనే. ‘‘పవన్ చూపించే ప్రేమ, ఆప్యాయతలకు హ్యాట్సాఫ్. ఆయన్ను కలసిన తర్వాత అభిమానించకుండా ఉండలేం. నలభై రోజులుగా ఆయనతో కలసి షూటింగ్ చేయడం ఆనందంగా ఉంది’’ అని ఈ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చైతన్యకృష్ణ పేర్కొన్నారు. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ స్వరకర్త.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్‌రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్‌దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
Advertisement